నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సొంత పార్టీ నేతల ఫ్లెక్సీలు తొలగించిన వైసీపీ ఎమ్మెల్యే ... ఎందుకో తెలుసా !!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఫ్లెక్సీలను చించేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి || YSRCP Felxs Removed By Kotamreddy Sridhar Reddy

ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పారదర్శక పాలన అందించాలని తెగ తాపత్రయ పడుతుంది. అందులో భాగంగానే వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పాలనలో తనదైన మార్కు చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే జగన్ తీసుకున్న నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి శూన్యం గా మారుతుందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కానీ జగన్ మాత్రం అటు మంత్రులకు, ఇటు వైసీపీ ఎమ్మెల్యేలకు నిజాయితీగా పని చేయాలని, ప్రజా క్షేత్రంలో నిత్యం ఉండాలని, ప్రజల సమస్యలను పరిష్కరించాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ఆయన బాటలో సాగుతున్నారు పలువురు ఎమ్మెల్యేలు .

అది నచ్చడం లేదు, అందుకే పెయిడ్ ఆర్టిస్టులతో శిబిరాలు: చంద్రబాబుపై సుచరిత ఫైర్

పారదర్శక , ఆదర్శవంతమైన పాలన అందించాలని దిశా నిర్దేశం చేసిన ఏపీ సీఎం జగన్

పారదర్శక , ఆదర్శవంతమైన పాలన అందించాలని దిశా నిర్దేశం చేసిన ఏపీ సీఎం జగన్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కి ప్రజలు పట్టం కట్టడానికి కారణం గత ప్రభుత్వ అవినీతి ఒకటైతే, నిత్యం ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి ఉండడం మరో కారణం. కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పులు తమ ప్రభుత్వ హయాంలో జరక్కుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే పాలన విషయంలో తన నిర్ణయాలను నిక్కచ్చిగా వైసీపీ నేతలకు చెప్పారు. ఇక జగన్ బాటలో పయనిస్తున్న వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనదైన శైలిలో నియోజకవర్గం లో పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ భక్తుల సౌకర్యాలను పరిశీలించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ భక్తుల సౌకర్యాలను పరిశీలించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

తాజాగా నెల్లూరులోని బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ప్రారంభమయ్యింది. నాలుగు రోజుల పాటు ఘనంగా జరిగే ఈ రొట్టెల పండుగకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. దీంతో రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏర్పాట్లను పరిశీలించడానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బారాషహీద్ దర్గా వద్దకు వెళ్లి ఆయన అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించే సమయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి దర్గా ప్రాంగణంలో పండగకు వచ్చే భక్తులకు స్వాగతం చెబుతూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, శ్రీధర్ రెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలు కనపడ్డాయి. అయితే ఆయన భగవంతుని సన్నిధిలో రాజకీయాలకు తావులేదని వెంటనే ఆ ఫ్లెక్సీలను చించేశారు.

దేవుడి సన్నిధిలో రాజకీయాలేంటి అని ..సొంత పార్టీ నేతల ఫ్లెక్సీలను చించేసిన ఎమ్మెల్యే ..

దేవుడి సన్నిధిలో రాజకీయాలేంటి అని ..సొంత పార్టీ నేతల ఫ్లెక్సీలను చించేసిన ఎమ్మెల్యే ..

స్వయంగా ఆ ప్లెక్సీలను చించేసి దర్గా ప్రాంగణంలో, దేవాలయాల దగ్గర, చర్చీల దగ్గర రాజకీయాలకు తావు లేదని చెప్పి అక్కడ వారి చేత శభాష్ అనిపించుకున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే కాదు, రాజకీయాలు ఎంత వరకు పరిమితం అన్న విషయాలను కూడా తెలుసుకొని చాలా వివేక వంతమైన పనిచేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

ఇక అదే తెలంగాణ రాష్ట్రంలో చూస్తే యాదాద్రి శిలలపై గులాబీ పార్టీ ప్రచారాన్ని చేయడమే కాకుండా, ఏకంగా ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వినాయక మండపంలో తన విగ్రహాన్ని పెట్టించుకోవడం గమనార్హం. సహజంగా నాయకులు ఎవరైనా పనిచేసే దానికంటే ఎక్కువ తమ పబ్లిసిటీ కే ప్రాధాన్యతనిస్తారు. కానీ అలా కాకుండా ఏపీ ,నెల్లూరు జిల్లాలోని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భక్తులనుద్దేశించి వారికి ఆహ్వానం పలుకుతూ పెట్టిన సొంత పార్టీ మంత్రి, అలాగే తన ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను తానే చించేసి ఆదర్శంగా నిలిచారు.

English summary
Minister Anil Kumar Yadav and Sridhar Reddy felx removed by Nellore Rural MLA kotam reddy sridhar Reddy. the flex aaranged at bara shaheed darga to welcoming the devotees attending the dargah premises . However, MLA did not want to do politics in the presence of the Lord. so, he removed the flex .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X