విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ.. గిన్నిస్ రికార్డుల్లో పవన్ కల్యాణ్.. విశాఖలో వైసీపీకి 60వేల ఎకరాలు.

|
Google Oneindia TeluguNews

''ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఇండియాకు పేరుంది. అలాంటి దేశంలో.. రాజకీయ చైతన్యానికి పేరున్న ఏపీలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. నిన్ననే ఆ పార్టీ ఆరవ ఆవిర్భావ సభను జరుపుకుంది. మొత్తానికి రెండు రకాలుగా పవన్ గిన్నిస్ బుక్ రికార్డుల్లో స్థానం పొందారు. ఆరేళ్లలో ఆరు విభిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ఒకరికార్డయితే.. పార్టీ అధ్యక్షుడిగా పోటీచేసిన రెండు చోట్లా దారుణంగా ఓడిపోవడం రెండో రికార్డు. ఇన్నాళ్లూ టీడీపీకి తోక పార్టీలా వ్యవహరించిన జనసేన.. ఇప్పుడు బీజేపీకి ఈక పార్టీలా మారింది''అని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివాంర విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణపైనా సంచలన ఆరోపణలు చేశారు.

తుపాకి గురిపెట్టి బెదిరింపులు?

తుపాకి గురిపెట్టి బెదిరింపులు?

విశాఖపట్నంలోని తన భూమిని వైసీపీ నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, తలకు తుపాకి గురిపెట్టిమరీ బెదిరింపులకు పాల్పడ్డారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన ఆరోపణలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి, ప్రస్తుతం ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర చీఫ్ గా ఉన్న కన్నాకు సిస్టమ్ తీరుతెన్నులపై స్పష్టమైన అవగాహన ఉంటుందని, అలాంటప్పుడు కబ్జా వ్యవహారంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం విచిత్రంగా ఉందని ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

టీడీపీలోకి జంప్..

టీడీపీలోకి జంప్..

‘‘విశాఖలో కన్నా చెప్పిన భూమిని పరిశీలించిన తర్వాత మాకొక విషయం స్పష్టంగా అర్థమైంది. కన్నా లక్ష్మీనారాయణ ఎంత తొందరగా టీడీపీలో చేరుదామా అని ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. ఆయన కామెంట్లను చంద్రబాబు మీడియా ప్రముఖంగా ప్రచురించడం కూడా చేరికలో భాగమేమోనని అనిపిస్తోంది. అంతపెద్ద మనిషికి.. తన భూమిని ఎవరో కబ్జా చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్న ఇంగితం లేదంటే నమ్మగలమా? నిజానికి విశాఖ సిటీలో ఆయన భూమి.. చుట్టూ ప్రహారీతో చాలా సేఫ్ గా ఉంది. దానిపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని పోలీసులు చెప్పారు. అయినాసరే చంద్రబాబు ట్యూన్ లో కన్నా పాట పాడుతున్నారు''అని అమర్ నాథ్ రెడ్డి విమర్శించారు.

వైసీపీకి 60వేల ఎకరాలు?

వైసీపీకి 60వేల ఎకరాలు?

విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు సంబంధించి డిసెంబర్-జనవరిలో ప్రకటన వెలువడిన తర్వాతే ప్రతిపక్ష పార్టీలు కొత్త రాగం ఆలపిస్తున్నాయని, విశాఖలో భూముల్ని వైసీపీ కబ్జా చేస్తోందంటూ మూడు నెలలుగా రాద్ధాంతం చేస్తూనే ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ మండిపడ్డారు. ‘‘ఈ మూడు నెలల్లో ఆ మూడు పార్టీలూ చేసిన ఆరోపణల్ని లెక్కేస్తే.. విశాఖ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వైసీపీ నేతల ఖాతాలోకి ఇప్పటికే 60వేల ఎకరాలు వచ్చిచేరాల్సి ఉంది. ఇదెంత హాస్యాస్పదమోకదా. టీడీపీ విడిగా ఓ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని వేసి, 600 ఎకరాల్లో అక్రమాలు జరిగాయని చెప్పింది. కానీ ఆ భూమి ఎక్కడంటే మాత్రం చెప్పడంలేదు. కేవలం విశాఖపై అక్కసుతోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు''అని మండిపడ్డారు.

తోకకు ఈక..

తోకకు ఈక..


స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన చాలా చోట్ల కలిసి పోటీచేస్తున్నాయని, తన నియోజకవర్గం అనకాపల్లిలోనైతే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోల్ని పక్కపక్కనే ఉంచి ప్రచారం నిర్వహిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే చెప్పారు. నిజానికి టీడీపీ, జనసేన, బీజేపీలను వేర్వేరు పార్టీలుగా వైసీపీ చూడబోదని, టీడీపీకి తోక పార్టీ బీజేపీ అయితే.. ఆ తోకకు మరో ఈక జనసేన పార్టీ అని, నేరగాళ్లకు ఓటు వేయొద్దన్న ఉద్దేశంతోనే ఏపీ ప్రజలు 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలను చిత్తుగా ఓడించారని, అయినాసరే పవన్ కల్యాణ్ కు వాస్తవాలు అర్థంకావడంలేదని అమర్ నాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు.

English summary
ysrcp leader, anakapalli mla gudivada amarnath reddy slams opposition party leaders over false allegations on ysrcp. he made sensational remarks on ap bjp chief kanna laxminarayana, janasena chief pawan kalyan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X