• search
  • Live TV
రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అలా ఐతే గెలిచి తీరాలా?: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ భరత్ కౌంటర్

|

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలను తిప్పికొట్టారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమడ్రి ఎంపీ భరత్. కాగా, పరిషత్‌ ఎన్నికల ఫలితాల్లో జనసేన పర్వాలేదనే స్థాయిలో స్థానాలను కైవసం చేసుకుంది. రాజమండ్రి ఎంపీ భరత్‌ దత్తత గ్రామంలోనూ సత్తాచాటిన జనసేన విజయం సాధించింది. దీనిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలు చేయగా.. తాజాగా కౌంటర్‌ ఇచ్చారు ఎంపీ భరత్.

తన దత్తత గ్రామం పొట్టిలంకలో ఎంపీటీసీ ఓటమిపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికావన్నారు. దత్తత తీసుకుంటే ఖచ్చితంగా గెలవాలని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. ఇక, జనసేన ప్రభావం ఆ గ్రామంలో ఎక్కువగా ఉంటుందన్న వైసీపీ ఎంపీ.. మరి ఆ గ్రామ సర్పంచ్ మా పార్టీ బలపరచిన అభ్యర్ధి విజయం సాధించారని... దీనిపై పవన్‌.. ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇక మరోవైపు, నో కాంట్రావర్సీ అంటూ జక్కంపూడి రాజా వర్గం రైతుల ఆరోపణలు కొట్టిపారేశారు భరత్. పురుషోత్తపట్నం రైతులను తననుఒక్కసారే కలిశారని తెలిపారు.

YSRCP MP Bharat takes on Pawan Kalyan for his words

కడియం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిపించాలి: పవన్ కళ్యాణ్

కడియం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లా కడియం మండల జెడ్పీటీసీ స్థానంతోపాటు అత్యధిక ఎంపీటీసీ స్థానాలను జనసేన పార్టీ గెలుచుకుంది.
ఈ నేపథ్యంలో 24వ తేదీన జరిగే మండలాధ్యక్ష పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. జనసేన పార్టీ సభ్యుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి, వారిని వారి కుటుంబ సభ్యుల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ తరఫున విజయం సాధించిన కడియం మండల ఎంపీటీసీలు మంగళవారం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ కలిశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "పరిషత్ ఎన్నికల్లో రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో జనసేన పార్టీ తీవ్రమైన ప్రతికూలతల మధ్య బరిలోకి దిగింది. అధికార వైసీపీ దాష్టీకాలు, పోలీసుల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొని 180 ఎంపీటీసీ స్థానాలు కైవసం చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా, కడియంతో కలిపి రెండు జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది. అయితే 24వ తేదీ జరగబోయే మండలాధ్యక్ష ప్రక్రియ ఉన్న నేపధ్యంలో జనసేన పార్టీ తరఫున గెలిచిన ఎంపీటీసీలు మీద వైసీపీ నాయకులు విపరీతమై ఒత్తిడి తీసుకువస్తున్నారు. పోలీసుల యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఒత్తిళ్లు, బెదిరింపులకు పాల్పడుతున్న విషయాన్ని మా పార్టీ నేతలు నా దృష్టికి తీసుకువచ్చారు. వైసీపీ ఇన్ని స్థానాలు గెలుచుకుని కూడా జనసేన గెలుచుకున్న స్థానాలు కూడా లాక్కోవాలనే ఉద్దేశ్యంతో మొండిపట్టుకుపోయి మా వారి మీద రకరకాల ఒత్తిళ్లు తెస్తూ, ప్రలోభాలు పెడుతున్నారన్నారు పవన్ కళ్యాణ్.

పోలీసు అధికారులను కూడా వాడుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉదాహరణకు కడియం మండలం పొట్టిలంకలో 1224 ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్ధి గెలుపొందితే కనీసం గెలిచిన అభ్యర్ధికి దండ వేసే పరిస్థితి లేకుండా నిర్ధాక్షణ్యంగా కామిరెడ్డి సతీష్ అనే జన సైనికుడిని దారుణంగా కొట్టారు. కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినప్పటికీ పోలీసులు కనికరం చూపలేదన్న విషయాన్ని పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకువచ్చారు. ఇది చాలా బాధ కలిగించింది. కడియం మండలం వీరవరం ఎంపీటీసీ స్థానాన్ని జనసేన గెలిచిందన్న అక్కసుతో కర్రలకు మేకులు కొట్టి చాలా అడ్డోగోలుగా, అన్యాయంగా కొత్తపల్లి అయ్యప్ప అనే కార్యకర్తపై అమానుషంగా దాడి చేశారు. పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి కేసు పెట్టాలని కోరితే వారి నుంచి స్పందన కరువయ్యింది. చివరికి మా పార్టీ నాయకులు స్టేషన్ బయట బైఠాయిస్తామని హెచ్చరిస్తే తప్ప కేసు ఫైల్ చేయలేదు.

ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మా నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు, ఆడపడుచులకు పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాం. 24వ తేదీన జరిగే మండలాధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో గనుక మావాళ్లను ఇబ్బంది పెట్టినా, ఓటింగ్ కి రానివ్వకున్నా స్వయంగా నేనే కడియపులంకకు వస్తాను. మా వాళ్లకు ఎలాంటి అన్యాయం జరిగినా స్వయంగా నేనే వచ్చి తేల్చుకుంటా. అలాంటి పరిస్థితులు కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే నేనూ దానికి సిద్ధంగానే ఉన్నానని తెలిపారు పవన్.

మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది

ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ దృష్టికి, రాష్ట్ర ఎన్నికల అధికారిణి నీలం సాహ్నీ దృష్టికి, చీఫ్ సెక్రటరీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకువస్తున్నాను. ఎన్నిక సజావుగా జరగకపోతే ఉత్పన్నమయ్యే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలి. కడియం మండలాన్ని మేము కైవసం చేసుకోబోతున్నాం. దాన్ని అడ్డుకునే హక్కు అయితే మీకు లేదు. ఇలాంటివి చేస్తానంటే ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగానే ఉన్నాం. ముందు ముందు కూడా మీ దౌర్జన్యాలను ఇలానే కొనసాగిస్తే విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్తాం. ముఖ్యంగా పోలీసు ఉన్నాతాధికారులు, జిల్లా అధికారులకు ప్రత్యేకించి ఒక విషయం చెబుతున్నాను. మా వాళ్ల మీద అమానుషంగా దాడులు జరగుతున్నాయి. మీరు ఒత్తిడులకు తలొగ్గి మా వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. ఈ పద్దతిని సరిచేసుకోండి" అని పవన్ కళ్యాణ్ కోరారు.

English summary
YSRCP MP Bharat takes on Pawan Kalyan for his words.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X