వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"సుప్రీం చెప్పినా!: మగవాళ్లను చంపాలనే బాబు ఇలా.., వైసీపీ అధికారంలోకి వస్తే"

జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు వద్దని సుప్రీం కోర్టు ఆదేశిస్తే.. తమ రహదార్లు అసలు జాతీయ రహదారులే కాదనే రీతిలో చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోందని విమర్శించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న మద్యం పాలసీపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. సుప్రీం కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి.. ఇష్టారీతిన జీవోలను అమలుచేస్తున్నారని మండిపడ్డారు.

ఆ ఘనత చంద్రబాబుదే:

ఆ ఘనత చంద్రబాబుదే:

జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు వద్దని సుప్రీం కోర్టు ఆదేశిస్తే.. తమ రహదార్లు అసలు జాతీయ రహదారులే కాదనే రీతిలో చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎన్నో ప్రధాన రోడ్లను ఒక్క జీవోతో డీ నోటిఫై చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు.

Recommended Video

AP Assembly Sessions Started Without Opposition YSRCP | Oneindia Telugu
మగవాళ్లను చంపాలనే

మగవాళ్లను చంపాలనే

రాష్ట్రంలో ప్రతి 50 వేల మందికీ ఓ వైన్స్ షాపును తెరిపించి, మగవాళ్ల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని విమర్శించారు. పురుషులను చంపేయడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి మద్యం పాలసీలను అమలు చేస్తోందని విమర్శించారు.

జగనన్న మాట.. రాజన్న మాట

జగనన్న మాట.. రాజన్న మాట

ప్రధాన రహదారులను లోకల్ రోడ్లుగా మార్చి ఇష్టారీతిన వైన్ షాపులకు అనుమతి ఇచ్చారని అన్నారు. ఆడవాళ్ల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నాడని, ప్రజలు ఆయనకు బుద్ది చెప్పాలని సూచించారు. జగనన్న సీఎం అయితేనే ఆడవాళ్ల కష్టాలు తీరుతాయని, జగనన్న మాటిస్తే రాజన్న మాటిచ్చినట్టేనని అన్నారు.

వైసీపీ అధికారంలోకి వస్తే..

వైసీపీ అధికారంలోకి వస్తే..

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధం జరిగి తీరుతుందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలను తీసుకొచ్చింది వైఎస్ఆర్ అని గుర్తుచేశారు. రాజశేఖర్ రెడ్డిని గుర్తుచేసుకుని ఆయన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ జగన్ ను ఆదరించాలని అన్నారు.

English summary
YSRCP MLA Roja criticized AP Govt liquor policy. She said if YSRCP comes into power liquor ban will be implemented
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X