• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ ఆదేశం, మోదీ శాసనం -బెయిల్ రద్దు తథ్యం -లక్ష్మీపార్వతి జూదం -కేసీఆర్‌ జగడం: రఘురామ సంచలనం

|

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం మేరకు అనర్హత వేటు ఫిర్యాదుపై లోక్ సభ సచివాలయం షోకాజ్ నోటీసులు పంపిన తర్వాత కూడా సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్‌పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శల పర్వం కొనసాగుతూనే ఉన్నది. దేశద్రోహం కేసులో అరెస్టయి, ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఎంపీ రఘురామ మళ్లీ వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఢిల్లీలోని తన నివాసంలో శనివారం శనివారం మరోసారి మీడియాతో మాట్లాడిన ఆయన, ఏపీ, కేంద్రం, తెలంగాణకు సంబంధించి పలు అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు.

షాకింగ్: స్మశానాన్ని అమ్మేసిన కేసీఆర్ సర్కార్ -వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశం -ఖానామెట్ భూమిలో కిరికిరిషాకింగ్: స్మశానాన్ని అమ్మేసిన కేసీఆర్ సర్కార్ -వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశం -ఖానామెట్ భూమిలో కిరికిరి

ఏపీ వాదనకే కేంద్రం మొగ్గు

ఏపీ వాదనకే కేంద్రం మొగ్గు


తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా, గోదావరి జలాల వివాదాలకు శాశ్వత పరిష్కారంగా కేంద్రం అనుసరిస్తోన్న ఫార్ములా ఏపీకి ఎక్కువ ప్రయోజనకరంగా ఉండటం ఇప్పుడు చర్చనీయాంవమైంది. రివర్ బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన గెజిట్ ప్రకారం తెలంగాణకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. నీటి వృథా, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్ని కేంద్రం పరిధిలోకి తేవడం, బోర్డులపైనా కేంద్రం పెత్తనమే ఉండాలంటూ జగన్ చేసిన సూచనలనే దాదాపుగా కేంద్రం గెజిట్ రూపంలో ఇచ్చింది. ఈ చర్యను వైసీపీ ఎంపీ రఘురామ స్వాగతించారు. అంతేకాదు,

germany floods: నిద్రలోనే జలసమాధి -యూరప్‌ జలవిలయంలో150 మంది మృతి, 1500 మంది గల్లంతుgermany floods: నిద్రలోనే జలసమాధి -యూరప్‌ జలవిలయంలో150 మంది మృతి, 1500 మంది గల్లంతు

జగన్ ఆదేశం-మోదీ శాసనం

జగన్ ఆదేశం-మోదీ శాసనం


కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులపై గెజిట్ విడుదల చేయడాన్ని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు స్వాగతించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాసిన ఆయన, శనివారం నాటి ప్రెస్ మీట్ లో ఆ విషయాన్ని వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య, నేతలు, ప్రజల మధ్య కూడా పొరపొచ్చలు తలెత్తేలా జల వివాదాలు తారస్థాయికి చేరిన వేళ, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని గెజిట్ ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ధన్యవాదాలు తెలిపానని రఘురామ చెప్పారు. జల వివాదంపై జగన్ తనదైన శైలిలో చేసిన పోరాటం ఫలించిందని, కేంద్రం ఇచ్చిన గెజిట్ ను రాజకీయ పరిభాషలో ‘‘ఏపీ సీఎం జగన్ ఆదేశించారు.. కేంద్రంలోని మోదీ సర్కార్ పాటించింది''అని అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదని ఎంపీ సెటైర్ వేశారు.

కేసీఆర్‌తో ఇంకా జగడం..

కేసీఆర్‌తో ఇంకా జగడం..

జల వివాదాలకు పరిష్కారంగా రెండు నదుల బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ ఇచ్చినతర్వాత కూడా కేసీఆర్ తో జగడం ముగిసిపోయినట్లు కాదని, విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో 107 సంస్థలు, షెడ్యూల్ 10లో 88 కార్పొరేషన్ల విభజన ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని రఘురామ పేర్కొన్నారు. రాష్ట్రాలు విడిపోయిన ఏడేళ్లు పూర్తయినా, ఆయా సంస్థలు, కార్పొరేషన్ల విభజన ఇంకా జరగలేదని, వాటిపై ఉన్నత స్థాయి కమిటి ఏర్పాటు చేయాలని ప్రధానికి రాసిన లేఖలో కోరానని రఘురామ తెలిపారు.

లక్ష్మీపార్వతి మాటలు జూదరులకే..

లక్ష్మీపార్వతి మాటలు జూదరులకే..


ఏపీలో తెగులు అకాడమీలో ఉర్దూ అకాడమీని విలీనం చేయడంపై వివాదం నెలకొన్న వేళ, వైసీపీ సీనియర్ నాయకురాలు లక్ష్మీపార్వతి తెలుగు భాషపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఎంపీ రఘురామ అన్నారు. ఎంతోప్రాచుర్యం కలిగిన తెలుగు అకాడమీపై జగన్ ఫోకస్ చేయడం లేదని, తెలుగు అకాడమీలో దాదాపు రూ.200 కోట్లున్నాయని, ముందు వాటిని సెటిల్ చేయాలని సూచించారు. లక్ష్మీపార్వతి పేక ముక్కలతో తెలుగు భాషను పోల్చడం సరికాదని, ఆమె మాటలు జూదరులకు తప్ప ఇంకా ఎవరికి నచ్చదని, స్థాయి తగ్గించే మాటలను ఆమె వెనక్కి తీసుకోవాలని ఎంపీ కోరారు. ఇక,

జగన్ బెయిల్ రద్దు తథ్యం

జగన్ బెయిల్ రద్దు తథ్యం


సీబీఐ దర్యాప్తు చేసిన క్విడ్ ప్రోకో కేసుల్లో నిందితుడైన ఏపీ సీఎం జగన్ కు బెయిల్ రద్దు, వైసీపీ ఫిర్యాదు మేరకు తనపై అనర్హత వేటు అంశాలపైనా ఎంపీ రఘురామ మాట్లాడారు. జగన్ బెయిల్ రద్దు కాదని, రఘురామపై అనర్హత వేటు తప్పదంటూ సీపీఐ నారాయణ చేసిన కామెంట్లను ఎంపీ తప్పుపట్టారు. ‘‘సీపీఐ నారాయణను నేను చాలా గౌరవిస్తాను. నన్ను ఆయన పరామర్శించారు. అయితే సీఎం జగన్ బెయిల్ రద్దు కాబోదని ఆయన చెప్పిన జోస్యం మాత్రం నిజం కాబోదు. బెయిల్ రద్దు కాదని నారాయణ అంటే, మరి నేను వేసిన పిటిషన్ మాటేంటి? మా ముఖ్యమంత్రిపై సీపీఐ నారాయణ లాంటి వారు అనేక రకాలుగా మాట్లాడినందుకే కదా.. ఆయన కడిగిన ముత్యంలా బయటికి రావాలనే ఉద్దేశంతో నేను పిటిషన్ వేసింది. ఏదేమైనా నారాయణ జోస్యం వందశాతం తప్పు అవుతుంది. ఆయన తన మాటల్ని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది'' అని ఎంపీ రఘురామ అన్నారు.

English summary
narasapuram ysrcp mp raghu rama krishnam raju on saturday once again made satirical comments on andhra pradesh chief minister ys jagan mohan reddy. amid modi govt gazette on andhra-telangana water dispute, the rebel mp said bifurcation issues are still pending. raghu rama condemns cpi narayana comments and said cm jagan bail will cancelled. rebel mp also slams laxmi parvathi over telugu academy issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X