నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీలో భగ్గుమన్న విబేధాలు: కావలి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గీయుల బాహబాహీ

నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గపోరు మరోసారి భగ్గమంది, వైసీపీ జిల్లా ప్లీనం సందర్భంగా కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి వర్గీయుల

By Narsimha
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గపోరు మరోసారి భగ్గమంది, వైసీపీ జిల్లా ప్లీనం సందర్భంగా కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవ చోటుచేసుకొంది. ఒకరిపై మరోకరు దాడికి పాల్పడ్డారు.

నెల్లూరు జిల్లా వైసీపీ ప్లీనరీ ఆదివారం నాడు జరిగింది. ఈ ప్లీనరీలో సమావేశ మందిరం అద్దాలు ధ్వంసం కాగా, సెక్యూరిటీ సిబ్బంది ఒకరికి చేయి విరిగింది. జిల్లా వైసీపీ ప్లీనరీ నెల్లూరులో జరిగింది.

ఈ ప్లీనరీకి ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, నెల్లూరు, తిరుపతి ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్ లతో పాటు, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు హజరయ్యారు.

Ysrcp leaders attack each and other in Nellore party plenary

కావలి నియోజకవర్గం అల్లూరు నుండి జనసమీకరణ బాధ్యతను ఆ మండల వైసీపీ అధ్యక్షుడు దండే కృష్ణారెడ్డికి అప్పగించారు. ఆయన పది వాహనాల్లో జనసమీకరణ చేపట్టారు. కృష్ణారెడ్డి ప్రస్తుత కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుడు. ప్రతాప్ కుమార్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డికి మధ్య కొంతకాలంగా వర్గపోరు నడుస్తోంది.

దీంతో కృష్ణారెడ్డి వాహనాల్లో ఎక్కినవారిని విష్ణువర్గీయులు అడ్డుకొని దించేశారు. ఆ వాహనాలన్నీ ప్లీనరీకి ఖాళీగానే వెళ్ళాయి. ప్లీనరీ వద్ద కృష్ణారెడ్డితో విష్ణు వర్గీయులు వాగ్వావాదానికి దిగారు. విష్ణు స్వంత మండలమైన అల్లూరులో జనసమీకరణ చేసే సమయంలో మాట కూడ చెప్పలేదని కృష్ణారెడ్డిని నిలదీశారు.

Recommended Video

మాటామాటా పెరిగి కృష్ణారెడ్డి, సాయిపై విష్ణు వర్గం దాడి చేసింది.పోలీసుల రాకతో గొడవ సద్దుమణిగింది. తిరిగి మధ్యాహ్న భోజన సమయంలో ప్రతాప్, విష్ణు వర్గీయులు మరోసారి వాగ్వాదానికి దిగి, బాహబాహీకి తలపడ్డారు. వీరి తోపులాట, ఘర్షణలో సమావేశ మందిరం తలుపు అద్దాలు ధ్వంసమయ్యాయి. అడ్డుకొనేందుకు వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది ఒకరికి చేయి విరిగింది. గొడవ పెరిగిపోతుండడంతో ప్లీనరీకి వచ్చిన జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులు జోక్యం చేసుకొని ఇరువర్గాలకు సర్ధిచెప్పి బయటకు పంపేశారు.

English summary
Ysrcp leaders attack each and other in Nellore party plenary on Sunday.Kavali Mla Ramreddy Pratapkumrar reddy and former MLA Vishnuvardhan Reddy groups attacked each and other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X