హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై దాడి కేసులో అనుమానాలు వ్యక్తం చేసిన ధర్మాన, గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతలు

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన దాడి కేసును కేంద్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలని వైసీపీ నేతలు గురువారం డిమాండ్ చేశారు. ధర్మాన ప్రసాద రావు, రోజా తదితరులు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రశ్నించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

అనేక అనుమానాలు ఉన్నాయి

అనేక అనుమానాలు ఉన్నాయి

ప్రతిపక్ష నేతపై దాడి కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని ధర్మాన ప్రసాద రావు చెప్పారు. ఈ కేసును థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు తెలియకుండా తమ అభిప్రాయాన్ని వెల్లడించిందని ఆరోపించారు. జగన మీద హత్యాయత్నంపై ప్రభుత్వం స్పందించిన తీరును గవర్నర్‌కు చెప్పామని అన్నారు.

ఏంమాటలవి, జాగ్రత్త!: షర్మిల-విజయమ్మలను లాగిన రాజేంద్రప్రసాద్‌కు బాబు క్లాస్ఏంమాటలవి, జాగ్రత్త!: షర్మిల-విజయమ్మలను లాగిన రాజేంద్రప్రసాద్‌కు బాబు క్లాస్

హత్యాయత్నం వెనుక ఎవరున్నారో దర్యాఫ్తు చేయాలి

హత్యాయత్నం వెనుక ఎవరున్నారో దర్యాఫ్తు చేయాలి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డీజీపీ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని ధర్మాన చెప్పారు. గవర్నర్ పాత్రను చంద్రబాబు తప్పుబట్టారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి, టీడీపీ నేతల తీరును గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని అన్నారు. ఏపీలో జీవించే పరిస్థితులు లేవని చెప్పారు. జగన్ పైన హత్యాయత్నం వెనుక ఉన్న వ్యక్తులపై దర్యాఫ్తు చేయాలని కోరామని చెప్పారు.

 చర్యలు వాస్తవాలు ప్రజలకు తెలియకుండా చర్యలు

చర్యలు వాస్తవాలు ప్రజలకు తెలియకుండా చర్యలు


రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని సంస్థచే దర్యాఫ్తు చేయాలని ధర్మాన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని సంస్థచే దర్యాఫ్తు జరపాలని చెప్పారు. హత్యాయత్నం జరిగిన అరగంటలోనే డీజీపీ తన అభిప్రాయాన్ని చెప్పారన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని చెప్పారు. కుట్ర దిశగా విచారణ సాగడం లేదన్నారు.

జగన్, వైవీ సుబ్బారెడ్డిల పిటిషన్లపై విచారణ వాయిదా

జగన్, వైవీ సుబ్బారెడ్డిల పిటిషన్లపై విచారణ వాయిదా


మరోవైపు, జగన్ రిట్ పిటిషన్ పైన విచారణ వాయిదా పడింది. విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. అలాగే, వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్ కూడా మంగళవారానికి వాయిదా పడింది. తనపై జరిగిన హత్యాయత్నంలో కుట్ర దాగి ఉందని జగన్ హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అలాగే, ఈ ఘటనపై కేంద్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు.

English summary
YSRCP leaders Dharmana Prasad Rao, Roja and others met Governor Narasimhan over YS Jagan attack issue on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X