• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సీబీఐతో జగన్ రహస్య కాన్ఫరెన్స్ -రియాక్షన్ తప్పదు -వైసీపీ ఎంపీ రఘురామ సంచలనం -బీజేపీకి సవాల్

|

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన ఆరోపణలు చేశారు. ఆర్థిక నేరాలకు సంబంధించి 11 చార్జిషీట్లలో నిందితుడిగా ఉన్న జగన్.. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో రహస్యంగా కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారని, ఇతర కేసులకు సంబంధించి డబ్బులు కూడా చేతులు మారుతున్నాయని, దీనికి సంబంధించి తన వద్ద పక్కా సమాచారం ఉందని, ఈ వ్యవహారాలపై తాను కూడా సీబీఐకి మరో ఫిర్యాదు చేశానని ఎంపీ తెలిపారు. 'రాజధాని రచ్చబండ' పేరుతో శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సీబీఐ, ఏపీ ప్రత్యేక హోదా, పరిషత్ ఎన్నికల బహిష్కరణ తదితర అంశాలపై రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాట్లోనే...

వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా -జగన్‌కు గట్టు శ్రీకాంత్ రెడ్డి లేఖ -వైఎస్ షర్మిలకు షాకిస్తూ, బీజేపీ వైపువైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా -జగన్‌కు గట్టు శ్రీకాంత్ రెడ్డి లేఖ -వైఎస్ షర్మిలకు షాకిస్తూ, బీజేపీ వైపు

సీబీఐ వాళ్లతో జగన్ కాన్ఫరెన్స్

సీబీఐ వాళ్లతో జగన్ కాన్ఫరెన్స్

‘‘నేనేదో బ్యాంకులను మోసం చేసినట్లు తప్పుడు ఆరోపణలతో సీబీఐ వాళ్లు నాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కనీసం సంతకం కూడా లేకుండా నాపై దాఖలైన ఫిర్యాదు కాపీని ఇంటర్నెట్ లో కూడా చూడొచ్చు. దీని వెనుక ఏపీ సీఎం జగన్, వైసీపికి చెందిన ఇద్దరు ఎంపీల హస్తం ఉంది. ఎస్బీఐ ఎండీ శ్రీనివాసులు శెట్టి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ మల్లికార్జున రావులుతో వైసీపీ పెద్దలు మాట్టాడిన తర్వాతే ఫిర్యాదులు వెళ్లాయి. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు కూడా చేతులు మారినట్లు తెలుస్తోంది. దీనిపై నేను సీబీఐ వాళ్లకు మరో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో సీబీఐ వాళ్లతో జగన్ కాన్ఫరెన్సులు జరుపుతున్నట్లు నాకు ఢిల్లీ నుంచి సమాచారం అందింది..

ప్రసంగం మధ్యలోనే ఆపేసిన మోదీ -బీజేపీ కార్యకర్త కోసం పీఎంవో డాక్టర్ల పరుగులు -అస్సాంలో అనూహ్యం: videoప్రసంగం మధ్యలోనే ఆపేసిన మోదీ -బీజేపీ కార్యకర్త కోసం పీఎంవో డాక్టర్ల పరుగులు -అస్సాంలో అనూహ్యం: video

నిరూపించడానికి నేను రెడీ..

నిరూపించడానికి నేను రెడీ..

నాపై సీబీఐ కేసు వెనుక జగన్, ఇతర వైసీపీ నేతల హస్తం ఉందని నిరూపించడానికిగానీ, అక్రమాస్తుల కేసుల్లో 11 చార్జిషీట్లలో నిందితుడిగా ఉన్న జగన్.. సీబీఐ వాళ్లతో, బ్యాంకర్లతో నేరుగా చర్చలు జరుపుతున్నారని నిరూపించడానికి నేను రెడీగా ఉన్నాను. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు నాపై కక్ష పెంచుకుని ఈ రకంగా చేయడం సరైంది కాదు. ఏ చర్యకైనా ప్రతిచర్య తప్పక ఉంటుందన్న న్యూటన్ మూడో సూత్రం అందరికీ వర్తిస్తుంది. వైసీపీ వాళ్లు నాతో ఇలాగే వ్యవహరిస్తే, నా రియాక్షన్ కూడా చూపిస్తా. ఈ హెచ్చరిక మా వైసీపీ అధ్యక్షుడికి కాకుండా, ముఖ్యమంత్రి జగన్ కు చేస్తున్నా. సీబీఐ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయనను..

జగన్‌ను జైలుకు పంపే దమ్ముందా?

జగన్‌ను జైలుకు పంపే దమ్ముందా?

సీఎం జగన్ బెయిలు ఏ క్షణమైనా రద్దువుతుందని, అతి త్వరలోనే ఆయన జైలుకు వెళ్లడం తథ్యమంటూ తిరుపతి ఎన్నికల ప్రచారం ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్ అన్నారు. వ్యక్తిగతంగా దేవధర్ నాకు మిత్రుడు కూడా. అయితే, జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలను మాత్రం నేను ఖండిస్తున్నాను. కేవలం ప్రాస బాగుందనో, రాజకీయ విమర్శల కోసమో జైలు-బెయిలు అని డైలాగులు కొట్టడం కాదు. బీజేపీకి నిజంగా దమ్ముంటే జగన్ పై సీబీఐ కేసులను తొందరగా తేల్చేయండి, లేదా విచారణకు ఎందుకు రావట్లేదని నిలదీయండి, అంతేగానీ, సీఎంను దోషి అని పదే పదే లూజ్ టాక్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒకవేళ నిజంగా బీజేపీ సాహసం చేసి జగన్ ను జైలుకు పంపితే మళ్లీ కడిగిన ముత్యంలా బయటికొచ్చే అవకాశాలు లేకపోలేవు. బీజేపీ నేతలు ఇలా బెదిరిస్తుంటే, వైసీపీ వాళ్లు మాత్రం ఎన్డీఏ తరఫున ఏకంగా ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నారు..

ఏన్డీఏతో వైసీపీ దోస్తీ.. ఏపీకి హోదా

ఏన్డీఏతో వైసీపీ దోస్తీ.. ఏపీకి హోదా

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని, 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో ఆ అంశం లేదని ఇన్నాళ్లూ చెబుతూ వంది. కానీ ఇవాళ పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి స్పెషల్ స్టేటస్ కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇదే పుదుచ్చేరిలో అంతర్భాగమైన యానాంలో ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి వైసీపీ కీలక నేతలు ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీఏకు తెలియకుండా ఏపీ సర్కారు ఏ పనీ చేయబోదని విజయసాయిరెడ్డి పలు మార్లు బాహాటంగా చెప్పారు. మరి ఇప్పటికైనా పుదుచ్చేరికి హోదా హామీ ఇచ్చిన నిర్మలా సీతారమన్ ను వైసీపీ నేతలు కలిసి ఏపీ హోదాపై మాట్లాడాలి. జగన్ నేరుగా కలుగజేసుకుని ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలి. ఇక..

పరిషత్ ఎన్నికల బహిష్కరణ సరైందే

పరిషత్ ఎన్నికల బహిష్కరణ సరైందే

ఏపీ రాజకీయాల దగ్గరికొస్తే, ప్రస్తుతం జరుగుతోన్న పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ కొన్ని పార్టీలు తీసుకున్న నిర్ణయం సరైందే. ఎందుకంటే, అధికార పార్టీ చేతిలో నానా రకాలుగా హింసకు గురవుతోన్న కార్యకర్తల్ని కాపాడుకోవడానికి ఆయ పార్టీలకు వేరే దారిలేదు. ఎన్నికల బహిష్కరణ వంద శాతం నిరసన రూపమే తప్ప పలాయనవాదం కానేకాదు. నిజం చెప్పాలంటే చట్టానికి కళ్లు లేవు, సాక్ష్యం మాత్రమే కావాలి. కానీ ఆ సాక్ష్యం చెప్పడానికి అందరూ భయపడిపోయే పరిస్థితి ఏపీలో ఉంది. ఇప్పటికే 25 శాతంగా ఉన్న ఏకగ్రీవాలను వంద శాతానికి పెంచేసుకుంటేగానీ వైసీపీ ఎంత గొప్పదో ప్రజలకు తెలిసిరాదు. ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే తగుదునమ్మా అంటూ నీలం సాహ్ని హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చేశారు. నోటిఫికేషన్ కు ఎన్నికలకు మధ్య కనీసం నాలుగు వారాల గ్యాప్ ఉండాలన్న సుప్రీం, హైకోర్టుల గత తీర్పులకు ఏపీ ఎస్ఈసీ తీరు పూర్తిగా విరుద్ధం'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

English summary
narsapuram ysrcp mp raghurama krishnam raju made sensational remarks on ap cm ys jagan over cbi cases. the rebel mp alleges that ap cm is in touch with cbi officials. raghurama also slams bjp leaders for criticizing ap cm jagan over cbi cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X