• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబును షేక్ చేసిన జగన్ -రోజా స్టన్నింగ్ కామెంట్స్ -ఏపీ సీఎంను అంబేద్కర్‌తో పోల్చిన ఉషశ్రీ

|

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, వేధింపులను అరికట్టాలనే ఉద్దేశంతో రూపొందించిన దిశ చట్టాన్ని కేంద్రం తిప్పి పంపడంతో దానికి సవరణలు చేస్తూ రూపొందించిన తాజా బిల్లును గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దిశ పోలీస్ స్టేషన్ల ఎత్తివేత, 21 రోజుల్లోనే నిందితులకు శిక్షల వంటి కీలక అంశాలు లేకుండా సవరించిన బిల్లుపై చర్చకు ప్రభుత్వం నిరాకరించింది. అదే సమయంలో ఏపీలో అమలవుతోన్న సంక్షేమ పథకాలపై చర్చ జరగ్గా, వైసీసీ మహిళా ఎమ్మెల్యేలు ప్రసంగాలతో అదరగొట్టారు..

జగన్‌కు బీజేపీ భారీ షాక్ -ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి ఎంపీ సురేశ్ ప్రభు ఫిర్యాదు -సంచలన లేఖలుజగన్‌కు బీజేపీ భారీ షాక్ -ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి ఎంపీ సురేశ్ ప్రభు ఫిర్యాదు -సంచలన లేఖలు

ఆ అర్హత వైసీపీకే ఉంది..

ఆ అర్హత వైసీపీకే ఉంది..


మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు ఒక్క వైసీపీకి మాత్రమే ఉందని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆడబిడ్డల్ని రక్షించేందుకు దిశ చట్టం తెచ్చిన సీఎం జగన్.. మహిళా సాధికారత ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. గురువారం అసెంబ్లీలో సంక్షేమ పథకాలపై జరిగిన చర్చలో మాట్లాడిన రోజా.. మహిళలకు ఇచ్చిన ప్రతీ హామీని సీఎం జగన్ అమలు చేశారన్నారు. అదే సమయంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై రోజా నిప్పులు చెరిగారు.

జగన్ గాడిదలు కాస్తున్నాడా? కేంద్రాన్ని ఒప్పించాడా? -పోలవరం ఘనత వైఎస్సార్‌దికాదు: చంద్రబాబుజగన్ గాడిదలు కాస్తున్నాడా? కేంద్రాన్ని ఒప్పించాడా? -పోలవరం ఘనత వైఎస్సార్‌దికాదు: చంద్రబాబు

బాబు 420.. జగన్ క్రియేటర్

బాబు 420.. జగన్ క్రియేటర్

‘‘వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేయడం నా పూర్వ జన్మ సుకృతం. సీఎం జగన్ మహిళల పక్షపాతి. అంతేకాదు, భవిష్యత్ తరాల గురించి కూడా ఆలోచనలు చేసే క్రియేటర్. మహిళా సాధికారత కోసం, ఆడవాళ్లను తిరుగులేని శక్తులుగా ఎదిగేలా చేయడం కోసం జగన్ కృషి చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతి పథకంలో మహిళలకే పెద్ద పీట వేస్తున్నారు. క్రియేటివ్ ఆలోచనలు ఉన్న సీఎం వైఎస్ జగన్.. మహిళలకు ఆస్తులను క్రియేట్ చేసి చూపిస్తున్నారు. చంద్రబాబుది 420 విజన్ అయితే, జగన్ ది విప్లవాత్మక విజన్. అసలు చంద్రబాబు గురించి చెప్పాలంటే..

అసలైన విజన్ ఇదే..

అసలైన విజన్ ఇదే..

టీవీల్లో ఎలా కనపడాలా? అన్నదే చంద్రబాబు అసలైన విజన్. మహిళల అభ్యున్నతికి చంద్రబాబు చేసిందేమీ లేదు. టీడీపీని, సుదీర్గ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబును షేక్ చేసిన ముఖ్యమంత్రి జగన్. వ్యవస్థల్ని నాశనం చేసే వ్యక్తి చంద్రబాబైతే.. జగన్ మాత్రం తన తోబుట్టువు కంటే ఎక్కువగా మహిళల్ని అభిమానిస్తారు. పేదవాళ్లకు ఇచ్చే ఇళ్లపై కూడా టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు'' అని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. కాగా,

జగన్ అభినవ అంబేడ్కర్..

జగన్ అభినవ అంబేడ్కర్..

సంక్షేమ పథకాలపై చర్చ సందర్భంగా అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ ను ఏకంగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ తో పోల్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల అభ్యున్నతి కోసం జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, కొనసాగిస్తున్న పథకాలను చూశాక జగన్ అభవన అంబేద్కర్ అనకుండా ఉండలేనని ఉషశ్రీ చెప్పారు. బీసీలకు సముచిత స్థానం కల్పిస్తూ మరోవైపు నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు న్యాయం జరిగే విధంగా 50 శాతం రిజర్వేషన్ కల్పించి.. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్న సీఎం జగన్ అభినవ అంబేద్కర్ గా మారారు అంటూ ఉషశ్రీ ప్రశంసించారు. అంబేద్కర్ ఆశయాలను జగన్ అమలు చేస్తున్నారని ఆమె చెప్పారు.

English summary
Speaking during a debate on welfare schemes in the Assembly on Thursday, ysrcp mla rk roja said CM YS Jagan had implemented every promise given to women. roja criticised TDP chief Chandrababu. ysrcp mla ushasri charan compares cm jagan with dr. br ambedkar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X