వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొచ్చులో నాయకత్వం! ఎవడికి కావాలి?: సొంత పార్టీ కార్యకర్తలపై వైసీపీ ఎంపీ రఘురామ సంచలనం(వీడియో)

|
Google Oneindia TeluguNews

పశ్చిమగోదావరి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన వ్యవహారశైలితో మరోసారి వార్తల్లో నిలిచారు. సొంత పార్టీ కార్యకర్తలపైనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు.

కార్యకర్తలతో ఎంపీ రఘురామ కృష్ణంరాజు

కార్యకర్తలతో ఎంపీ రఘురామ కృష్ణంరాజు

పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించిన ఓ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఎన్నిక విషయంలోస్థానికంగా చిన్న వివాదం చోటు చేసుకోవడంతో.. ఎంపీ రఘు రామకృష్ణంరాజు జోక్యం చేసుకుని సయోధ్య కుదిర్చారు. ఈ విషయాన్ని ఆయన వైఎస్సార్సీపీ కార్యకర్తలకు చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్, సీఎం నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

బొచ్చులో నాయకత్వం.. ఎవడికి కావాలంటూ..

బొచ్చులో నాయకత్వం.. ఎవడికి కావాలంటూ..

మరికొందరు రఘురామకృష్ణంరాజు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఇంకొంత మంది కార్యకర్తలు మంత్రి చెరుకువాడ రంగనాథరాజు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బొచ్చులో నాయకత్వం ఎవడి కావాలి మీ నాయకత్వం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

YSRCP MP Raghu Rama Krishnam Irritated By Jagan Fans | నోరు జారిన రఘు రామ కృష్ణం రాజు | Watch Video

నోరుమూసుకుని కూర్చోండి.. అంతా సైలెంట్..

అంతేగాక, నోరు మూసుకుని కూర్చోమంటూ మండిపడ్డారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు వెంట ఇలాంటి మాటలు రావడంతో కార్యకర్తలతోపాటు అక్కడున్నవారంతా షాకయ్యారు. ఒక్కసారిగా కార్యకర్తలు కూడా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్య్యాయి. రఘురామకృష్ణంరాజు గతంలో ప్రోటోకాల్ వివాదం, ప్రధాని మోడీని కలవడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అంతేగాక, రఘురామకృష్ణంరాజు బీజేపీకి దగ్గరగా ఉంటున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

English summary
YSRCP MP raghu rama krishna raju fires at own party workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X