• search
 • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కేసీఆర్ చెప్పారు..వైసీపీ ఎమ్మెల్యే పాటించారు: లాఠీ పట్టుకుని హల్‌చల్: లాక్‌డౌన్ స్వయంగా పర్యవేక్షణ

|

చిత్తూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి రెండు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. ప్రజా ప్రతినిధులు ఇళ్లల్లో నుంచి బయటికి రావాలని, వారంతా పోలీసులకు సహకరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే పిలుపునిచ్చారు. ప్రతి గ్రామానికి సర్పంచ్ కథానాయకుడు కావాలె, ప్రతి మండలానికి ఎంపీటీసీ కథనాయకుడు కావాలె.. ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కథానాయకుడు కావాలె.. అంటూ సూచించారు.

వందలాది మంది ఏపీ విద్యార్థులకు కరోనా పరీక్షలు..గందరగోళం: జగన్‌కు కేసీఆర్ ఫోన్..కేటీఆర్ ట్వీట్

 లాక్‌డౌన్ పరిస్థితుల్లో..

లాక్‌డౌన్ పరిస్థితుల్లో..

కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు గానీ, ఎంపీటీసీలు గానీ ఏ మేరకు స్పందించారో తెలియదు గానీ.. తోటి తెలుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు స్ఫూర్తిపొందినట్టున్నారు. అందుకే- లాఠీ చేతబట్టుకుని మరీ రోడ్డు మీదికి వచ్చారు. పోలీసులతో కలిసి లాక్‌డౌన్ పరిస్థితులను పర్యవేక్షించారు. మున్సిపల్ అధికారులతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పారిశుద్ధ్య కార్మికులు, ఎన్ఎంఆర్‌ల పనితీరును పరిశీలించారు.

 పట్టణంలో పర్యటన..

పట్టణంలో పర్యటన..

ఆయనే బియ్యపు మధుసూధన్ రెడ్డి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే. రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన శ్రీకాళహస్తిలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, ఇతర మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగులకు అండగా నిలిచారు. వారితో కలిసి తానూ లాక్‌డౌన్ పరిస్థితులను పర్యవేక్షించారు. ప్రఖ్యాత శ్రీకాళహస్తీశ్వర, జ్ఙాన ప్రసూనాంబ స్వామి ఆలయం వద్ద కొనసాగుతోన్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఆలయం నాలుగు మాడా వీధుల్లో తిరుగాడారు.

 పట్టణంలో పర్యటన..

పట్టణంలో పర్యటన..

ఆయనే బియ్యపు మధుసూధన్ రెడ్డి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే. రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన శ్రీకాళహస్తిలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, ఇతర మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగులకు అండగా నిలిచారు. వారితో కలిసి తానూ లాక్‌డౌన్ పరిస్థితులను పర్యవేక్షించారు. ప్రఖ్యాత శ్రీకాళహస్తీశ్వర, జ్ఙాన ప్రసూనాంబ స్వామి ఆలయం వద్ద కొనసాగుతోన్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఆలయం నాలుగు మాడా వీధుల్లో తిరుగాడారు.

దుకాణాలను మూసివేయాలంటూ..

దుకాణాలను మూసివేయాలంటూ..

తాను ఉండగానే..బైక్‌పై రాకపోకలు సాగిస్తోన్న స్థానికులు, ఇళ్లల్లో నుంచి బయటికి వచ్చిన వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాలుగు రోజుల పాటు ఇళ్లల్లో ఉండలేరా? అంటూ మండిపడ్డారు. పరిస్థితి తీవ్రత తెలిసిన తరువాత కూడా ఇలా నిర్లక్ష్యంగా రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారంటూ నిలదీశారు. కొందరు దుకాణాలను తెరిచి ఉంచగా.. వెంటనే మూసివేయాలని కోరారు. దండం పెట్టి మరీ దుకాణాలను మూసివేయాలని వేడుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మందులు, ఇతర వైద్య చికిత్స కోసం బయటికి వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్‌లను ధరించాలని సూచించారు.

డ్రోన్లతో పారిశుద్ధ్య పనులు

శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో లేనందున.. డ్రోన్లతో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. దీనికి సంబంధించిన పనులను బియ్యపు మధుసూధన్ రెడ్డి పరిశీలించారు. డ్రోన్‌ను ఆయన కొద్దిసేపు ఆపరేట్ చేశారు. ఆలయ నాలుగు మాడా వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ప్రతి రోజూ బ్లీచింగ్ పౌడర్‌ను పట్టణంలోని అన్ని వార్డుల్లో చల్లించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యాన్ని విస్మరించరాదని సూచించారు. వాటిని యధాతథంగా కొనసాగించాలని చెప్పారు.

  Parliament Adjourned : Jagan Govt Mulling Over AP Council Abolition, Budget, Capital Shifting

  English summary
  After a COVID-19 case from Srikalahasti town turned positive, the municipal body got down to action by spraying disinfectant all over the temple town. Drone sanitisers were employed to ensure that the entire town was covered within a short time. YSRCP MLA Biyyapu Madhusudhan Reddy helped to Police for maintain lockdown.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X