• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాయిరెడ్డికి రఘురామ షాక్: స్పీకర్‌ను బెదిరించారంటూ రెబల్ ఫిర్యాదు -గతంలో వెంకయ్యను కూడా

|

దేశ ద్రోహం కేసులో అరెస్టయి, సుప్రీంకోర్టు బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన తీరును మార్చుకోలేదు. వైసీపీ సర్కారు తీరును ఎండగడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రోజుకు రెండు మూడు లేఖలు రాస్తోన్న ఆయన.. తాజాగా వైసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని చిక్కుల్లోకి నెట్టేసే ప్రయత్నం చేశారు. అనర్హత వేటు వ్యవహారాన్ని మలుపుతిప్పేలా కీలక చర్యకు ఉపక్రమించారు. వివరాలివి..

రోజూ రాత్రి జగన్-కేసీఆర్ అదే పని -షర్మిల కూడా చెప్పింది -హైదరాబాద్ రెవెన్యూ వదిలేశాం: ఏపీ బీజేపీరోజూ రాత్రి జగన్-కేసీఆర్ అదే పని -షర్మిల కూడా చెప్పింది -హైదరాబాద్ రెవెన్యూ వదిలేశాం: ఏపీ బీజేపీ

  YS Sharmila Party Name : సర్వే రిపోర్ట్.. ఎన్ని సీట్లు ? పార్టీ పేరు మారిందా..? || Oneindia Telugu
  సాయిరెడ్డి దూకుడు వ్యాఖ్యలు

  సాయిరెడ్డి దూకుడు వ్యాఖ్యలు

  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామపై అనర్హత వేటుకు సంబంధించి వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించకపోవడంపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈనెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నందున కనీసం ఇప్పుడైనా రఘురామ వ్యవహారాన్ని తేల్చేయాలంటూ సాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ బృందం ఇటీవల స్పీకర్ ఓం బిర్లాను కలిసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సాయిరెడ్డి దూకుడు వ్యాఖ్యలు చేశారు. రఘురామపై అనర్హత పిటిషన్‌ వేసి ఏడాది దాటిందని, ఈ విషయంలో స్పీకర్ పక్షపాత ధోరణిని కనబరుస్తున్నారని, స్పీకర్‌ గనుక రఘురామపై చర్యలు తీసుకోకుంటే పార్లమెంట్‌లో ఆందోళన చేపడతామని, అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని సాయిరెడ్డి అన్నారు. దీనిపై..

  హక్కుల కమిటీకి రఘురామ లేఖ

  హక్కుల కమిటీకి రఘురామ లేఖ

  అనర్హత వేటు విషయంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఉద్దేశించి ఎంపీ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను గర్హిస్తూ రెబల్ రఘురామ అనూహ్య చర్యకు పూనుకున్నారు. స్పీకర్ ఓంబిర్లా, పార్లమెంట్ సభా హక్కుల కమిటీ చైర్మన్‌కు రఘురామ శుక్రవారం లేఖ రాశారు. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విజయసాయి అనడం అనైతికమని, సభా కార్యక్రమాలను అడ్డుకుంటామనడం ముమ్మాటికీ బెదిరింపుల కిందికే వస్తుందని అన్నారు. అంతేకాదు,

  గతంలో వెంకయ్యపైనా విమర్శలు

  గతంలో వెంకయ్యపైనా విమర్శలు

  లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెదిరించే ప్రయత్నం చేశారని ఆరోపించిన రఘురామ.. సభా హక్కుల కమిటీ చైర్మన్ కు రాసిన లేఖలో రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరును కూడా ప్రస్తావించారు. సాయిరెడ్డి గతంలో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యపైనా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలే చేశారని, ఇప్పుడు కూడా లోక్ సభ స్పీకర్‌పై బెదిరింపు ధోరణిలో మాట్లాడారని, విజయసాయిరెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు లేఖలో కోరారు. ఈ వ్యవహారంపై సభా హక్కుల చైర్మన్, స్పీకర్ కార్యాలయం, సాయిరెడ్డి స్పందించాల్సిఉంది.

  ముండే సిస్టర్స్‌పై మోదీ పాచిక: పంకజ, ప్రీతమ్‌ల కెరీర్ ఖతం -కేంద్ర కేబినెట్ కూర్పుపై శివసేన ఫైర్ముండే సిస్టర్స్‌పై మోదీ పాచిక: పంకజ, ప్రీతమ్‌ల కెరీర్ ఖతం -కేంద్ర కేబినెట్ కూర్పుపై శివసేన ఫైర్

  English summary
  narsapuram ysrcp rebel mp Raghurama Krishnam Raju wrote a letter to chairman of parliamentary rights committee on friday seeking action on rajya sabha ysrcp mp vijayasai reddy. raghu rama alleges that vijaya sai is threatening lok sabha speaker om birla regarding disqualification issue. raghurama seeks action on vijayasai reddy.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X