వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో టీడీపీకి భారీ దెబ్బ ... వైసీపీకి 18 లోక్ సభ స్థానాలు ... టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్స్

|
Google Oneindia TeluguNews

టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2019 విడుదలయ్యాయి. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది టైమ్స్ నౌ వీఎంఆర్ . హోరాహోరీగా ఉద్రిక్త పరిస్థితుల నడుమ సాగిన ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం ఏపీలో టీడీపీ కి గట్టి దెబ్బ తగలనుంది. లోక్ సభ స్థానాలను పెద్ద సంఖ్యలో కైవసం చేసుకుని కేంద్రంలోని ఎన్డీయే కు చెక్ పెట్టాలని భావించిన చంద్రబాబుకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో ఈ సారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే 8 స్థానాలు అదనంగా గెలుచుకుంటుంది అని తన అంచనా ప్రకటించింది. . 2014 లో కంటే 2019లో అనూహ్యంగా వైసీపీ ఓటు బ్యాంకు పెర్గిందని పేర్కొంది.

ఏపీలో వైసీపీదే హవా.. 18 లోక్ సభ స్థానాలు కైవసం .. టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్స్

ఏపీలో వైసీపీదే హవా.. 18 లోక్ సభ స్థానాలు కైవసం .. టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్స్

25 లోక్సభ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ లో ఈసారి వైసీపీదే హవా అని తేల్చేసింది. ఏపీలో భారీ మెజార్టీతో వైసీపీ అత్యధిక లోక్ సభ స్థానాలను సొంతం చేసుకుంటుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ టీడీపీ కేవలం 7 స్థానాలకే పరిమితం అవుతుందని వెల్లడించింది. బిజెపి కానీ, కాంగ్రెస్ కానీ ఏపీలో ఖాతా తెరవవని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించింది . మే 23న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో టైమ్స్ నౌ వి ఎం ఆర్ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న టీడీపీ గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి సగానికి సగం తక్కువ స్థానాలను దక్కించుకుంటుందని వెల్లడించింది. 2014ఎన్నికల్లో 15 స్థానాలు దక్కించుకున్న టీడీపీ ఈ దఫా 7 స్థానాలకు పరిమితం కావటం అంటే టీడీపీకి చెప్పలేని దెబ్బ అని చెప్పక తప్పదు.

ఏపీలో రాజకీయ పార్టీల పోలింగ్ శాతం టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే ప్రకారం

ఏపీలో రాజకీయ పార్టీల పోలింగ్ శాతం టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే ప్రకారం

ఇక పోలింగ్ శాతం చూసినట్లయితే వైసీపీ పోలింగ్ శాతం 2014 తో పోలిస్తే 2019లో అనూహ్యంగా పెరిగింది. 2014 లో వైసీపీ 45.5 పోలింగ్ శాతం కాగా 2019 నాటికి భారీగా పుంజుకుని 48 శాతానికి చేరిందని అంచనా వేసింది. ఇక టీడీపీ పోలింగ్ శాతం 40.5 శాతం నుండి 2019 నాటికి 30.8 శాతానికి తగ్గిందని అంచనా వేసింది. ఇక బీజేపీ 2014 లో 7.2 ఓటింగ్ శాతం ఉండగా 2019 నాటికి 6.7 స్తాతానికి తగ్గింది. ఇక కాంగ్రెస్ పార్టీ 2014 లో 2.8 శాతం కాగా 2019 నాటికి 3.2 శాతంగా కాస్త పుంజుకుందని వెల్లడించింది.

గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా 8 స్థానాల్లో దెబ్బ తిననున్న అధికార టీడీపీ

గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా 8 స్థానాల్లో దెబ్బ తిననున్న అధికార టీడీపీ

ఇక ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీ ఏపీ రాష్ట్రంలో అనూహ్యంగా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తే టీడీపీ మాత్రం చతికిలబడుతుంది అని సర్వే ఫలితాల్లో వెల్లడించింది. ఈ సారి ఎలాగైనా మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతో హోరాహోరీగా పోరాడిన టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఈసారి ఏపీలో పట్టు కోల్పోనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఈసారి రాష్ట్రంలో , అలాగే లోక్ సభ ఎన్నికల్లోనూ అనూహ్య విజయం సాధించనుంది. తన ఆధిక్యాన్ని ప్రదర్శించనుంది. ఈ దఫా టీడీపీ 8 స్థానాలు కోల్పోనున్నట్టు టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే వెల్లడించింది. టైమ్స్ నౌ వీఎంఆర్ ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ 3211 చోట్ల 40 వేల మంది ఓటర్లను ప్రాతిపదికగా తీసుకొని సర్వే నిర్వహించి ఈ ఫలితాలను వెల్లడించింది.

English summary
According to the Times Now-VMR Exit Poll, the YSR Congress Party (YSRCP) is likely to sweep the state of Andhra Pradesh with 18 seats to its name. While the biggest loser in the state is expected to be Chandrababu Naidu-led Telugu Desam Party (TDP) with the rest 7 Lok Sabha seats. The Bharatiya Janata Party (BJP) has been mooted to lose its only two seats it won in the state in the 2014 general elections.Out of the 25 seats in Andhra Pradesh, the YS Jaganmohan Reddy-led YSRCP is expected to rout the state with 18 seats, an improvement of 10 seats which it secured in the 2014 elections, according to the Times Now-VMR Exit Poll. Interestingly, there will not be a big jump in YSRCP's vote share this time out as compared to the previous elections. The party is projected to secure 48 per cent of the state's vote which stood at 45.5 per cent in 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X