వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ పేరు ఎత్తాలంటే బాబుకు భయం, నాలుగేళ్లు చూస్తూ కూర్చున్నారు: పార్థసారధి, ధర్మాన ధ్వజం

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కేంద్ర బడ్జెట్‌ వచ్చిన పదిహేడు రోజుల తర్వాత సీఎం చంద్రబాబు నోరువిప్పారని, అప్పుడు కూడా ఆయన ప్రధాన మంత్రి మోడీ పేరు ఎత్తడానికే భయపడ్డారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పార్థసారథి శుక్రవారం విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవని ఆయన మండిపడ్డారు.

విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు చంద్రబాబు ఇప్పటివరకు ఎలాంటి పోరాటం చేయలేదని, ఇప్పుడు ఎవరిపై పోరాటం చేస్తారో స్పష్టం చేయాలని నిలదీశారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడటంలో చంద్రబాబు విఫలమై.. ఆ నెపాన్ని ఇతరులపై నెట్టేయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఏపీ ఎంపీలందరూ రాజీనామా చేసి.. ఏపీకి ప్రత్యేక హోదా సాధిద్దామని పార్థసారథి సూచించారు.

 YSRCP Leaders Parthasarathy, Dharmana Prasad Rao slams CM Chandrababu

మరోవైపు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరో నేత ధర్మాన ప్రసాదరావు కూడా చంద్రబాబుపై మండిపడ్డారు. నాలుగేళ్లుగా ఏపీకి అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చేష్టలుడిగి చూస్తూ కూర్చున్నారని విమర్శించారు. చట్టసభల సాక్షిగా విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రానికి ఎలా తాకట్టు పెడుతారని ఆయన చంద్రబాబును నిలదీశారు.

నాలుగేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉండి.. ఇప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల సంవత్సరం కావడంతో చంద్రబాబు లీకులు ఇస్తున్నారని, ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఎదురుచూస్తున్నా.. చంద్రబాబుకు ఆ విషయం పట్టడం లేదని ధర్మాన విమర్శించారు.

English summary
YSRCP Leaders Parthasarathy and Dharmana Prasada Rao critisized CM Chandrababu Naidu over Special Status and Union Budget here in Vijayawada on Saturday. While speaking Parthasarathay alleged that Babu spoken after 17 days of the union budget, that time also he feared to take PM Modi's name out. Chandrababu can't dare to talk about the injustice happened to Andhra Pradesh. On the other hand Dharmana Prasad Rao slammed Chandrabu that he is not showing interest to get Special Status if people of the state still want it. He wasted 4 years sitting idle, now he is talking about the injustice happened to AP, he concluded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X