హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పుట్‌పాత్‌పై సొమ్మసిల్లిన రోజా: జగన్ పరామర్శ, అంబులెన్స్‌లో ఆసుపత్రికి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ సభ్యుల ఆందోళనతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడింది. కాగా, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా... తనను సభలోకి రెండో రోజు కూడా అనుమతించకపోవడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ ఆవరణలోకి గాందీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు.

అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద ఉదయం 9 గంటల నుంచి రోజా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రోజా సొమ్మసిల్లి పడిపోయారు. మౌనదీక్ష చేస్తున్న ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉదయం నుంచి ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం, దానికి తోడు ఎండలో ఆమె ఆందోళన చేపట్టడంతో ఆమె డీహైడ్రేషన్‌కు గురైనట్లు తెలుస్తోంది.

దీంతో ఆమె తీవ్రంగా నీరసించారు. అయినా సరే అసెంబ్లీలోని పుట్‌పాత్‌పై దుప్పటి వేసుకుని అక్కడే పడుకున్నారు. తన సహచర ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో పాటు ఇతర మహిళా ఎమ్మెల్యేలు రోజా పక్కనే ఉండి ఆమెకు సపర్యలు చేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆమెకు కొబ్బరి బొండాం నీళ్లు తాగారు.

ఆమెకు లోబీపీ ఉన్నట్లు తెలుస్తోంది. రోజా ఆరోగ్యం క్షీణించిన విషయాన్ని అసెంబ్లీ వైద్యులకు సమాచారం అందించారు. మరోవైపు రోజాను అసెంబ్లీలోకి అనుమతించకపోవడంపై పలువురు ఎమ్మెల్యేలు ఆమెకు సంఘీభావంగా అక్కడే ఉన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత వైయస్ జగన్ సైతం రోజాను పరామర్శించారు.

Ysrcp MLA Roja stage protest at assembly infront of gandhi statue

వైయస్ జగన్‌తో పాటు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా రోజాను పరామర్శించారు. రోజా ఆరోగ్య పరిస్థితిని వైద్యులు సైతం పరీశించారు. అనంతరం రోజా ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించడంతో ఆమెను అంబులెన్స్‌లో నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు వైసీపీ ఎమ్మెల్యేలు పాదయాత్రకు బయల్దేరి వెళ్లారు.

రాజ్యాంగం మీద కూడా ఏమాత్రం గౌరవం లేని ప్రభుత్వం.. హైకోర్టు ఉత్తర్వులున్నా ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించకపోవడంతో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతిపత్రం అందించారు.

రోజాను సభలోకి అనుమతించాలంటూ వైసీపీ అధినేత వైయస్ జగన్‌తో పాటు ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలు ధరించడంతో ఎండ వేడిమి కూడా తీవ్రంగా ఉండటంతో ఏం చేద్దామని జగన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు.

భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశంపై కూడా చర్చిస్తున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు కూడా రోజాకు మద్దతు తెలిపారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ రోజాను సభలోకి అనుతించకపోవడంపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

నిమ్స్‌లో రోజాకు వైద్యపరీక్షలు


వైసీపీ ఎమ్మెల్యే రోజా పంజాగుట్టలోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రసుత్తం వైద్యులు రోజాకు షుగర్‌, బీపీ పలు వైద్యపరీక్షలు నిర్వహించారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైద్యులతో మాట్లాడి రోజా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ప్రసుత్తం రోజా ఆరోగ్యం నిలకడగా ఉందని, చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. మరో 24 గంటల పాటు తమ పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో రోజాను విజయసాయిరెడ్డితో పాటు వైసీపీఎమ్మెల్యేలు ఆమెను పరామర్శించారు.

English summary
Ysrcp MLA Roja stage protest at assembly infront of gandhi statue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X