అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎంగా జగన్ స్ధానంలో చంద్రబాబు-నిమ్మగడ్డ లేఖ- అంబటి షాకింగ్‌ ట్వీట్‌

|
Google Oneindia TeluguNews

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ సర్కారుకూ, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కూ మధ్య హాట్‌ హాట్ రాజకీయాలు సాగుతున్నాయి. అదే సమయంలో నిమ్మగడ్డ చంద్రబాబుకు ఏజెంట్‌లా పనిచేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీకి చెందిన గెుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి కూడా అయిన అంబటి రాంబాబు చేసిన ఓ ట్వీట్‌ సంచలనం రేపుతోంది.

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సహకరించరని అధికారులపై, తనపై విమర్శలు చేస్తున్న మంత్రులు, సలహాదారులపై చర్యలు కోరుతూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ సీఎస్‌, గవర్నర్‌కు లేఖలు రాస్తున్నారు. దీనిపై స్పందించిన అంబటి రాంబాబు... నిమ్మగడ్డ రమేష్‌ సీఎం జగన్ స్ధానంలో చంద్రబాబును నియమించాలని కోరుతూ లేఖ రాసినా ఆశ్చర్యం లేదంటూ షాకింగ్ ట్వీట్‌ చేశారు. తక్షణమే జగన్మోహనరెడ్డి గారిని తొలగించి, ఆ స్ధానంలో చంద్రబాబును నియమించవలసిందిగా నిమ్మగడ్డ గవర్నర్‌కి లెటర్ రాసినా ఆశ్చర్యపోకండి. పిచ్చి ముదిరింది అంటూ అంబటి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

ysrcp mla ambati rambabu says no surprise if nimmagadda ask to replace jagan with babu

పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా తయారీలో నిర్లక్ష్యం వహించిన ఐఏఎస్‌లు గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్‌ల అభిసంసనకు సిఫార్సు చేసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌... ఆ తర్వాత సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాష్‌ను తప్పించాలని సీఎస్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ పార్టీ కార్యాలయం నుంచి తనపై విమర్శలు చేస్తున్న సజ్లల రామకృష్ణారెడ్డిని తప్పించాలని ఇవాళ గవర్నర్‌కు నిమ్మగడ్డ లేఖలో కోరారు. దీనిపై వైసీపీ నేతలు పలు రకాలుగా సెటైర్లు వేస్తున్నారు.

ysrcp mla ambati rambabu says no surprise if nimmagadda ask to replace jagan with babu

English summary
ysrcp mla ambati rambabu says no surprise in the state if sec nimmagadda ramesh write a letter asking to replace cm jagan with tdp chief chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X