• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

క్రిస్మస్‌ నాటికి చెదపురుగులు నాశనం-జగన్‌కు మోదీ మద్దతు వట్టి సొల్లు - ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్

|

న్యాయ వ్యవస్థకు సంకెళ్లు వేయాలనుకునే ప్రయత్నాలకు వ్యతిరేకంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిత్యం గళం వినిపిస్తున్నందుకే సొంత పార్టీ వైసీపీ తనపై పగపట్టిందని, అందులో భాగంగానే సోషల్ మీడియాతో తనపై వ్యతిరేక పోస్టులను సర్క్యులేట్ చేస్తున్నారని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. సోమవారం ఆన్ లైన్ లో కీలక సందేశం విడుదల చేసిన ఆయన.. తనను అరెస్టు చేసేందుకు వైసీపీ సర్కారు స్కెచ్ వేసిందని, జడ్జిలపై ఏపీ సీఎం జగన్ ఫిర్యాదుకు కేంద్రం మద్దతు లేదంటూ సంచలన కామెంట్లు చేశారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

4వ శక్తిమంతమైన దేశంగా భారత్ - 'ఆసియా-పసిఫిక్'లో అమెరికా-చైనా పోటాపోటీ - గేమ్ ఛేంజర్ కరోనా

నర్సాపురం ఎంపీ మిస్సింగ్

నర్సాపురం ఎంపీ మిస్సింగ్

‘‘మా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం నాపై కొన్ని పోస్టులు రూపొందించింది. ‘నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు గతేడాది కోడిపందేల తర్వాత కనిపించకుండా పోయారు, తెలిసినవాళ్లు ఆచూకీ చెప్పగలరు' అని ప్రకటన రూపంలో పోస్టులు సిద్ధం చేశారు. ఇదంతా పార్టీలో అత్యున్నత స్థాయిలోని ముఖ్యవ్యక్తుల ఆదేశం మేరకే జరుగుతున్నదని, ‘ఎంపీ మిస్సింగ్' పోస్టులు వైరల్ అయ్యేలా అందరూ ఒకేసారి సర్క్యులేట్ చేయాల్సిందిగా ‘ముఖ్య'నేతల నుంచి ఆదేశాలు వచ్చినట్లు పార్టీలోని నా పరిచయస్తులు తెలిపారు. దీని వెనుక చాలా పెద్ద బ్యాగ్రౌండ్ ఉంది...

నా అరెస్టుకు స్కెచ్ వేశారు..

నా అరెస్టుకు స్కెచ్ వేశారు..

వైసీపీ ప్రభుత్వం వల్ల నాకు ప్రాణహాని ఉందని నిర్ధారణ కావడం వల్లే కేంద్రం వై-కేటగిరీ భద్రత కల్పించింది. అయితే ఎలాగోలా నన్ను నియోజకవర్గానికి(నర్సాపురానికి) రప్పించి, అరెస్టు చేయాలన్నది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. అక్కడ అడుగు పెట్టిన మరుక్షణమే ఏదో ఒక సాకుతో నన్ను అరెస్టు చేసి, ఆ తర్వాత ఆరోపణలతో కేసు ఫైల్ చేయబోతున్నారు. జిల్లాలోని ఓ ఎస్టీ అధికారిణిని నేను దూషించినట్లుగా ముందుగానే స్క్రిప్టు సిద్ధం చేసి ఉంచారు. పైస్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ స్కెచ్ సిద్ధమైనట్లు ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. సరే, అరెస్టు నుంచి ఎలాగోలా బయటపడతాం కానీ, కరోనా వైరస్ అంటించాలని కూడా కుట్రపన్నారు. కరోనా నుంచి బయటపడాలంటే నెల రోజులైనా పడుతుంది. కనీసం 30 రోజులైనా నా గొంతు నొక్కడానికే, నన్ను రెచ్చగొట్టేలా ‘ఎంపీ కనబడటం లేదు' లాంటి ప్రకటనలు చేస్తున్నారు. వాళ్లకు నేను ఒకటే చెప్పదల్చుకున్నాను..

 రచ్చబడ్డలో ఉతికి ఆరేస్తున్నందుకే..

రచ్చబడ్డలో ఉతికి ఆరేస్తున్నందుకే..

నన్ను ఇరుకున పెట్టేలా పోస్టులు పెట్టండంటూ ఎవరైతే ఆదేశాలిచ్చారో... ఆ ముఖ్యమంత్రిగారు గత ఆరు నెలలుగా తాడేపల్లిలోని అంత:పురంలోనే ఉంటూ, అక్కడక్కడే తిరుగుతూ, రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెడుతూ.. వ్యక్తిగత అవసరాల కోసం ఢిల్లీకి వెళ్లొస్తున్నారు. నేను కనిపించడం లేదని పోస్టులు పెడుతున్నవాళ్లకు.. ఈ ముఖ్యనేత కూడా బయటరికి రాకుండా ఉంటోన్న విషయం పట్టకపోవడం గమనార్హం. నేను ఢిల్లీలో ఉన్నా, మరెక్కడ ఉన్నా.. ఏపీ ప్రజల సమస్యలపై, ఏపీలో దేవుళ్లకు జరుగుతోన్న అన్యాయాలపై, న్యాయవ్యవస్థపై జగన్ సాగిస్తోన్న దాడిపై ‘రచ్చబండ'లో ఉతికి ఆరేస్తున్నాను. అందుకే నన్ను ఆపాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఎంత రెచ్చగొట్టినా.. నేను వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తాను.

 క్రిస్మస్ నాటికి ఏపీ చెదలు నాశనం

క్రిస్మస్ నాటికి ఏపీ చెదలు నాశనం

న్యాయవ్యవస్థకు సంకెళ్లు వేసేందుకు మా ముఖ్యమంత్రి జగన్ చేస్తోన్న ప్రయత్నాలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుమతి ఉందంటూ వైసీపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. అది వట్టి సల్లు ప్రచారం. న్యాయవ్యవస్థపై దాడి చేస్తోన్న చెదపరుగుల్ని సమూలంగా నాశనం చేసే శక్తి కోర్టులకు ఉంది. ఏపీకి పట్టిన ఆ చెద వదిలిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. నా అంచనా ప్రకారం క్రిస్మస్ పండుగ (డిసెంబర్ 25) లోపే ఏపీ చెదపురుగులు నాశనం అవుతాయి. ఆ తర్వాత వచ్చే సంక్రాంతి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకొంటారు. ఈ ప్రక్రియ ఎలా జరుగబోతున్నదో త్వరలో వివరిస్తాను'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

సీఎంగా వైఎస్ భారతి లేదా విజయమ్మ - సారీ చెప్పకుంటే జగన్ పదవి పోవడం ఖాయం: ఎంపీ రఘురామ

English summary
narsapuram ysrcp MP Raghu Rama Krishnam raju reacted sharply to the postings on social media by his own party, that he did not appear in ap since last sankranthi fest. speaking through online on monday, the rebel mp said that such comments are being made to tease him and arrest him if he comes to the constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X