వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోతిరెడ్డిపాడు నుండి వెంటనే నీటిని విడుదల చేయాలి: వైసీపీ

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కడప: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి ధ్వజమెత్తారు. అభివృద్ధి పేరుతో 15 లక్షల కోట్లు చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారని ఆయన ఆరోపించారు.

పోతిరెడ్డిపాడు లైనింగ్ పనులు వెంటనే చేపట్టాలన్నారు. అంతేకాదు దిగువకు 22 వేల క్యూసెక్కులు విడుదల చేయాలని వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రఘునాథరెడ్డి, ఐజయ్య పరిశీలించారు.

Ysrcp mla Ravindranath reddy slams on Chandrababunaidu

11 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోతిరెడ్డి పాడును రాయలసీమ రైతుల కోసం 44 వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని తెలిపారు. పోతిరెడ్డి పాడు నుంచి భనకచెర్ల వరకు కాల్వ లైనింగ్ పనులు పూర్తి చేస్తే 22 వేల క్యూసెక్కుల నీరు భనచెర్లకు అక్కడి నుంచి తెలుగుగంగ, ఎస్సార్బీసీ, వెలుగోడు రిజర్వాయర్‌కు నీరు వదిలే అవకాశం ఉన్నా ఏమీ పట్టకుండా మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు.

రాయలసీమకు నీరు తామే ఇచ్చామంటూ టీడీపీ నేతలు అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో గరిష్ట స్థాయిలో నీరు ఉన్నప్పటికీ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు నీరు విడుదల చేయడం లేదని అన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా వాసులు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఇక వైఎస్‌ఆర్‌ కుటుంబానికి విశేష స్పందన లభిస్తోందని, ఈ కార్యక్రమాన్ని మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ వైఎస్‌ఆర్‌ కుటుంబంలో 75లక్షల మంది భాగస్వామ్యులు అయ్యారన్నారు.

English summary
Ysrcp mla Ravindranath reddy made allegations on Ap chiefminister Chandrababunaidu on Tuesday.Ysrcp leaders visited potireddypadu headregulator on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X