వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభకు నారా లోకేశ్.. గెలిచే సీటైతే చంద్రబాబు చేసేదదే: ఎంపీ నందిగం సురేశ్ సెటైర్

|
Google Oneindia TeluguNews

''గతంలో ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దారుణంగా మాట్లాడారు. ఇప్పుడేమో దళితులను చట్టసభల్లోకి పంపడానికే పోటీకి నిలబడ్డామని చెబుతున్నారు. ఎంతో గొప్ప మనసుతో ఓడిపోయే రాజ్యసభ సీటును దళితుడికి కేటాయించిన చంద్రబాబుది ప్రేమో, పగో అర్థం కావడంలేదు. నిజంగా తనకు 41మంది ఎమ్మెల్యేలుండి, కచ్చితంగా గెచిలే సీటైతే మరో ఆలోచన లేకుండా నారా లోకేశ్‌నే రాజ్యసభకు పంపేవారు''అని బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ ఎద్దేవా చేశారు.

Recommended Video

Rajya Sabha Polls : TDP Using Dalits For Self Interest | అలా అయితే లోకేశ్‌ రాజ్యసభకు...!!

బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎంపీ సురేశ్.. టీడీపీలోని దళిత నేతలకు పదవులు ఆశ చూపించి ఆడుకోవడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. 2008లో గెలిచే అవకాశం ఉన్నా దళితులకు రాజ్యసభ అవకాశం కల్పించలేదని, 2016లో పుష్పరాజును, ఆ తర్వాత గవర్నర్ పదవి పేరుతో మోత్కుపల్లి నర్సింహులును బాబు దారుణంగా మోసం చేశాడని, తద్వారా దళిత నేతల్ని బలిపశువులు చేస్తూ వచ్చారని, తాగా వర్ల రామయ్యను పోటీకి దింపడం కూడా అలాంటిదేనని విమర్శించారు.

ysrcp mp nandigam suresh slams chandrababu over rajya sabha elections

''బేసిగ్గా దళితుల్ని గౌరవించని పార్టీ టీడీపీ. పేరుకు సామాజిక న్యాయం అంటారుగానీ చంద్రబాబు తన సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం చేసుకుంటారు. ఇప్పటికైనా ఆ పార్టీలోని దళిత నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. బాబు చేతిలో బలికాకుండా ఎదురుతిరగాలి. టీడీపీలో ఉండి ఆత్మాభిమానాన్ని చంపుకోలేకే డొక్కా మాణిక్య వరప్రసాద్‌ లాంటి నేతలు వైసీపీ బాటపట్టారు''అని ఎంపీ నందిగం అన్నారు.

ఏపీలో ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు ఈనెల 26న ఎన్నికలు జరగనున్నాయి. ఒక సీటు గెలవాలంటే కనీసం 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అసెంబ్లీలో టీడీపీకి కేవలం 23 స్థానాలే ఉన్నప్పటికీ వర్ల రామయ్యను అభ్యర్థిగా బరిలోకి దింపింది. నాలుగు సీట్లలో రెండు మాత్రమే బీసీలకు ఇచ్చి, మిగతా రెండు టికెట్లను వైసీపీ అంబానీకి, అయోధ్యరామిరెడ్డికి అమ్ముకుందని, తద్వారా దళితులకు అన్యాయం చేసిందని, దాన్ని ఎత్తి చూపడానికే అభ్యర్థిని నిలబెట్టామని టీడీపీ వాదిస్తోంది.

English summary
bapatla ysrcp mp nandigam suresh slams chandrababu over rajya sabha elections. he says, tdp chief is using dalits as tools for self interest
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X