వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన గిడ్డి ఈశ్వరి, చింతమనేని ఎదురుదాడి

నేటి ఉదయం మొదలైన ఏపీ అసెంబ్లీ అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దానికి దారితీసింది. ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలపై అధికార పార్టీ సభ్యులు కౌంటర్ ఇవ్వడంతో ఇరు వర్గాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. సమస్యను

|
Google Oneindia TeluguNews

అమరావతి: నేటి ఉదయం మొదలైన ఏపీ అసెంబ్లీ అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దానికి దారితీసింది. ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలపై అధికార పార్టీ సభ్యులు కౌంటర్ ఇవ్వడంతో ఇరు వర్గాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో చివరకు స్పీకర్ సభను వాయిదా వేశారు.

కాగా, ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో మహిళల సమస్యల గురించి వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రస్తావించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయని ఈశ్వరి ఆరోపించారు. విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ దోషులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఎవరూ ప్రశ్నించడం లేదని, దీనికేం సమాధానం చెబుతారని నిలదీశారు. రిషితేశ్వరి అనుమానస్పద మృతి విషయంలో దోషులను కాపాడేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. అనంతపురంలో ఓ టీడీపీ సర్పంచ్ మహిళపై దాడి చేస్తే చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు.

YSRCP MLA's protest at speaker podium over women issues

ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఇలా మహిళా సమస్యలపై గిడ్డి ఈశ్వరి వరుస ప్రశ్నలు సంధించారు. అదే సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యే రోజాపై ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఓ మహిళా శాసనసభ్యురాలిని ఏడాది పాటు సస్పెండ్ చేసిన ఘనత చంద్రబాబు సర్కార్ కే దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గిడ్డి ఈశ్వరి మాట్లాడుతున్న సమయంలో అధికార పార్టీ సభ్యులు మధ్యలో జోక్యం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా హోంమంత్రి వివరణ ఇవ్వకుండానే టీడీపీ ఎమ్మెల్యేలు అనిత, చింతమనేని ప్రభాకర్ ఆరోపణలు చేశారు. నా గురించి ఓనమాలు కూడా తెలియవంటూ చింతమనేని చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష సభ్యులను ఆగ్రహానికి గురిచేశాయి.

చింతమనేని వ్యాఖ్యలతో అధికార పార్టీ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వైసీపీ సభ్యులంతా స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష ఆందోళనలతో స్పీకర్ సభనున పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

English summary
YSRCP MLA Giddi Eswari raised women issues in state assembly. While she was describing the problems, ruling party MLA's are opposed her
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X