• search
  • Live TV
కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చెయ్యను: వైసీపీ ఎమ్మెల్యే నైరాశ్యం... రీజన్ ఇదే

|

ఏపీలో అధికారంలో ఉంది వైసీపీ ప్రభుత్వం. ఇక ఈ సమయంలో టీడీపీ నేతలు నైరాశ్యంలో ఉన్నారంటే అర్ధం ఉంది కానీ వైసీపీ నేతలే నైరాశ్యం లో ఉన్నారంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవాలి. ఏకంగా ఓ ఎమ్మెల్యేనే రాజకీయాల మీద విరక్తి చెంది ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? అసలు కథేంటి అంటే..

అమరావతిలో భూములన్న వైసీపీ నేతలు వీరే: ఎమ్మెల్యేలు..మంత్రి కొడాలికి సైతం: టీడీపీ రివర్స్ ఎటాక్..!

నందికొట్కూరు వైసీపీలో అంతర్గత పోరు

నందికొట్కూరు వైసీపీలో అంతర్గత పోరు

కర్నూలు జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే వర్సెస్ కార్యకర్తలు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఆర్థర్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బండి జయరాజు మీద 40వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు . ఇక ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్ధర్ కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా ఒక కార్యక్రమానికి హాజరవ్వటమే ఆయన చేసిన తప్పు.

ఎమ్మెల్యే ఆర్థర్ ను నిలదీసిన కార్యకర్తలు

ఎమ్మెల్యే ఆర్థర్ ను నిలదీసిన కార్యకర్తలు

జూపాడులోని ఒక కార్యక్రమానికి ఎమ్మెల్యేఆర్థర్ హాజరయ్యారు. దీంతో అక్కడకు వచ్చిన కార్యకర్తలుతమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవటానికి తాము కావాలి కానీ కార్యక్రమాలకు తాము వద్దా అని నిలదీశారు. ఇంటింటికీ తిరిగి ఓట్లడిగి గెలిపిస్తే.. సమాచారం ఇవ్వకుండానే వచ్చారని కార్యకర్తలు ఎమ్మెల్యేను అడిగారు. దీంతో.. ఎమ్మెల్యే ఆర్థర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక నిరాశ నిండిన స్వరంతో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కర్నూలు నగర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి .

 మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చెయ్యనన్న ఎమ్మెల్యే ఆర్థర్

మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చెయ్యనన్న ఎమ్మెల్యే ఆర్థర్

కర్నూలులోని జూపాడు మండలం బన్నూరులోని ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఇలా వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల తీరుకు సమాధానంగా ఎమ్మెల్యే ఆర్థర్ మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయను. ఇంకోసారి ఓట్లు అడుక్కోను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు వచ్చినా, రాకపోయినా.. వాళ్ల కాళ్లు పట్టుకోనని ఆయన మాట్లాడటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఇక ఎన్నో అలోచలనలతో తాను ఏదో చెయ్యాలని ఎమ్మెల్యేను అయ్యానని చెప్పిన ఆయన తాను అనుకున్నది ఒకటైతే , అవుతుంది మరొకటి అని చాలా నిరాశాజనకంగా మాట్లాడారు.

ఇక చాలంటూ నిరాశాజనకమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే

ఇక చాలంటూ నిరాశాజనకమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే

ఏదైనా అవసరం వస్తే కార్యకర్తలే.. తన దగ్గరకు రావాలని పేర్కొన్నారు ఆర్థర్. ఇంతవరకు చేసింది ఇక చాలంటూ ఎమ్మెల్యే ఆర్థర్ నైరాశ్యంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. దీంతో.. అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఒక్క నందికొట్కూరు ఎమ్మెల్యే మాత్రమే కాదు ఇంకా చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు అంతర్గత పోరుతో నానా ఇబ్బందులు పడుతున్నారు.

కర్నూలు ఎమ్మెల్యేలకు కార్యకర్తల సెగ .. ఇప్పుడు ఇదే చర్చ

కర్నూలు ఎమ్మెల్యేలకు కార్యకర్తల సెగ .. ఇప్పుడు ఇదే చర్చ

ఇటీవల కొడుమూరు ఎమ్మెల్యే సైతం కార్యకర్తల నుండి తిరుగుబాటు ఎదుర్కొన్నారు. ఇప్పుడు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ వంతైంది. గత కొంత కాలంగా వైసీపీ యూత్ లీడర్ బైరెడ్డి శ్రీధర్ రెడ్డి కి ఎమ్మెల్యే ఆర్థర్ కు మధ్య విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా కర్నూలు జిల్లాలో వైసీపీలో రగులుతున్న అంతర్గత విబేధాలు స్థానికంగా చర్చనీయాంశం అవుతున్నాయి.

English summary
Nandikotkuru MLA Arthur, who attended an event in Jupadu Mandal Bannur in Kurnool, said, "He will not contest for another term. Once again, i never beg for the votes . When the activists came and did not come, he said that he do not hold their legs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X