వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జగన్‌తో విసిగిపోతున్న వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీలోకి, ఎంతమంది పోటీ చేస్తారు?'

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరుతో విసిగిపోయిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు బుధవారం అన్నారు.

చదవండి: ఆసక్తికరం: చంద్రబాబు దీక్షకు కొణతాల రామకృష్ణ? మంత్రుల ఫోన్లు

వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్నారని చెప్పారు. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై కాల్వ తీవ్రంగా స్పందించారు.

YSRCP MLAs unhappy with YS Jagan, will join TDP: Kalva

ఇప్పటికే జగన్ తీరుతో అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఆయన తీరుకు బాధితులైన వారు తమ పార్టీలో చేరిన విషయాన్ని విజయ సాయి రెడ్డి మరిచిపోయినట్లుగా ఉన్నారని చెప్పారు.

చదవండి: పవన్ కళ్యాణ్‌పై విమర్శల దుమారం: నటి శ్రీరెడ్డిపై కేసు, ప్రియాంక ఫిర్యాదు

ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్న విషయం తెలుసుకోవాలని హితబోధ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు తిరిగి పోటీ చేసేందుకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చెప్పాలని ఎద్దేవా చేశారు. విజయ సాయి రెడ్డి పార్టీ పరిస్థితి తెలుసుకోవాలన్నారు.

ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఏపీ ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేశామని మంత్రి నక్కా ఆనందబాబు వేరుగా అన్నారు. అణగారిన వర్గాల కోసం అంబేడ్కర్‌ రాజ్యాంగంలో హక్కులు కల్పించారని, అంబేడ్కర్‌ను అవమానించేలా రాజ్యాంగ సవరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీల హక్కులు కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.

English summary
Telugudesam party leader Kalva Srinivasulu on Wednesday said that YSRCP MLAs unhappy with their party chief YS Jagan, will join TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X