• search
  • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టీడీపీ కార్యకర్తల దాడి: ఆసుపత్రి పాలైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి

|

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని పూతలపట్టులో దారుణ ఘటన చోటు చేసుకుంది. రిగ్గింగ్ ను అడ్డుకున్నారనే ఆగ్రహంతో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబును అపహరించారు. కొన్ని గంటల పాటు ఆయనను కారులో తిప్పారు. తీవ్రంగా కొట్టారు. టీడీపీ కార్యకర్తలు కొట్టిన దెబ్బలకు స్పృహ తప్పిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. తల, శరీరంపై బలమైన గాయాలు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనతో పూతలపట్టు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంఎస్ బాబుపై దాడి చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఐరాల మండలం కట్టకిందపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రిగ్గింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో ఎంఎస్ బాబు తన కుమారుడితో కలిసి ఆ గ్రామానికి వెళ్లారు. రిగ్గింగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రిగ్గింగ్ చేశారని అనుమానిస్తున్న ఈవీఎంను బాబు నేలకు విసిరేశారు. దాన్ని పగులగొట్టారు. దీనితో ఆగ్రహానికి గురైనటీడీపీ నాయకులు, కార్యకర్తలు బాబుపై దాడి చేశారు. కారును ధ్వంసం చేశారు.

YSRCP MLA candidate kidnapped, beaten up in Chittoor district

వేరే కారులో ఆయనను, కుమారుడిని ఎక్కించుకుని బలవంతంగా తీసుకెళ్లారు. తీవ్రంగా కొట్టారు. రెండు గంటల తరువాత ఆయనను విడిచిపెట్టారు. దాడిలో గాయపడ్డ బాబును వేరే వాహనంలో చికిత్స నిమిత్తం చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే చిత్తూరు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అదనపు బలగాలను మోహరింపజేశారు. బాబుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన పోలీసులకు ఆదేశించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

చిత్తూర్ యుద్ధ క్షేత్రం
సంవత్సరం
అభ్యర్థి పేరు పార్టీ లెవెల్ ఓటు ఓటు రేట్ ఓట్ల తేడ
2019
నల్లకొండగారి రెడ్డెప్ప వైయస్సార్‌సీపీ విజేతలు 6,86,792 52% 1,37,271
డా. ఎన్ శివప్రసాద్ టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 5,49,521 42% 1,37,271
2014
నరామల్లి శివప్రసాద్ టీడీపీ విజేతలు 5,94,862 50% 44,138
జి సామాన్య కిరణ్ వైయస్సార్‌సీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 5,50,724 46% 0
2009
నరామల్లి శివప్రసాద్ టీడీపీ విజేతలు 4,34,376 42% 10,659
తిప్పేస్వామి ఎం కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 4,23,717 41% 0
2004
డి ఎ నాగరాజు టీడీపీ విజేతలు 4,54,128 52% 62,138
డాక్టర్ రవూరి వెంకట స్వామి కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,91,990 45% 0
1999
నోతనా కల్వా రామకృష్ణ రెడ్డి టీడీపీ విజేతలు 4,19,208 50% 18,638
ఆర్ గోపినాథ్ కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 4,00,570 48% 0
1998
నుతనకల్వ రామకృష్ణ రెడ్డి టీడీపీ విజేతలు 3,49,831 45% 80,081
ధనసెఘరన్ వి కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,69,750 35% 0
1996
రౌతు సూర్యనారాయణ టీడీపీ విజేతలు 4,05,052 51% 61,350
ఆదికేసులులు డి కె కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,43,702 43% 0
1991
ఎమ్ జ్ఞానేంద్ర రెడ్డి కాంగ్రెస్ విజేతలు 3,73,631 56% 1,09,982
గుర్రం వి. శ్రీనినా రెడ్డి టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,63,649 40% 0
1989
జ్ఞానేంద్ర రెడ్డి కాంగ్రెస్ విజేతలు 3,90,786 55% 82,508
ఎన్ రంగస్వామి టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,08,278 43% 0
1984
ఎన్ పి ఝాన్సీ లక్ష్మి టీడీపీ విజేతలు 3,32,543 55% 61,211
అమరనాధ రెడ్డి నల్లారి కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,71,332 45% 0
1980
పి. రాజగోపాల్ నాయుడు ఐ ఎన్సి( ఐ ) విజేతలు 2,32,249 52% 59,847
ఎన్ పి చెంగరాయయ నాయుడు జేఎన్ పి రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,72,402 38% 0
1977
పి. రాజగోపాల్ నాయుడు కాంగ్రెస్ విజేతలు 2,29,252 50% 10,447
ఎన్ పి . చంగల్రాయ నాయుడు బిఎల్డి రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,18,805 48% 0
1971
పి. నరసింహ రెడ్డి కాంగ్రెస్ విజేతలు 2,45,052 68% 1,28,739
కె పి చెంగాలరాయ నాయుడు ఎన్సిఓ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,16,313 32% 0
1967
ఎన్ ఎపి సి నాయుడు కాంగ్రెస్ విజేతలు 1,86,594 54% 27,663
ఎన్ జి రంగా ఎస్డబ్ల్యుఎ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,58,931 46% 0
1957
ఎమ్ వి గంగాదేరశివ కాంగ్రెస్ విజేతలు 0 0% 0

English summary
Tension prevailed in the Puthalapattu assembly constituency under Chittoor district of Andhra Pradesh on Thursday as YSR Congress Party's (YSRCP) candidate MS Babu was kidnapped allegedly by TDP workers. He was taken to an orchard and beaten up. Babu, however, managed to escape.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more