• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రఘురామకు కేంద్రం పెద్దల టైమ్ -రాజ్‌నాథ్‌తో వైసీపీ రెబల్ భేటీ -ఏపీ సీఎం జగన్‌పై ఫిర్యాదు -మోదీ, షాలనూ..

|

వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను జైలుకు పంపేదాకా ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టబోనని శపథం చేసినప్పటికీ, దేశద్రోహం కేసులో అరెస్టయి అనివార్యంగానైనా ఏపీకి వచ్చి, సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది ప్రస్తుతం ఢిల్లీలో ఉంటోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇంకొద్ది గంటల్లో బెయిల్ రద్దుపై కోర్టు విచారణ చేపట్టనుండగా, ఏపీ సీఎంపై రఘురామ ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తున్నారు..

తమ్మీ అంటూ తడిబట్టతో గొంతు కోత -కేసీఆర్ ఆస్తుల గుట్టు -ముక్కు నేలకు -అంతా అమ్మేసి: ఈటల జమునతమ్మీ అంటూ తడిబట్టతో గొంతు కోత -కేసీఆర్ ఆస్తుల గుట్టు -ముక్కు నేలకు -అంతా అమ్మేసి: ఈటల జమున

రాజ్‌నాథ్‌తో ఇంటికి రఘురామ

రాజ్‌నాథ్‌తో ఇంటికి రఘురామ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణం చేసి ఆదివారం(మే 30)తో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అధికార పార్టీ పండుగను జరుపుకొంటుండగా, అదే పార్టీకి చెందిన రెబల్ ఎంపీగా ముద్రపడ్డ రఘురామకృష్ణంరాజు మాత్రం జగన్ పై అదే పనిగా ఫిర్యాదులు చేస్తున్నారు. వైసీపీ ఎంపీ రాజ్ నాథ్ ఆదివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. దాదాపు 10 నిమిషాలపాటు సాగిన సమావేశంలో రఘురామ కీలక విషయాలను చెప్పుకొచ్చారు..

 వీల్ చైర్లోనే ఎంపీ తిరుగుడు

వీల్ చైర్లోనే ఎంపీ తిరుగుడు

ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ సర్కారు తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోన్నారని రాజ్ నాథ్ కు రఘురామ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఏపీ పోలీస్ కస్టడీలో తనపై దాడి జరిగిందని ఆరోపిస్తోన్న రఘురామకు కాలికి తీవ్రమైన గాయాలుండటం, సుప్రీంకోర్టు బెయిల్ తర్వాత ఢిల్లీకి వెళ్లి ఎయిమ్స్ లో చికిత్స తీసుకోవడం తెలిసిందే. కాళ్లకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టు ఉన్నందున రాజ్‌నాథ్‌తో భేటీకి రఘురామ వీల్‌ చెయిర్‌లోనే వెళ్లారు. కాగా,

రఘురామ మరో సంచలనం -కేసీఆర్‌పై ప్రశ్నల తూటాలు -జగన్‌తో సమరమే -మోదీ, అమిత్ షాలకూ -సుప్రీంలో రేపేరఘురామ మరో సంచలనం -కేసీఆర్‌పై ప్రశ్నల తూటాలు -జగన్‌తో సమరమే -మోదీ, అమిత్ షాలకూ -సుప్రీంలో రేపే

  #TopNews : Chandrababu ప్లాన్ విఫలం | Pandem Kodi తరహా లో Rapo 19 || Oneindia Telugu
  మోదీ, షా రఘురామకు టైమిస్తారా

  మోదీ, షా రఘురామకు టైమిస్తారా

  అరెస్టు వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖరాసిన ఎంపీ రఘురామ.. అటు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు సైతం వేర్వేరుగా లేఖలు రాశారు. ఏపీ పరిణామాలు, తనపై దేశద్రోహం కేసు తదితర అంశాలను రఘురామ లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా కలుసుకుని జరిగిన వివరించేందుకు సమయం ఇవ్వాలని కూడా ఎంపీ కోరారు. నేటి రాజ్ నాథ్ భేటీ తర్వాత రాబోయే రోజుల్లో కేంద్రం పెద్దలు ఇంకొద్ది మందిని కలవాలని రఘురామ భావిస్తున్నారు.

  English summary
  Narsapuram YCP MP Raghu Rama Krishnam Raju met Defence Minister Rajnath Singh in Delhi on Sunday. Raghuram is reportedly complained to Rajnath that the AP government, cm ys jagan is harassing by filing illegal cases against him. raghurama also seeks pm modi, HM amit shah time.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X