వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైజాగ్ వ్యాఖ్యలు:ఎన్నెన్నో ''తగులబెట్టారని '' చంద్రబాబుపై జగన్ పార్టీ ఫైర్

వెైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బురదచల్లుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :వెైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బురదచల్లుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

విశాఖ పట్టణాన్ని తగులబెట్టేందుకు అనుమతి ఇవ్వాలా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. విశాఖను తగులబెట్టేందుకు ఎవరు వచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

చంద్రబాబునాయుడు తమ పార్టీపై అనవసర ఆరోపణలుచేశారని ఆయన చెప్పారు. దారుణమైన వ్యాఖ్యలుచేశారని ఆయన మండిపడ్డారు.

వైఎస్ఆర్ కుటుంబ చరిత్ర తెలుసుకోండి

వైఎస్ఆర్ కుటుంబ చరిత్ర తెలుసుకోండి

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఓ చరిత్ర ఉందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. .రెండు దపాలు వైఎస్ఆర్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకొన్నారని ఆయన గుర్తు చేశారు.విశాఖకు సాఫ్ట్ వేర్ పార్క్ , టూ టైర్ అభివృద్ది కోసం నిధులొచ్చిన విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు.వాల్తేర్ క్లబ్ లో ఏం జరిగిందో అందరికీ తెలుసునని చెప్పారు. గత ఎన్నికల్లో ఓడినంత మాత్రాన ఏమీకాదన్నారు. మళ్ళీ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామన్నారు.పులివెందులలో 1998 లో వైఎస్ రాజారెడ్డి హత్యకు గురైతే ..ఈ కేసులో ప్రధాన నిందితుడికి రక్షణ కల్పించారని చెప్పారు.రాజారెడ్డి హత్యకు వైఎస్ఆర్ ప్రతీకారానికి ప్రయత్నించలేదన్నారు.వైఎస్ మరణంపై కూడ అనేక అనుమానాలున్నాయని చెప్పారు.

ప్రత్యేక హోదా వల్ల అభివృద్ది సాద్యం

ప్రత్యేక హోదా వల్ల అభివృద్ది సాద్యం

ప్రత్యేక హోదా వల్ల పారిశ్రామికాభివృద్ది ఎలా జరుగుతోందని చంద్రబాబు ప్రశ్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రత్యేక హోదా ఇచ్చిన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోకి వెళ్ళి టిడిపి నాయకులు ఎందుకు పరిశ్రమలు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు.

వెంకయ్య ఎందుకు మాట మార్చారు?

వెంకయ్య ఎందుకు మాట మార్చారు?

ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తావించినప్పుడు వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు. ప్రత్యేక హోదా రెండేళ్ళు సరిపోదు, కనీసం పదిహేనేళ్ళు ప్రత్యేక హోదా ఉండాలని వెంకయ్య కోరాడని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం ఎందుకు వెంకయ్యనాయుడు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.900 కిలోమీటర్లకు పైగా తీరప్రాంతమున్నందున మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలున్న ఎపికి ప్రత్యేక హోదా వస్తే మరింత అభివృద్ది జరిగే అవకాశం ఉండేదని అందరి ఆకాంక్ష అని సజ్జల చెప్పారు.ప్రస్తుత వేగంతో వెళ్తే యాభై ఏళ్ళుదాటినా అభివృద్ది సాధ్యం కాదన్నారాయన.

ప్రశాంతతకు భంగం కల్గించింది ఎవరు?

ప్రశాంతతకు భంగం కల్గించింది ఎవరు?

విశాఖ పట్టణం ప్రశాంత నగరం.అయితే ఈ నగరంలో ప్రశాంతతకు భంగం వాటిల్లేలా చేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు.రిపబ్లిక్ డే పవిత్రమైన రోజు. ఆ రోజును అంతా ప్రశాంతంగా పండుగలా చేసుకొంటారు. కొవ్వొత్తుల ర్యాలీ అనేది ఏ రకంగానూ భంగం కల్గించేది కాదన్నారాయన.భావ ప్రకటన స్వేచ్ఛను పండుగలా చేసుకొన్నరోజు కాబట్టే ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు.ప్రశాంత కార్యక్రమాన్ని రెచ్చగొట్టేలా చేసిందెవరని ఆయన ప్రశ్నించారు.

జగన్ ను రన్ వే పైనే ఎందుకు ఆపారు?

జగన్ ను రన్ వే పైనే ఎందుకు ఆపారు?

విశాఖ నగరంలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన విపక్ష నాయకుడు జగన్ ను కనీసం లాంజ్ లోకి కూడ రాకుండా రన్ వే పైనే ఆపడంలో ఉద్దేశ్యమేమిటని ఆయన ప్రశ్నించారు.భాద్యత కల ప్రతిపక్ష నాయకుడు వచ్చాడు. ఆయనను ఆపడంలో ఉద్దేశ్యమేమిటో చెప్పాలని ఆయన సిఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు విభజన చట్టంలోనే ఉందన్నారు. కొత్తగా బాబు తెచ్చిందేమీ లేదన్నారు.

English summary
ysrcp leader sajjala ramakrishna reddy condemned ap chief minister chandrababu comments
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X