కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సుబ్బారెడ్డి హత్యకు కుట్ర! పరారీలో భూమా అఖిలప్రియ: జగన్ పార్టీ ఎమ్మెల్సీ సంచలనం

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సంచలన ఆరోపణలు, విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

భూమా సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర..50 లక్షలు డీల్..ఎవరు చంపాలనుకున్నారు..?భూమా సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర..50 లక్షలు డీల్..ఎవరు చంపాలనుకున్నారు..?

సుబ్బారెడ్డి హత్యకు అఖిలప్రియ సుపారీ..

సుబ్బారెడ్డి హత్యకు అఖిలప్రియ సుపారీ..


ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డిని చంపించడానికి మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ రూ. 50 లక్షలు సుపారీ ఇచ్చారని ఆరోపించారు. ఇంత చిన్న వయస్సులోనే హత్యలు చేయించాలని చూశారని మండిపడ్డారు. హత్యకు పురమాయించిన ముగ్గురు వ్యక్తులు కడప పోలీసులకు దొరికిపోయారని వివరించారు. ఇప్పుడు ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి.. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ పోరిపోయారని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.

పరాయి రాష్ట్రానికి అఖిలప్రియ పరారీ...

పరాయి రాష్ట్రానికి అఖిలప్రియ పరారీ...

అహోబిలం నృహింహస్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని, అక్కడ అభిషేకాలకు వెళ్లామని ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
తమ కోసమే ఆలయం తెరిచారని ఆరోపించడం సరికాదని అన్నారు. కరోనా నుంచి ప్రజల్ని బయటపడేయాలని స్వామివారికి పూజలు చేశామని, దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని అఖిలప్రియపై ఆయన మండిపడ్డారు. పరాయి రాష్ట్రంలో తలదాచుకున్న అఖిలయప్రియ తమపై ఆరోపణలు చేస్తోందని ఎద్దేవా చేశారు.

ప్రభాకర్ రెడ్డిపై అఖిలప్రియ విమర్శలు

ప్రభాకర్ రెడ్డిపై అఖిలప్రియ విమర్శలు


ఆళ్లగడ్డలో చేసిన అరాచకాలకు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా పద్ధతి మార్చుకోలేదని ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. కాగా, గంగుల ప్రభాకర్ రెడ్డి కుటుంబం కోసమే అహోబిలం నృసింహస్వామి ఆలయా తలుపులు తెరిచారంటూ ఇటీవల భూమా అఖిలప్రియ ఆరోపించిన విషయం తెలిసిందే. కొన్ని ఫొటోలు కూడా ట్వీట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. కరోనా పరిస్థితుల్లోనూ అధికార వైసీపీ నేతల కోసం ఆలయాలు తెరుచుకుంటున్నాయంటూ ఆరోపించారు.

Recommended Video

CM Jagan Denies Entry To Vijay Sai Reddy In His Chopper , Is It True?
ఇటీవలే ముగ్గురు నిందితుల అరెస్ట్..

ఇటీవలే ముగ్గురు నిందితుల అరెస్ట్..

ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర పన్నిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి రూ. 3.2లక్షల నగదు, ఒక పిస్టల్, 6 తూటాలు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సుబ్బారెడ్డి హత్యకు రూ. 50 లక్షలు డీల్ కుదుర్చుకున్నారని కడప డీఎస్పీ సూర్యనారాయణ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరుకుంటుందనే చర్చ ఇప్పుడు కర్నూలు కడప జిల్లాల్లో నడుస్తోంది. ఇక ఏవీ సుబ్బారెడ్డి రాజకీయ చరిత్ర చూస్తే 2009లో నాడు చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం నుంచి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. 2014లో భూమా కుటుంబం వైసీపీలో చేరడంతో వారితో పాటే వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం భూమా కుటుంబం తిరిగి టీడీపీలో చేరడంతో నాగిరెడ్డితో పాటే ఏవీ సుబ్బారెడ్డి కూడా టీడీపీలో చేరారు. నాగిరెడ్డి మరణంతో ఆయన ఒంటరివారయ్యారు. అయితే, ప్రస్తుతం ఆయన పార్టీ మారే ఉద్దేశంలో ఉండటంతో అఖిలప్రియ ఆయనను దూరం పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

English summary
ysrcp mlc gangula prabhakar reddy sensational comments on bhuma akhila priya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X