వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రుల గంజాయిసాగు, ఈనాడు పేపర్లో వచ్చింది: రోజా సంచలనం

మంత్రులే గంజాయి సాగు చేయిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ జిల్లాను టిడిపి సభ్యులు దోచుకుంటున్నారని మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

విశాఖ: మంత్రులే గంజాయి సాగు చేయిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ జిల్లాను టిడిపి సభ్యులు దోచుకుంటున్నారని మండిపడ్డారు.

<strong>చాలా రోజుల తర్వాత టిడిపి భేటీలో హరికృష్ణ, ఆరో స్థానంపై బాబు డైలమా</strong>చాలా రోజుల తర్వాత టిడిపి భేటీలో హరికృష్ణ, ఆరో స్థానంపై బాబు డైలమా

చంద్రబాబు హయాంలో బెల్టు షాపులను విపరీతంగా పెంచారని చెప్పారు. ఈ ప్రభుత్వం హయాంలో దోచుకోవడం పైన ఉన్న శ్రద్ద విశాఖకు రైల్వే జోన్ తీసుకు రావడం పైన లేదన్నారు.

రైల్వే జోన్‌పై పెదవి విప్పరేం

రైల్వే జోన్‌పై పెదవి విప్పరేం

విశాఖలోనే అత్యధిక లిక్కర్ కేసులు ఉన్నాయన్నారు. రైల్వే జోన్ పైన చంద్రబాబు పెదవి విప్పటం లేదన్నారు. పోలీసుల నిఘా వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. బెల్టు షాపులతో పేదవారి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిందన్నారు.

గంజాయి సాగులో అయ్యన్న, అవినీతిలో గంటా

గంజాయి సాగులో అయ్యన్న, అవినీతిలో గంటా

మంత్రి అయ్యన్నపాత్రుడు గంజాయి సాగులో, మంత్రి గంటా శ్రీనివాస రావులు అవినీతిలో కూరుకుపోయారన్నారు. రైల్వే జోన్, ప్రత్యేక హోదా అంశాలను టిడిపి కేంద్రం కాళ్ల వద్ద తాకట్టు పెట్టిందన్నారు.

ఈనాడు పేపర్లోనే వచ్చింది

ఈనాడు పేపర్లోనే వచ్చింది

చంద్రబాబు అంటేనే కరువు అని అర్థమవుతోందన్నారు. అనంతపురం జిల్లాలో టిడిపికి అత్యధిక ఓట్లు, సీట్లు వచ్చాయని, అక్కడ ఎంతోమంది రైతులు చనిపోయారన్నారు. కరువు తాండవిస్తోందన్నారు. ఏపీలో కరువు తాండవిస్తోందని ఈనాడు పత్రికలోనే నిన్న, మొన్న వార్త వచ్చిందన్నారు.

కుప్పం నుంచి కూడా తరలిపోతున్నారు

కుప్పం నుంచి కూడా తరలిపోతున్నారు

టిడిపి అధికారంలోకి వచ్చాక 1152 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రోజా చెప్పారు. ఇక్కడి రైతులు పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారన్నారు. చివరకు చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నుంచి కూడా తరలిపోతున్నారన్నారు.

పులివెందులకు నీరిచ్చామంటున్నారు కానీ..

పులివెందులకు నీరిచ్చామంటున్నారు కానీ..

రైతులు కూలీలుగా మారిపోకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. రైతుల బాధలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కృష్ణా జిల్లాలోనే 35 మంది రైతులు మృతి చెందారన్నారు. పులివెందులకు నీరు ఇచ్చామని చంద్రబాబు చెబుతున్నారని, కానీ కృష్ణా, కుప్పం నుంచే రైతులు వలసపోతున్నారన్నారు.

English summary
YSRCP MLA Roja hot comments on Ministers Ayyannapatrudu and Ganta Srinivas Rao on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X