వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీలో టీడీపీ స్లీపర్ సెల్స్: వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి కాల్ రికార్డ్స్‌పై సజ్జల క్లారిటీ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందంటూ టీడీపీ చేస్తోన్న విమర్శలు, ఆరోపణలను వైసీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణా రెడ్డి తిప్పికొట్టారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంలో కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందంటూ వస్తోన్న వార్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తోన్న ఆరోపణలను వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణా రెడ్డి తిప్పికొట్టారు. అవినాష్‌ రెడ్డి కాల్‌ రికార్డ్స్ లల్లో సంచలనాలేవీ లేవని తేల్చి చెప్పారు. అలాంటివేవీ లేకపోవడం వల్ల టీడీపీ, దాని అనుకూల మీడియా నిరాశకు గురైందని ఎద్దేవా చేశారు.

జగన్ కు చెప్పడం తప్పా?

జగన్ కు చెప్పడం తప్పా?

వివేకానంద రెడ్డి హత్యకు గురైన విషయాన్ని తెలియజేయడానికే అవినాష్ రెడ్డి వైఎస్ జగన్ కు ఫోన్ చేశారని, అలా చేయడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. అవినాష్‌ రెడ్డి ఫోన్‌ ను పోలీసులు ఆ రోజే చెక్‌ చేశారని గుర్తు చేశారు. జగన్‌తో మాట్లాడటానికి నవీన్‌కు అవినాష్‌ రెడ్డి ఫోన్‌ చేశారని వివరించారు. ఈ విషయంపై టీడీపీ అనుకూల మీడియా రాద్ధాంతం చేస్తోందని, ఏదో జరిగిపోయిందంటూ హడావుడి చేస్తోందని ధ్వజమెత్తారు.

జగన్ దగ్గర ఫోన్ లేదు..

జగన్ దగ్గర ఫోన్ లేదు..


పోలీసులు విచారణకు పిలిస్తే నవీన్, కృష్ణమోహన్‌ రెడ్డి హాజరయ్యారని, దీనిలో కొత్త కోణం ఏముందని సజ్జల ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అవినాష్‌ రెడ్డి జమ్మలమడుగుకు వెళ్తోండగా వివేకా బావమరిది శివప్రసాద్‌ రెడ్డి ఆయనకు ఫోన్‌ చేశారని, అందుకే ఆయన పులివెందులకు వెనక్కి వచ్చారని అన్నారు. ఆ ఫోన్ రాకపోయి ఉంటే అవినాష్ రెడ్డి వెనక్కి వచ్చేవారు కాదేమోనని వ్యాఖ్యానించారు. దీన్ని ఆధారంగా చేసుకుని ఈ హత్యలో ఆయన హస్తం ఉందంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు రాజకీయాల్లో చిన్న పార్ట్..

చంద్రబాబు రాజకీయాల్లో చిన్న పార్ట్..

తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు చేసే నీచ రాజకీయంలో ఇదొక ఒక చిన్న పార్ట్‌ మాత్రమేనని, రానున్న రోజుల్లో వాళ్లు ఇంకా ఎన్ని డ్రామాలు చేస్తారోనని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఒంటి చేత్తో చప్పట్లు కొట్టి చప్పుడు సృష్టించగలిగే శక్తి చంద్రబాబుకు ఉందని చరకలు అంటించారు. ఇందులో ఎవరెవరు సుత్రదారులు ఉన్నారో ప్రజలకు తెలుసునని అన్నారు. ఈ కేసు నిలబడదని, ఈ అంశంపై తాము ప్రతిసారి వివరణ ఇవ్వాల్సి వస్తోందని వివరించారు.

అక్రమ కేసుల్లో..

అక్రమ కేసుల్లో..


జగన్‌ పై ఇదివరకు సీబీఐ కేసు నమోదు చేసినప్పుడు విచారణ ఎలా సాగిందో అందరూ చూశారని సజ్జల వివరించారు. విచారణకు ఎవరిని పిలవాలో కూడా టీడీపీ అనుకూల మీడియాలో ముందే వచ్చేవని గుర్తు చేశారు. విచారణ చేసే సమయంలో ఏం జరుగుతుందో కథలు, కథలుగా వచ్చేవని, ఇప్పుడు కూడా సీబీఐ, టీడీపీ అనుకూల మీడియా, చంద్రబాబుకు అవే లింకులు ఉన్నాయని, అందుకే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ఇంతకంటే పెద్ద ఆరోపణలు..

ఇంతకంటే పెద్ద ఆరోపణలు..

గతంలో జగన్ పై, తమ పార్టీపై ఇంతకంటే పెద్ద ఆరోపణలనే చంద్రబాబు చేశారని, వాటిని ప్రజలు నమ్మలేదని సజ్జల పేర్కొన్నారు. టీడీపీ వైఖరి ఎలాంటిదో, ఆ పార్టీ నాయకుల కుట్ర బుద్ధి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ప్రజలు విశ్వసించలేదని చెప్పారు. చంద్రబాబు, బీజేపీలో టీడీపీ స్లీపర్‌ సెల్స్‌పైనే తమకు అనుమానాలు ఉన్నాయని, వ్యవస్థను ప్రభావితం చేయగల శక్తి, సామర్థ్యంలో చంద్రబాబు సిద్ధహస్తుడని, అందుకే రాజకీయాల్లో ఇంకా కొనసాగుతున్నారని ధ్వజమెత్తారు.

English summary
YSRCP leader Sajjala Rama Krishna Reddy made key comments on MP Avinash Reddy in YS Viveka murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X