వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో విగ్గు ఊడుతోంది.. పదవీ కూడా.. రఘురామపై నందిగం సురేశ్ నిప్పులు

|
Google Oneindia TeluguNews

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. రఘురామ చేసే కామెంట్లను ప్రజలు, ముఖ్యంగా నరసాపురం నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. తన సెక్యూరిటీతో కలిసి తోలు వలిపిస్తానని కామెంట్ చేయడం సరికాదన్నారు. ఈ అంశంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని వివరించారు. ఆయనకు భద్రత తొలగించాలని కోరతామని చెప్పారు.

అహంకారపూరిత వ్యాఖ్యలు..

అహంకారపూరిత వ్యాఖ్యలు..

రఘురామ అహంకారపూరితంగా మాట్లాడటం సరికాదని సురేశ్ హితవు పలికారు. దిష్టిబొమ్మలు దగ్దం చేయడంతో సెక్యూరిటీ తెచ్చుకొని.. హద్దు మీరి మాట్లాడటం ఏంటీ అని ప్రశ్నించారు. సెక్యూరిటీ అంటే రక్షణ కోసమే తప్ప.. ఎదుటివారిని చంపాడానికి కాదన్నారు. ఈ విషయం రఘురామకు తెలియదా అని సెటైర్లు వేశారు. కానీ ఎదుటివారి చర్మం వలిస్తామని, దళితులను చిన్నచూపుతో మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. ఈ అంశాన్ని ఇదివరకే ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన గుర్తుచేశారు. డీజీపీ నోటీసులు పంపించి.. చర్యలు తీసుకుంటామని కమిషన్ తెలిపిందని చెప్పారు.

భద్రత తొలగించేవరకు పోరాటం..

భద్రత తొలగించేవరకు పోరాటం..

రఘురామకు భద్రత తొలగించాలని స్పీకర్‌ను కోరతామని సురేశ్ తెలిపారు. ఆయనకు భద్రత సిబ్బంది ఉంటే చెప్పినట్టు చేసే ప్రమాదం ఉందన్నారు. దళితులను అవమానించేలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు పార్లమెంట్‌లో అడుగుపెట్టొద్దు అని పేర్కొన్నారు. రఘురామకు భద్రత తొలగించే వరకు తాము పోరాటం చేస్తామని సురేశ్ స్పష్టంచేశారు.

ఢిల్లీలో దాక్కొని..

ఢిల్లీలో దాక్కొని..

పులివెందులలో 10 వేల మందితో మీటింగ్ పెడతానని కామెంట్ చేయడం ఏంటీ అని సురేశ్ ప్రశ్నించారు. ఏం చేయాలనుకంటున్నావో.. నీకు అదే జరుగుతుంది అని హెచ్చరించారు. ఒకప్పుడు సీఎంను పొగిడి.. ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. నియోజకవర్గంలో ఉండకుండా.. ఢిల్లీలో దాక్కొన్ని కామెంట్ చేయడంతో ఎవరి విశ్వసనీయత ఏంటో తెలుస్తోందని చెప్పారు.

Recommended Video

YSRCP MP Raghurama Krishnam Raju met JP Nadda రఘురామరాజు ను లోక్ సభలో వెనక సీటుకు పంపేసిన YCP
ఒరిజనల్ స్థితికి తీసుకొస్తాం..

ఒరిజనల్ స్థితికి తీసుకొస్తాం..

రఘురామపై సురేశ్ వ్యక్తిగతంగా కూడా కామెంట్లు చేశారు. మళ్లీ ఒరిజనల్ స్థితికి వస్తారని హెచ్చరించారు. పదవీ నుంచి సాధారణ స్థితికి వస్తారని జోస్యం చెప్పారు. అలాగే విగ్గు విషయంలో కూడా రహస్యం బయటపడుతోందని చెప్పారు. మిమ్మల్నీ పూర్వస్థితికి తీసుకొచ్చేవరకు తాము పోరాటం చేస్తామని సురేశ్ పేర్కొన్నారు. ఆస్తులు ఎలా వచ్చాయో.. బ్యాంకులకు ఎలా ఎగనామం పెట్టావో తెలుసని చెప్పారు. చేసిన మోసాలు.. వాటి నుంచి కాపాడుకునే ప్రయత్నాలను ప్రజల ముందు ఉంచేందుకు పోరాటం చేస్తామని తెలిపారు.

English summary
ysrcp mp nandigam suresh slams raghurama: ysrcp mp nandigam suresh slams rebel mp raghurama krishna raju on various issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X