• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లోకేష్ పర్యటనలో 'జై జగన్..' నినాదాలు.. రెచ్చగొడుతున్నారన్న టీడీపీ... రంగంలోకి పోలీసులు...

|

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు కోనసీమలో పంట నష్టంతో పాటు పలు ప్రాంతాలు ముంపుకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సోమవారం(అక్టోబర్ 19) తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం ,ఉప్పాడ కొత్తపల్లి, అనపర్తి నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. లోకేష్ పర్యటన సందర్భంగా స్థానిక వైసీపీ నేతలు,కార్యకర్తలు 'జై జగన్... జై జగన్...' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

కరోనా మరోసారి కన్నెర్ర చేయనుందా..?ఎయిమ్స్ వైద్యులు చెప్తోందే నిజమా..?వర్షా కాలం వైరస్ విజృంభిస్తుందాకరోనా మరోసారి కన్నెర్ర చేయనుందా..?ఎయిమ్స్ వైద్యులు చెప్తోందే నిజమా..?వర్షా కాలం వైరస్ విజృంభిస్తుందా

జై జగన్ నినాదాలు... పరిస్థితి ఉద్రిక్తం...

జై జగన్ నినాదాలు... పరిస్థితి ఉద్రిక్తం...

వైసీపీ కార్యకర్తలు తమను రెచ్చగొట్టేందుకే 'జై జగన్..' అంటూ నినాదాలు చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలెవరూ రాష్ట్రంలో పర్యటించకూడదా అని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తల తీరు సరిగా లేదని... లోకేష్ పర్యటనను అడ్డుకునేలా వ్యవహరించడం సరికాదని అన్నారు. పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉండటంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం భారీ పోలీస్ బందోబస్తు నడుమే లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రైతులతో మాట్లాడిన లోకేష్...

రైతులతో మాట్లాడిన లోకేష్...

వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద బాధితులతో మాట్లాడి లోకేష్ వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. మొదట జగ్గయ్యపేటకు చేరుకున్న ఆయనకు టీడీపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడినుంచి రామవరం చేరుకుని తన పర్యటనను ప్రారంభించారు. వరదలకు కూలిపోయిన ఇళ్లు,నీట మునిగిన పొలాలను పరిశీలించారు. అనంతరం కిర్లంపూడి మండలం గోనెడలో ఏలేరు వరదకు నీట మునిగిన పొలాలను పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి వారి ఆవేదన విన్నారు.

రైతులు లేని ప్రభుత్వం...

రైతులు లేని ప్రభుత్వం...

వరదకు సంబంధించి కనీసం అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని లోకేష్ ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేల ఎకరాల్లో పంట నీట మునిగి రైతులు,కౌలుదార్లకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో ఏలేరుకు భారీ వరదలు వచ్చినా ప్రభుత్వం తమకు కనీస పరిహారం చెల్లించలేదని స్థానిక రైతులు కొందరు లోకేష్‌తో వాపోయారు. దీంతో ప్రభుత్వంపై మండిపడ్డ లోకేష్.. వైసీపీది రైతు ప్రభుత్వం కాదని... రైతులు లేని ప్రభుత్వం అని విమర్శించారు. వరదలతో కష్టాలపాలైన ప్రజలను ఆదుకునే తీరిక ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు.

  Amaravati ఉద్యమానికి 200 రోజులు, Capital Issue Remains Unresolved || Oneindia Telugu
  అప్పటి బాధితులకు ఇంకా పరిహారం అందలేదు...

  అప్పటి బాధితులకు ఇంకా పరిహారం అందలేదు...

  కనీసం తన పర్యటనతోనైనా వరద బాధితుల కష్టాలు పాలకుల దృష్టికి వెళ్తాయన్న ఉద్దేశంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు.గత వరదల్లో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటివరకూ పరిహారం అందలేదన్నారు. రైతు భరోసాలోనూ అన్నదాతలకు అన్యాయమే జరుగుతోందన్నారు. రైతులు ఇన్ని బాధలు పడుతున్నా... సీఎం జగన్ అవేవీ పట్టించుకోకుండా హెలికాప్టర్లలో తిరుగుతున్నారని విమర్శించారు. అసలే కష్టాల్లో ఉన్న రైతులను మంత్రులు తమ వ్యాఖ్యలతో మరింత అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఎంతసేపు తనను హేళన చేయాలనే ఆలోచనే తప్ప అన్నదాతల కష్టాలను తీర్చే ఉద్దేశం మంత్రులకు లేదన్నారు.

  English summary
  TDP MLC Nara Lokesh visited flood affected areas in East Godavari district on Monday.He talked to local farmers to get to know their troubles because of unexpected floods. He criticised that YSRCP govt neglected farmers
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X