వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జస్టిస్ రమణేనా? రెడ్డి జడ్జిలపై రాయరా? - జగన్ నోట తప్పులు -2వ తేదీలోగా ఈపని: ఎంపీ రఘురామ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు హైకోర్టులోని కొందరు జడ్జిలు, సుప్రీంకోర్టుకు చెందిన జస్టిస్ ఎన్వీ రమణ ప్రయత్నిస్తున్నారంటూ సీఎం జగన్ తీవ్ర ఆరోపణలతో కూడిన లేఖను సీజేఐ బోబ్డేకు పంపి రెండు వారాలు పూర్తయినా అటు నుంచి స్పందన రాలేదు. అయితే వైసీపీ మాత్రం అదే పనిగా ఈ అంశాన్ని పెద్దది చేస్తూ, జగన్ పత్రిక సాక్షిలో నిత్యం కథనాలు రాస్తున్నారని నర్సాపురం వైసీపీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

జగన్‌పై మోదీకి ఫిర్యాదు - 18 నెలల కుదుపు - 2021లెక్కలే కీలకం - బీమా మెలిక చూశారా?: ఎంపీ రఘురామజగన్‌పై మోదీకి ఫిర్యాదు - 18 నెలల కుదుపు - 2021లెక్కలే కీలకం - బీమా మెలిక చూశారా?: ఎంపీ రఘురామ

 జస్టిస్ స్వామి ఇంకా రాశారు..

జస్టిస్ స్వామి ఇంకా రాశారు..

‘‘ఏపీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ బీఎస్ఏ స్వామి.. హైకోర్టులో కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ 2005లో ‘ఎ క్యాస్ట్ క్యాప్చర్ ఏపీ జ్యూడీషియరీ' అనే పుస్తకాన్ని రాయడం తెలిసిందే. ప్రస్తుత సందర్భంలో తమకు అనుకూలంగా జగన్ మీడియా ఆ పుస్తకంలోని జస్టిస్ ఎన్వీ రమణ చాప్టర్ ను మాత్రమే సాక్షిలో ప్రచురించారు. నిజానికి జస్టిస్ స్వామి ప్రధాన పోరాటం రెడ్డి జడ్జిలకు వ్యతిరేకంగా సాగింది. ఆయన పుస్తకంలో 150 మందికిపైగా రెడ్డి జడ్జిల గురించి రాశారు. నిజంగా న్యాయవ్యవస్థ బాగుపడాలన్నదే జగన్ ఉద్దేశమైతే, జస్టిస్ స్వామి పుస్తకంలో రెడ్డి జడ్జిలపై వెలిబుచ్చిన అభిప్రాయాలను కూడా సాక్షిలో ఎందుకు రాయడంలేదు?

ఇంటర్నెట్ లో ఆ పుస్తకం..

ఇంటర్నెట్ లో ఆ పుస్తకం..

న్యాయవ్యవస్థలో కులతత్వాన్ని ప్రశ్నిస్తూ జస్టిస్ బీఎస్ఏ స్వామి రాసిన ‘ఎ క్యాస్ట్ క్యాప్చర్ ఏపీ జ్యూడీషియరీ' పుస్తకం ప్రస్తుతం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉ:ది. అయితే ఇతరుల అభిప్రాయం నుంచి తమకు అనుకూలమైన వాదన తీసుకుంటోన్న జగన్ మీడియా.. రెడ్డి జడ్జిలపై మాత్రం స్పందించకపోవడమే విచిత్రం. దీన్ని బట్టే మన ఉద్దేశమంటో తెలిసిపోతున్నది. జడ్జిల కులాల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఏపీలో ఇటీవల తలపెట్టిన 56 బీసీ కార్పొరేషన్ల వ్యవహారంపై విస్తృతంగా చర్చ జరగాలి. ఎందుకంటే..

కులం కచ్చితంగా అవసరమే

కులం కచ్చితంగా అవసరమే

కులం కచ్చితంగా అవసరమే. పూర్వం రోజుల్లో అవసరాల కోసమే కులాలు ఏర్పడ్డాయి. ఎవరూ ఎక్కువ తక్కవ కాదు, సామాజిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అంబేద్కర్ రిజర్వేషన్ సిస్టమ్ తో అందరం ఒకటయ్యాం. ఉత్తరాదిలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ దాదాపు అందరం ఒకటైపోయాం. అలాంటి సమయంలో మర్చిపోయిన కులాలను గుర్తుచేస్తూ, బీసీల్లో 56 కులాలు ఉన్నారని విభజించడం కరెక్టు కాదు. బీసీ కార్పొరేషన్లకు నియామకాల నేపథ్యంలో సీఎం ఫొటోలకు పాలు పోయాల్సిందిగా పార్టీ ఆదేశాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. బీసీలు ఒక్కటిగా ఉంటేనే మనుగడ. విడివిడిగా కార్పొరేషన్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల వల్ల ఎవరికీ మేలు జరగలేదు. విదేశాలకు వెళ్లిన విద్యార్థుల్ని పట్టించుకోవట్లేదు. బీసీలను విభజించాలనే ఉద్దేశంతో కార్పొరేషన్లు పెట్టారు. దీనిపై ప్రజలు సీరియస్ గా ఆలోచించాలి.

జగన్ నోటి వెంట తప్పులు

జగన్ నోటి వెంట తప్పులు

చరిత్రలో తొలిసారి అమెరికా ఎన్నికల బ్యాలెట్ పేపర్ లో తెలుగు భాషకు కూడా స్థానం కల్పించారు. జర్మనీలో 14 యూనివర్సిటీల్లో సంస్కృత బోధన జరుగుతోంది. కానీ ఏపీలో మాత్రం బాధాకరమైన రీతిలో తెలుగును నిర్మూలించే ప్రయత్నం జరుగుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి కోర్టులు అడ్డుచెప్పాయి. ఈలోపే ప్రభుత్వం నవంబర్ 2 నుంచి పాఠశాలలు పున:ప్రారంభిస్తున్నట్లు చెప్పింది.. మరిప్పుడు ఏ మీడియంలో బోధన చేయబోతున్నారు? దీనిపై ప్రభుత్వం కొత్త సర్క్యులర్ జారీ చేయాలి. తెలుగు చదవకపోతే ఏమవుతుందో ఇవాళ(బుధవారం) పోలీస్ అమరవీరుల దినోత్సవంలో సీఎం స్పీచ్ చూస్తే తెలుస్తుంది. జగన్ నోటి వెంట తెలుగులో మాట్లాడలేక తప్పులు దొర్లాయి. బలవంతపు ఇంగ్లీష్ మీడియం కూడా క్రైస్తవ మతవ్యాప్తికే అని నా అభిప్రాయం'' అని ఎంపీ రఘురామ అన్నారు.

Recommended Video

Raghurama Krishnam Raju ఎపిసోడ్ తో BJP లో చీలికలు!! || Oneindia Telugu

జగన్ దెబ్బ.. రఘురామరాజు అబ్బా - జస్టిస్ రమణపై ఇవి చూశారా? 777 రెడ్లకు పదవులు: వైసీపీ ఎంపీజగన్ దెబ్బ.. రఘురామరాజు అబ్బా - జస్టిస్ రమణపై ఇవి చూశారా? 777 రెడ్లకు పదవులు: వైసీపీ ఎంపీ

English summary
narsapuram ysrcp MP Raghu Rama Krishnam raju slams his own paty chief, ap cm ys jagan regarding complaints on high court and supreme court judge justice nv ramana. the rebel mp challenges sakhi media to publish justice bsa swamy full book, which contains other judges names too.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X