వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిలతో లోకేశ్, ‘కడుపుచేసే’ బాలకృష్ణ, టీడీపీ హయంలో సెక్స్ రాకెట్.. చంద్రబాబుపై రోజా ఫైర్

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Winter Sessions 2019 : Roja Over Balakrishna's Comment || Oneindia Telugu

మహిళల భద్రతపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ జరిగింది. దిశ ఘటనను ఉదహరిస్తూ వైసీపీ మహిళ నేతలు ప్రసంగించారు. ఉల్లి సమస్యపై చర్చించాలని టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుకోబోయారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. లోకేశ్, బాలకృష్ణ, చంద్రబాబుపై ఫైరయ్యారు. మహిళల అంశంపై చర్చిస్తుంటే యావత్ దేశం ఏపీ అసెంబ్లీని గమనిస్తోందని రోజా పేర్కొన్నారు.

బండారం బయటపడుతుందా..?

బండారం బయటపడుతుందా..?

టీడీపీ నేతలు ఎందుకు ఆందోళన చేస్తున్నారో అర్థం కావడం లేదని రోజా అన్నారు. ఎక్కడ కాల్ మనీ సెక్స్ రాకెట్ బయటపడుతుందా అనే భయంలో వారిలో ఉందన్నారు. విజయవాడలో టీడీపీ నేతలు దాదాపు 200 మందిని సెక్స్ రాకెట్ కూపంలోకి నెట్టారని ఆరోపించారు. లోకేశ్ అమ్మాయిలతో దిగిన ఫోటోలా గురించి చర్చిస్తారా అని భయపడుతున్నారా అని రోజా ప్రశ్నించారు. ఇక బాలకృష్ణ గురించి అయితే చెప్పక్కర్లేదని చెప్పారు. అమ్మాయి కనిపిస్తే కడుపు చేసే వ్యక్తి ఆయన అని దుమ్మెత్తిపోశారు. టీడీపీ నేతలను చంద్రబాబు నాయుడు ఎందుకు వెనకెసుకొస్తున్నారని ఫైరయ్యారు.

 పెద్దపీట

పెద్దపీట

మహిళల భద్రతకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని రోజా చెప్పారు. ఒక ఎస్సీ మహిళకు డిప్యూటీ సీఎం పదవీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆడవాళ్ల మాన, ప్రాణాలపై సభలో చర్చిస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఆందోళన చేయించడం సరికాదన్నారు. వారి వైఖరి తెలిసే ప్రజలు ఓ మూలానా కూర్చొబెట్టారని రోజా మండిపడ్డారు. చంద్రబాబు ఆలోచన మొత్తం లోకేశ్ తినే పప్పులో ఉల్లిపాయ గురించే అని విమర్శించారు. ఆయనకు ఆడపిల్లలు ఉంటే వారి విలువ తెలిసుండేది కాని గుర్తుచేశారు. లేనందున మహిళల సమస్యపై మాట్లాడేందుకు అడ్డుకుంటున్నారని చెప్పారు.

 వెలుగులోకి వచ్చింది వీరే.. ఇంకెందరో..

వెలుగులోకి వచ్చింది వీరే.. ఇంకెందరో..

దిశ ఘటనకు ముందు రిషితేశ్వరి, నిర్భయ, స్వప్నిక, ప్రణీత కూడా బలయ్యారని చెప్పారు. దిశ నిందితులకు శిక్ష పడింది కానీ.. నిర్భయ దోషులకు ఇంకా శిక్ష అమలు కాలేదని రోజా గుర్తుచేశారు. రిషితేశ్వరి కేసులో శిక్షనే ఖరారు కాలేదన్నారు. స్వప్నిక, ప్రణీత ఘటనలో కూడా సత్వర న్యాయం జరిగిందని చెప్పారు. మీడియాలో హైలెట్ అయినవారికి మాత్రమే న్యాయం జరిగిందని.. మరి మిగతావారి సంగతేంటి అని రోజా ప్రశ్నించారు. ఆడపిల్లలను వేధించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలను అడవిలో వదిలేస్తే తిరిగొస్తారు గానీ.. సమాజంలో బయటకు వెళితే తిరిగొస్తారనే గ్యారంటీ లేదన్నారు.

గన్ వచ్చేలోపే జగన్ శిక్షిస్తారు..

గన్ వచ్చేలోపే జగన్ శిక్షిస్తారు..

బహుబలి సినిమాలో ఒక సీన్‌ను రోజా గుర్తుచేశారు. మాజీ సేనాధిపతి భార్యను సేనాధిపతి భుజంపై చేయివేయడంతో.. అతడి తలను నరుకుతాడని పేర్కొన్నారు. తాను సినిమా చూసిన సమయంలో కొందరు మహిళలు చప్పట్లు కొట్టారని చెప్పారు. అంటే మహిళలను వేధించినవారిపై చర్యలు తీసుకునేందుకు ప్రతీ ఒక్కరు స్వాగతిస్తున్నారని చెప్పారు. గన్ వచ్చే లోపు జగన్ శిక్షిస్తాడనే నమ్మకం ఏపీలో కలిగిస్తామని రోజా చెప్పారు.

English summary
ysrcp mla roja allegations on lokesh, balakrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X