వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ నాయకుల్లో గ్రూపు తగాదాలు..! సీనియర్ జూనియర్ నేతల మద్య తలెత్తుతున్న 'ఇగో' సమస్య..!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు పూర్తవుతున్నా ఆ పార్టీ నేతలు ఇంకా కుదురుకున్నట్టు కనిపించడం లేదు. వైసీపి లో సీనియర్, జూనియర్ విభేదాలు తారా స్థాయిలో నడుస్తున్నట్టు తెలుస్తోంది. జూనియర్ నాయకులను సీనియర్ నేతలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని, నియోజక వర్గాల్లో మంత్రి స్థాయి నేతలను కూడా సీనియర్ నాయకులు గౌరవించడం లేదనే చర్చ జరుగుతోంది. ఇవే రాజకీయాలు గ్రూపు తగాదాలుగా మారే అవకాశం ఉందని, నేతల మద్య చిన్నంతరం, పెద్దంతరం తేడా వస్తే పార్టీకే నష్టమనే భావన ఇతర నేతల నుండి వ్యక్తం అవుతోంది. ఇదే అంశం పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గర కొంత మంది యువ నాయకులు ప్రస్థావించినట్టు తెలుస్తోంది.

Recommended Video

సీఎంకు అభినందనలు తెలుపుతున్న బడుగు బలహీన వర్గాలు
నాయకుల మద్య సహకారం కరువు..!!

నాయకుల మద్య సహకారం కరువు..!!

వైసీపి నేతల మద్య ఇగో సమస్య..! నాయకుల మద్య సహకారం కరువు..!!
పదేళ్ల తరువాత అధికారం వచ్చినా ఏమి చేయలేని పరిస్థితి. పదేళ్ల పాటు ఖర్చును రాబట్టుకుందామంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోరు. పోనీలే ఏదో చిలక్కొట్టుడు కొడదామంటే మీడియా లుక్కేస్తుందనే భయం. హాయిగా ఎంజాయ్ చేస్తున్న పదవులు పోతాయనే బెంగ కూడా. అంతే కాకుండా జూనియర్ మంత్రులు, సీనియర్ నేతలంటూ విభేదాలు. ఇదంతా ఏపీ ప్రభుత్వంలోని మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకూ నెలకొన్న వింత పరిణామం. కళ్లెదుట రొయ్యల మూట పెట్టి చేతులు కట్టేసినట్టుందట ప్రజాప్రతినిధులకు. ఎంతైనా చంద్రబాబు నయం.. ఐదేళ్లపాటు ఏవో కమిటీలు వేసి.. నామినేటెడ్ పోస్టులిచ్చి.. కాంట్రాక్టులు ఇచ్చి మరీ సంపాదన మార్గం చూపాడు. జగన్ అసలు ఆ దిశగా కూడా ఆలోచించడం లేదని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

సీనియర్ జూనియర్ నేతలంటూ విభేదాలు..! జూనియర్ నేతలకు సహకరించని సీనియర్లు..!!

సీనియర్ జూనియర్ నేతలంటూ విభేదాలు..! జూనియర్ నేతలకు సహకరించని సీనియర్లు..!!

ఇటీవల ఓ మంత్రికి అత్యవసరంగా యాభై లక్షలు అవసరమైతే.. వాటిని సేకరించేందుకు నానాతంటాలు పడ్డాడట. ఇకపోతే ఈ సారి చాలామంది జూనియర్లు.. పైగా రాజకీయ అనుభవం లేని వారు కూడా అసెంబ్లీ లోకి కాలుపెట్టారు. సీనియర్లు చాలామందికి మంత్రి పదవి వస్తుందనుకుంటే జగన్ గండికొట్టారనే చర్చ జరుగుతోంది. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ముఖ్యంగా అమాత్యుల్లో కూడా సీనియర్లు, జూనియర్లుగా విడిపోయి మరీ కోట్లాడుకుంటున్నారట. ఎవరి లెక్కలు.. ఎవరి బలం వారికే ఉందనే రీతిలో బాహాటంగానే విమర్శించుకుంటున్నారట.

 వైసీపిలో వింత పరిణామాలు..! పరిస్థితులను గమనిస్తున్న సీఎం..!!

వైసీపిలో వింత పరిణామాలు..! పరిస్థితులను గమనిస్తున్న సీఎం..!!

అన్నా.. మాకో పనిచేసి పెట్టమంటూ ఎమ్మెల్యేలు మంత్రులకు వద్దకెళ్లినా.. ముఖం చూడట్లేదట. పైగా ఉండేది రెండున్నరేళ్ల పదవులు కాబట్టి వీళ్ల సంగతి తరువాత చూద్దామంటూ ఎమ్మెల్యేలు కూడా సిఫార్సుల కోసం మంత్రుల వద్దకు వెళ్లటం మానేశారట. ఇదిలా ఉంటే.. మరోవైపు మంత్రి పదవులకు అడ్డుపడటంలో తమ సొంతపార్టీ నేతలే పైరవీలు చేశారనే ఉద్దేశంతో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట. సుబ్రమణ్యం అదేనండీ సీఎస్ తో చెప్పించుకుని తమ పని కానిచ్చుకుందామంటే.. పాపం ఆయన మాట కూడా అంతంతమాత్రమే చెల్లుబాటు అవుతుందనే వాదన కూడా నానుతోందట.

విభాదాలు పర్యవసానం ఎలా ఉంటుంది..! చర్యలకు ఉపక్రమించబోతున్న అదిష్టానం..!!

విభాదాలు పర్యవసానం ఎలా ఉంటుంది..! చర్యలకు ఉపక్రమించబోతున్న అదిష్టానం..!!

టీడీపీ హయాంలో ఎవరో ఒక మంత్రి తమకు అనుకూలంగా ఉంటూ అత్యవసర పనులు చేసిపెట్టేవాడంటూ ఓ సీనియర్ వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన చెందుతున్నారట. తనకు మంత్రి పదవి కొద్దిలో తప్పిపోవటానికి నాటి సీనియర్ నాయకుడు కారణమంటూ అక్కసు వెళ్లగక్కటం. మంత్రులుగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నేతల పనితీరుపై సీనియర్లు విమర్శలు చేస్తున్నారట. ఉన్నతాధికారులు కూడా సరైన అవగాహనలేని మంత్రుల వద్ద ఏదో ఒకటి చెప్పేసి పబ్బం గడుపుకుంటున్నారట. ఇటువంటి అమాత్యులుంటే తమకూ చికాకులు ఉండవంటూ తెగ సంబరపడుతున్నారంటూ వైసీపీ మంత్రులే సెటైర్లు వేసుకోవటం కొసమెరుపు.

English summary
In Andhra Pradesh, the party leaders have not yet been relieved that the YSR government has been completed for two months. Senior and junior differences in the VCP seem to be running at the Tara level. There is talk of senior leaders not respecting the junior leaders and senior leaders and also the minister level head in the constituencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X