విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైఆంధ్ర ఉద్యమ నేత విగ్రహం తొలగింపు, బెజవాడలో ఉద్రిక్తత, యలమంచిలి రవి అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద శనివారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జై ఆంధ్ర ఉద్యమ నేత కాకాని వెంకటరత్నం విగ్రహం తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ విషయం తెలిసి వైసీపీ నేత యలమంచిలి రవి అడ్డుకునే ప్రయత్నం చేశారు.

విగ్రహ కమిటీకి చెప్పకుండా కాకాని విగ్రహాన్ని ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు ప్రొక్లెయినర్‌ని అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు యలమంచిలి రవిని అరెస్టు చేశారు.

YSRCP leader yalamanchili Ravi arrested

అనంతరం భారీ బందోబస్తు మధ్య కాకాని విగ్రహాన్ని తొలగించారు. బ్రిడ్జి, అభివృద్ధి పనుల కోసం ఈ విగ్రహాన్ని అధికారులు తొలగించారు.

విగ్రహం తొలగింపుపై యలమంచిలి మాట్లాడుతూ.. పోలీసులు నిరంకుశంగా వ్యవహరించారని మండిపడ్డారు. విగ్రహం తొలగింపుపై ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, మరీ అర్ధరాత్రి తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు తనను బలంతంగా అరెస్టు చేశారన్నారు. అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా దొంగతనంగా తొలగించడం ఏమిటని ప్రశ్నించారు.

విగ్రహం తరలింపుపై యలమంచిలి రవితో పాటు వంగవీటి రాధాకృష్ణ కూడా నిరసన తెలిపారు. అర్ధరాత్రి సమయంలో విగ్రహం తొలగింపు సరికాదని వంగవీటి అన్నారు.

English summary
High tension has prevailed at Vijayawada Benz circle after the officials removed Kakani Venkata Ratnam statue as part of ongoing road extension and flyover works in the late night hours of Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X