కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో వైసీపీ ఎంపీకి కరోనా పాజిటివ్: హోంక్వారంటైన్లోకి అవినాశ్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

కడప: కరోనా మహమ్మారి బారినపడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా కడప జిల్లాలో సెప్టెంబర్ 1,2 తేదీల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎంపీ అవినాశ్ రెడ్డికి కరోనా సోకినట్లు పరీక్షల్లో వెల్లడైంది.

కరోనా నిర్ధారణ కావడంతో ఎంపీ అవినాశ్ రెడ్డి వెంటనే హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. అయితే, కొద్ది రోజులుగా వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. దీంతో ఆయనతోపాటు హాజరైన ప్రజాప్రతినిధులు, అనుచరుల్లో ఆందోళన నెలకొంది.

 ysrcp mp avinash reddy tested corona positive

తాజాగా తూరుపుగోదావరి జిల్లాకి చెందిన కొత్త పేట వైసీపే ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోన సోకింది. ఈ విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం అయనకు కరోనా లక్షణాలు పెద్దగా లేక పోవడంతో హోం ఐసోలేషన్ లో ఉండే చికిత్స పొందుతున్నారు. కరోనా రావడంతో కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.

కాగా, తాజాగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆయనకు పెద్దగా కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ హోం ఐసోలేషన్‌లో ఉండే చికిత్స తీసుకుంటున్నారు. తనతో కొద్ది రోజులుగా సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు హోంక్వారంటైన్లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఇది ఇలావుంటే, రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా వరుసగా 10వేల కేసులు దాటుతున్నాయి.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,603 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,24,767కు పెరిగింది. మొత్తం 4.15లక్షల కేసులతో తమిళనాడు మూడో స్థానంలో, 7.64లక్షల కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.

Recommended Video

PV Narasimha Rao Centenary Celebrations ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు!!

శనివారం 82 మంది చనిపోగా, ఆదివారం ఆ సంఖ్య 88కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 14 మంది మృత్యువాతపడగా, చిత్తూరులో 12 మంది, కడపలో 9 మంది, అనంతపురంలో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, కర్నూలులో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, ప్రకాశంలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా రాష్ట్రంలో కరోనా వల్ల చనిపోయినవారి సంఖ్య 3,884కు పెరిగింది.

English summary
ysrcp mp avinash reddy tested corona positive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X