కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనుచరుల హల్చల్ .. టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి ఇంటిపై దాడి

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఎన్నికలు ముగిసి ఏడాది కాలం అయినా ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. విధ్వంసం సృష్టించటం రాజకీయ నాయకులకు పరిపాటిగా మారింది. ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవటం పెరిగిపోయింది. రాజకీయ కక్షలు , కార్పణ్యాలు బాగా పెరిగిపోయాయి. కరోనా రాక ముందు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా బెదిరింపులు, దాడులు కొనసాగాయి.

కర్నూలు స్థానిక పోరు: బైరెడ్డి చొరవతో ఎమ్మెల్యే ఆర్థర్ ప్రత్యర్ధి వైసీపీలో చేరికకర్నూలు స్థానిక పోరు: బైరెడ్డి చొరవతో ఎమ్మెల్యే ఆర్థర్ ప్రత్యర్ధి వైసీపీలో చేరిక

కర్నూలు ఖడక్‌పురలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ అనుచరుల వీరంగం

కర్నూలు ఖడక్‌పురలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ అనుచరుల వీరంగం

ఇక తాజాగా ఒక పక్క కర్నూలులో కరోనా విస్తరిస్తున్నా రాజకీయ ఘర్షణలు మాత్రం ఆగటం లేదు . కర్నూలు ఖడక్‌పురలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ అనుచరులు వీరంగం సృష్టించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తాము చెప్పిన మాటలు వినలేదంటూ స్థానిక కార్పొరేటర్‌ అభ్యర్థి అలీఖాన్‌ ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి చేశారు. అలీఖాన్ ఇల్లు ద్వంసం చేశారు . వీరంగం వేశారు. ఇంట్లోని వస్తువులను సైతం ధ్వంసం చేశారు.

టీడీపీ నుండి కార్పొరేటర్ గా పోటీ చేసిన అలీఖాన్ ఇంటిపై దాడి

టీడీపీ నుండి కార్పొరేటర్ గా పోటీ చేసిన అలీఖాన్ ఇంటిపై దాడి

ఇక అలీఖాన్ ఇంటిపై రాళ్లు, కర్రలు విసిరి నానా రచ్చ చేశారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన బైక్స్ ని కూడా ధ్వంసం చేశారు. 20మందికి పైగా గుంపుగా వచ్చి కొద్దిసేపు నానా రచ్చ చేసి వెళ్లారు. ఇక అలీఖాన్ ఇంటిపై జరిగిన దాడి అంతా అలీఖాన్ ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఇంతగా వారు దాడి చెయ్యటానికి అలీఖాన్ చేసిన తప్పు ఒకటే. చాలా కాలంగా టీడీపీలో క్రీయ శీలకంగా ఉన్న అలీఖాన్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసినట్లు సమాచారం.

గతంలోనూ అలీఖాన్ పై దాడికి యత్నాలు .. బెదిరింపులు

గతంలోనూ అలీఖాన్ పై దాడికి యత్నాలు .. బెదిరింపులు

ఇక అలీఖాన్ ను నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోవాలని చాలా సార్లు చెప్పినా ఆయన వినిపించుకోలేదు .దీంతో గతంలో చాలా సార్లు అతనిపై దాడి చేసే ప్రయత్నాలు చేసినట్లు అలీఖాన్‌ సన్నితులు తెలిపారు. ఇక అప్పుడే కేసు పెడదాం అంటే అలీఖాన్‌ వర్గంపై ఎమ్మెల్యే వర్గం ఒత్తిడి పెంచి కేసులు పెట్టకుండా చేశారని ఆరోపించారు. ఇక తాజాగా ఎమ్మెల్యే అనుచరుల నుంచి తమకు ప్రాణహని ఉందని అలీఖాన్‌ కుంటుంబం పోలీసులను ఆశ్రయించింది.

Recommended Video

TTD Temple Lands Sale Cancelled | AP CM Jagan Serious on TTD Officials
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు .. కేసు నమోదు

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు .. కేసు నమోదు

తమకు రక్షణ కల్పించాలని అలీఖాన్‌ తల్లి విజ్ఞప్తి చేస్తుంది.దాడి ఘటనపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.ఎమ్మెల్యే అనుచరులు ఇంట్లోకి వెళ్లి మరీ వస్తువులను బయటపడేసి భయభ్రాంతులకు గురి చెయ్యటంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక వీరి దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతా జరిగినా , ఎమ్మెల్యే అనుచరుల పని అని చర్చ జరుగుతున్నా ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాత్రం ఈ దాడి ఘటనపై స్పందించలేదు .

English summary
MLA Hafeez Khan's followers have created a scene in Khadakpura. Local corporator candidate Ali Khan's home was attacked by MLA supporters after he refused to listen to them. Ali Khan's house was destroyed. Items in the house were also destroyed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X