రోజాకు తప్పిన ప్రమాదం-తిరుపతి విమానంలో సాంకేతిక లోపం-బెంగళూరుకు మళ్లింపు
ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఇవాళ పెను ప్రమాదం తప్పింది. ఆమె రాజమండ్రి నుంచి తిరుపతికి వస్తుండగా హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తిరుపతి ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో సమస్యలు తలెత్తడంతో హెలికాఫ్టర్ ఇబ్బందులకు గురైంది. చివరికి పైలట్ దాన్ని దారి మళ్లించారు. హెలికాఫ్టర్ ను సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఇవాళ రాజమండ్రిలో రోజా ఎక్కిన ఇండిగో విమానం తిరుపతిలో ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ ల్యాండింగ్ సమయంలో సాంకేతిక కారణాలవల్ల ఈ విమానం ప్రమాదపు అంచుల దాకా వెళ్లింది.

ఈ సమయంలో పైలట్ చాకచక్యంగా స్పందించి ఆ ప్రమాదాన్ని తప్పించారు. ఇండిగో విమానాన్ని సేఫ్ గా బెంగుళూరుకు మళ్లించారు. బెంగళూరు ఎయిర్ పోర్టులో విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన జరిగిన చాలా సేపటి వరకూ రోజా విమానంలోనే ఉండిపోయారు.
రాజమండ్రి
నుంచి
తిరుపతి
వెళ్తున్న
ఇండిగో
విమానానికి
ల్యాండింగ్
సమస్య
ఎదురైంది.
తిరుపతి
ఎయిర్
పోర్టులో
ల్యాండింగ్
సాధ్యం
కాక
గంట
పాటు
గాలిలోనే
చక్కర్లు
కొట్టిన
ఇండిగో
ఫ్లైట్
ను
అనంతరం
దారి
మళ్లించాల్సి
వచ్చింది.
రాజమండ్రిలో
రోజాతో
పాటు
మాజీ
మంత్రి
యనమల,
టీడీపీ
ఎమ్మెల్యే
జోగేశ్వరరావు
కూడా
విమానం
ఎక్కిన
వారిలో
ఉన్నారు.
తిరుపతి ఎయిర్ పోర్టులో ల్యాడింగ్ ఇబ్బందుల నేపథ్యంలో ఇండిలో విమానాన్ని బెంగళూరు ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. అయితే ఈ ఘటనకు వాతావరణ సమస్యా లేక సాంకేతిక సమస్యా అనే విషయం లో స్పస్థత ఇవ్వడం లేదని మాజీ మంత్రి యనమల తెలిపారు. ఇండిగో సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఫ్లైట్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయాణికుల నుంచి ఇండిగో సిబ్బంది. అదనపు రుసుము డిమాండ్ చేసిన వ్యవహారం మరింత కలకలం రేపింది. యాజమాన్యం తప్పిదానికి తామెందుకు డబ్బులు కట్టాలని ప్రయాణికులు మండిపడ్డారు. బెంగుళూరు నుంచి గమ్యం స్థానాలకు చేరేందుకు ప్రయాణికులు సొంత ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది.
రోజాకు తప్పిన ప్రమాదం-తిరుపతి విమానంలో సాంకేతిక లోపం-బెంగళూరుకు మళ్లింపు#rkroja pic.twitter.com/iNFUmKMymI
— oneindiatelugu (@oneindiatelugu) December 14, 2021