వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఎంపీలతో పాటు ఎమ్మెల్యేల రాజీనామా, జగన్ దీక్ష?

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:ప్రత్యేక హోదా అంశంపై టిడిపిని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు వైసీపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడ రాజీనామాలు చేసే యోచనలో ఉన్నారని సమాచారం. మరో వైపు ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఇతర పార్టీల మద్దతును కూడగట్టే ప్రయత్నం వైసీపీ చేయనుంది.

Recommended Video

YS Jagan Fools People name of MPs resignation

జగన్ దెబ్బ: ఆత్మరక్షణలో చంద్రబాబు, ఏం చేస్తారు?జగన్ దెబ్బ: ఆత్మరక్షణలో చంద్రబాబు, ఏం చేస్తారు?

ఏపీ రాజకీయాల్లో రానున్న రోజుల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఏప్రిల్ 6వ, తేదిన రాజీనామాలను చేస్తామని వైసీపీ ప్రకటించింది.

వైసీపీ ఎంపీల రాజీనామాలు ఉత్తవే, ఎన్నికలొస్తాయి: జెసి దివాకర్ రెడ్డివైసీపీ ఎంపీల రాజీనామాలు ఉత్తవే, ఎన్నికలొస్తాయి: జెసి దివాకర్ రెడ్డి

ఈ ప్రకటన నేపథ్యంలో ఏపీలో రాజకీయాల్లో హీట్ పెరిగింది. వైసీపీ ప్రకటనపై టిడిపి విమర్శలు గుప్పిస్తోంది. కానీ, రాజకీయంగా ఈ పరిణామం టిడిపికి ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.

పవన్‌కు షాక్: ఏ అధికారంతో లెక్కలడుగుతున్నారు: విష్ణు సంచలనంపవన్‌కు షాక్: ఏ అధికారంతో లెక్కలడుగుతున్నారు: విష్ణు సంచలనం

వైసీపీ రాజీనామాల బాట

వైసీపీ రాజీనామాల బాట

ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొని వైసీపీ ఎంపీలు ఏప్రిల్ 6వ, తేదిన రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఎంపీల బాటలోనే ఎమ్మెల్యేలు కూడ నడిచే అవకాశం లేకపోలేదు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడ రాజీనామాలు చేయాలని యోచిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేస్తే రాజకీయంగా టిడిపిపై తీవ్రమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. అంతేకాదు రాజకీయంగా టిడిపి మీద పైచేయి సాధించే అవకాశం ఉందని కూడ వైసీపీ నేతలు భావిస్తున్నారు.

 ఢిల్లీకి పాదయాత్రగా వైసీపీ నేతలు

ఢిల్లీకి పాదయాత్రగా వైసీపీ నేతలు

ప్రత్యేక హోదాను ఇవ్వాలనే డిమాండ్‌తో వైసీపీ నేతలు పాదయాత్ర ద్వారా ఢిల్లీకి వెళ్ళాలనే యోచనలో ఉన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం చేయాలని వైసీపీ భావిస్తోంది. అంతేకాదు ఇదే తరుణంలో ఇతర పార్టీలను ఈ అంశానికి తమకు మద్దతివ్వాలని వైసీపీ ప్రయత్నించాలని భావిస్తోంది.

జగన్ దీక్ష

జగన్ దీక్ష

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ దీక్ష చేయాలనే యోచనలో కూడ ఉన్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే ఎప్పుడు ఎక్కడ జగన్ దీక్ష చేస్తారనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.అయితే ప్రస్తుతం జగన్ పాదయాత్రలో ఉన్నారు. ఎంపీలు రాజీనామా చేసే సమయం నెలకు పైగా సమయం ఉంది. ఈసమయంలోనే జగన్ దీక్ష చేస్తారా, ఆ తర్వాత చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

 టిడిపికి ఇబ్బందేనా

టిడిపికి ఇబ్బందేనా

వైసీపీ తీసుకొన్న రాజీనామాల నిర్ణయం ఇప్పటికిప్పుడు మాత్రం రాజకీయంగా టిడిపిపై ఇబ్బందిని కలిగిస్తోంది. వైసీపీ కంటే ముందే రాష్ట్ర ప్రయోజనాల కోసమని టిడిపి ఎన్డీఏ నుండి బయటకు వస్తోందా లేదా అనే పరిణామాలు కూడ ప్రస్తుతం ఆసక్తిని కల్గిస్తున్నాయి.

English summary
Ysrcp MLAs likely to resignation in April 2018 for special status. Ysrcp MPs will be resign on April 6 .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X