వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూత్రధారులు వేరే: నెల్లూరు జిల్లా ఎస్పీ పేరు:..మా ప్రభుత్వంలో ఇంత నిర్లక్ష్యమా? : కోటంరెడ్డి

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగిని సరళపై దౌర్జన్యానికి దిగిన కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టు అయ్యారు. తనను అరెస్టు చేయడంపై ఆయన స్పందించారు. తనపై కేసు నమోదు కావడం వెనుక సూత్రధారులు వేరే ఉన్నారని, పాత్రధారులు మాత్రమే తెరముందు కనిపిస్తున్నారని అన్నారు. తన స్నేహితుడికి చెందిన లేఅవుట్ కు మంచినీటి కనెక్షన్ ఇవ్వడానికి అవసరమైన అనుమతుల కోసం సరళ.. మూడు నెలలుగా తిప్పుతున్నారని, తాను స్వయంగా సూచించిన తరువాత కూడా నెలరోజుల పాటు జాప్యం చేశారని అన్నారు.

నెల్లూరు జిల్లా ఎస్పీపై ఫిర్యాదు

నెల్లూరు జిల్లా ఎస్పీపై ఫిర్యాదు

తమ ప్రభుత్వంలో ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా చట్టానికి అతీతులుగా కారంటూ తమ నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆ స్వేచ్ఛను నెల్లూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. ఈ ఉదంతం మొత్తంపై ఓ ఉన్నత స్థాయి కమిటీని వేసి దర్యాప్తు చేయాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా బైఠాయించిన సరళ వెంట వెంకటాచలం మండలానికి చెందిన కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారని గుర్తు చేశారు. సొంత పార్టీ నాయకులు.. తన మీదే కేసు పెట్టడానికి సహకరించారంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు.

ఎస్పీతో సఖ్యత లేదు..

ఎస్పీతో సఖ్యత లేదు..

జిల్లా ఎస్పీకి తనపై కోపం ఉందని, ఆయనతో తనకు సఖ్యత లేదని కోటంరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎస్పీ జిల్లాకు వచ్చారని, ఇప్పటికీ కొనసాగుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందే ఆయనను నాటి చంద్రబాబు ప్రభుత్వం జిల్లాకు పంపించిందని అన్నారు. మాజీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి కీలక నాయకులు ఉన్న జిల్లాకు ఎలాంటి ఎస్పీని పంపిస్తారో తెలియనిది కాదని చెప్పారు. ఎన్నికల సమయం నుంచి తనపై ఎస్పీ ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.

నా మీద కోపాన్ని అధికారులపై..

నా మీద కోపాన్ని అధికారులపై..

తన మీద ఉన్న కోపంతో జిల్లా ఎస్పీ.. తన నియోజకవర్గంలో పనిచేస్తోన్న అధికారులపై ప్రదర్శిస్తున్నారని, వారిని వేధిస్తున్నారని కోటంరెడ్డి ఆరోపించారు. జిల్లా ఎస్పీ వ్యక్తిగత కక్ష కోసం తనను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆయనను ఇంకా బదిలీ వేటు వేయలేదని, తమ ప్రభుత్వం ఎంత నిజాయితీగా పనిచేస్తోందో స్పష్టం చేయడానికి నెల్లూరు జిల్లా ఎస్పీ ఘటనను ఉదాహరణగా చెప్పుకోవచ్చని అన్నారు. తన స్నేహితుడు శ్రీకాంత్ రెడ్డి భార్య స్వయంగా ఎస్పీకి ఫోన్ చేసినప్పటికీ.. ఆయన స్పందించలేదని, అలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయని చెప్పారు.

English summary
YSR Congress Party MLA from Nellore Rural Assembly constituency was alleged on distrct Police Superintendent after his arrest. He told to reporters that district SP politically harassed to YSRCP leaders and him self also. SP harassed to all government officials who worked in his own assembly constituency. SP misused the freedom and power, which is given by the Chief Minister YS Jagan, kotamreddy added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X