• search
 • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బొత్స శాఖను టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే: ప్రక్షాళనకు సమయం వచ్చిందంటూ: పలు డిమాండ్లు..

|

చిత్తూరు: మున్సిపల్ శాఖపై గళమెత్తారు అధికార వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఆ శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ప్రత్యేకించి ఇంజినీరింగ్ విభాగం.. అదుపు తప్పిందనే సంచలన ఆరోపణలు గుప్పించారు. రాజకీయాల్లో తలపండిన బొత్స సత్యనారాయణ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న శాఖ అది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో వైద్య, ఆరోగ్యం, పోలీసులతో సమానంగా మున్సిపల్ శాఖ కృషి చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ శాఖను కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన అధికార పార్టీకే చెందిన ఓ ఎమ్మెల్యే లక్ష్యంగా చేసుకోవడం రాజకీయంగా కలకలం రేపుతోంది.

రైలు టికెట్లు తీసుకోవడం గగనం: తత్కాల్, కరెంట్ బుకింగ్‌పై కీలక నిర్ణయం: అలాంటి టికెట్లు చెల్లవురైలు టికెట్లు తీసుకోవడం గగనం: తత్కాల్, కరెంట్ బుకింగ్‌పై కీలక నిర్ణయం: అలాంటి టికెట్లు చెల్లవు

 ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ..

ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ..

మున్సిపల్ శాఖలో సమూల మార్పులను తీసుకుని రావాల్సిన సమయం ఆసన్నమైందని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ శాఖలో ఇంజినీరింగ్ విభాగం ఎందుకు పనిచేస్తోందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని, దాన్ని పట్టాలెక్కించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. ఇంజినీరింగ్ విభాగానికి ఇస్తోన్న ప్రాధాన్యత కంటే.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి, వారికి కల్పించాల్సిన ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ ప్రక్షాళన ఏదో తన నియోజకవర్గం నుంచే ఆరంభించాల్సి ఉంటుందని చెప్పారు.

నిధులు ఉన్నా.. నిర్లక్ష్యంగా నిండుగా..

నిధులు ఉన్నా.. నిర్లక్ష్యంగా నిండుగా..

పట్టణ స్థాయిలో మంచినీటి ఎద్దడి ఏర్పడకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసిందని, అయినప్పటికీ.. ఇంజినీరింగ్ విభాగం అధికారుల నిర్లక్ష్యం వల్ల అవి మురిగిపోతున్నాయని విమర్శించారు. మంచినీటి కుళాయిల కనెక్షన్లు సహా వాటి మరమ్మతులను పట్టించుకోవట్లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఆ విభాగం అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం లేకపోలేదని అన్నారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీపై రాజకీయ నాయకుల పెత్తనం మితిమీరిందని ఆయన పరోక్షంగా మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వర్గాన్ని ఉద్దేశించి విమర్శించారు.

  YSRCP MLA Biyyapu Madhusudhan Reddy Conducted Rally In Srikalahasti
   మున్సిపల్ శాఖపై ఆరోపణలతో..

  మున్సిపల్ శాఖపై ఆరోపణలతో..

  తాజాగా మున్సిపల్ శాఖపై ఆరోపణలతో మరోసారి వివాదాలకు తెరతీసినట్లు కనిపిస్తోంది. ఇంజినీరింగ్ విభాగంపై రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా ఉన్నాయని నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు. మంజూరైన పనులను కూడా పూర్తి చేయడానికి ఇంజినీరింగ్ విభాగం అధికారులు గానీ, ఉద్యోగులు గానీ బద్ధకిస్తున్నారంటే పరిస్థితి చేయి దాటినట్టేనని ఆయన అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి ఉండకపోవచ్చని చెప్పారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఎలాంటి రాజకీయపరమైన జోక్యాన్ని తాను సహించేది లేదని బొజ్జల వర్గానికి హెచ్చరికలను జారీ చేయడం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

  English summary
  Ruling in Andhra Pradesh YSR Congress Party MLA Biyyapu Madhusudhan Reddy demands for re shuffle of engineering wing in Municipal Administration and Urban Development Department. Political motivate employees in that wing, he alleged.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X