అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు అమరావతి ఉద్యమం స్పాన్సర్డ్‌, ఈవెంట్ మేనేజ్మెంట్.. వైసీపీ సెటైర్లు- ఎందుకంత మోజంటూ..

|
Google Oneindia TeluguNews

అమరావతి ఉద్యమం 200 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తున్న తీరుపై వైసీపీ నేతలు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. ఐదేళ్లలో అమరావతి కోసం ఏమీ చేయలేని చంద్రబాబు.. ఇప్పుడు రైతులతో స్పాన్సర్డ్ ఉద్యమం నిర్వహిస్తూ వారిని మభ్యపెట్టాలని చూస్తున్నారని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే కాంక్షతో మూడు రాజధానులు తీసుకొస్తుంటే చంద్రబాబుకు అంత బాధెందుకని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఏం అన్యాయం జరిగిందని ?

ఏం అన్యాయం జరిగిందని ?


అమరావతి ఉద్యమం 200 రోజులు పూర్తి చేసుకుందంటూ చంద్రబాబు హంగామా చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. ఏం అన్యాయం జరిగిందని ఉద్యమాలు చేస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే మూడు రాజధానులు ఏర్పాటవుతున్నాయని, ఐదేళ్లలో చంద్రబాబు రాజధాని నిర్మించలేకపోవడం కూడా ఇందుకు కారణమని కన్నబాబు విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల ఆకాంక్షలు చంద్రబాబుకు అక్కర్లేదా అని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్లలో రాజధాని పేరుతో చంద్రబాబు ప్రజాధనాన్ని విపరీతంగా వృథా చేశారని కన్నబాబు పేర్కొన్నారు.

రాష్టాన్ని మీకేమైనా రాసిచ్చారా ?

రాష్టాన్ని మీకేమైనా రాసిచ్చారా ?


గతంలో చంద్రబాబు ప్రభుత్వం అమరావతి డిజైన్లకే రూ.800 కోట్లు ఖర్చుపెట్టిందని, రాజధాని పేరుతో ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారని కన్నబాబు ఆరోపించారు. రాష్ట్రాన్ని ప్రజలు మీకేమైనా రాసిచ్చారా చంద్రబాబు... అంతా మీరు చెప్పినట్లే జరగాలనే రూల్ ఎక్కడైనా ఉందా అని కన్నబాబు ప్రశ్నించారు. కాకినాడలో మీడియాతో మాట్లాడిన కన్నబాబు... ఇక్కడ ప్రజలకు హక్కులు లేవా అని చంద్రబాబును ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ వికేంద్రీకరణ అవసరమని చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని, ఒక్క అమరావతిపైనే తన ప్రేమ చూపించారని గుర్తు చేశారు. ఇందులో మర్మమేమిటని కన్నబాబు ప్రశ్నించారు.

అమరావతి స్పాన్సర్డ్ ఉద్యమం...

అమరావతి స్పాన్సర్డ్ ఉద్యమం...


చంద్రబాబు మద్దతిస్తున్న అమరావతి ఉద్యమాన్ని కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. అమరావతి ఓ స్పాన్సర్డ్ ఉద్యమం అని ద్వారంపూడి వ్యాఖ్యానించారు. అక్కడ ఉన్నవారు నిజమైన రైతులు కాదన్నారు. చంద్రబాబుకు ఈవెంట్ మేనేజ్ మెంట్ లు చేయడం బాగా అలవాటని, గోదావరి పుష్కరాల సమయంలో ఇలాగే ఈవెంట్ మేనేజర్లకు షూటింగ్ బాధ్యతలు ఇచ్చి అమాయక జనం ప్రాణాలు తీశారన్నారు. అలాగే ఇప్పుడు అమరావతి ఉద్యమాన్ని కూడా ఈవెంట్ మేనేజర్ల చేతుల్లో పెట్టారని ద్వారంపూడి తీవ్ర విమర్శలు చేశారు.

Recommended Video

Amaravati ఉద్యమానికి 200 రోజులు, Capital Issue Remains Unresolved || Oneindia Telugu
ఉద్యమం ఎప్పుడో నీరుగారింది...

ఉద్యమం ఎప్పుడో నీరుగారింది...

చంద్రబాబు ఉద్యమాన్ని ఈవెంట్ ఆర్గనైజర్లకు ఇచ్చారన్న విషయం తెలియక మొదట్లో కొందరు రైతులు రాజధాని ఉద్యమంలో పాల్గొన్నారని, ఆ తర్వాత ఇది నిజమైన ఉద్యమం కాదని గుర్తించారని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి అన్నారు. అమరావతి చంద్రబాబు స్వార్ధం కోసం చేస్తున్న ఉద్యమం అని గ్రహించి రైతులు తెలుసుకున్నారని అందుకే కరోనాకు ముందే రాజధాని ఉద్యమం నీరుగారిందని వైసీపీ ఎమ్మెల్యే తెలిపారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు పది మందికి సేవ చేయాలని, సేవను కూడా రాజకీయ కోణంలో ఆలోచించి కోర్టులకు వెళ్లడం సరికాదని చంద్రబాబును ఉద్దేశించి ద్వారంపూడి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా జగన్ మూడు రాజధానులను ఆపలేరని ఆయన జోస్యం చెప్పారు.

English summary
ysrcp leaders mock former chief minister and opposition tdp chief chandrababu naidu's amaravati movement. the leaders says that amaravati movement is nothing but sponsored and like event management only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X