• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎంపీ రఘురామ వివాదంలో మరో ట్విస్ట్ -జగన్ సర్కారుపై సుప్రీంకోర్టుకు ఆ రెండు ఛానళ్లు -ఎదురుదెబ్బ?

|

జస్టిస్ ఎన్వీ రమణపై సీఎం జగన్ అసాధారణ ఫిర్యాదు వ్యవహారం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు సుప్రీంకోర్టు వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అంశాలు మళ్లీ జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి. అధికార వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును రాజద్రోహం సెక్షన్ల కింద ఏపీ సీఐడీ అరెస్టు చేయడం, కస్టడీలో ఆయనపై దాడి జరిగినట్లు ఆరోపణలు రావడం, ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సీరియస్ గా పరిశీలిస్తున్నక్రమంలోనే మరో కీలక పరిణామం సంభవించింది. రఘురామపై రాజద్రోహం కేసుల్లో సహ నిందితులుగా ఉన్న రెండు న్యూస్ ఛానళ్లు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వివరాలివి..

  Raghu Rama Krishnam Raju పై పోలీసుల దాడి... షుగర్ వల్లే కాళ్లు అలా అంటూ YCP || Oneindia Telugu

   బట్టలు చించుకున్న రఘురామ -సుప్రీం షాక్ -సాయిరెడ్డి జారుడు బండ ఫిలాసఫీ -జగన్‌కు చంద్రబాబు సిఫార్సా? బట్టలు చించుకున్న రఘురామ -సుప్రీం షాక్ -సాయిరెడ్డి జారుడు బండ ఫిలాసఫీ -జగన్‌కు చంద్రబాబు సిఫార్సా?

  ఏ2, ఏ3గా టీవీ5, ఏబీఎన్..

  ఏ2, ఏ3గా టీవీ5, ఏబీఎన్..

  దాదాపు ఏడాదిన్నర కాలంగా వైసీపీ సర్కారుపై, సీఎం జగన్ పై అసాధారణ స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న రెబల్ ఎంపీ రఘురామ.. పథకం ప్రకారమే ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ, సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ మొన్న శుక్రవారం ఎఫ్‌ఐఆర్‌ 12/2021 నమోదు చేసింది. ఈ కేసుల్లో ఎంపీ రఘురామను A1గా పేర్కొనగా, A2గా టీవీ5 న్యూస్ ఛానల్, A3గా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్‌ను సీఐడీ ఎఫ్‌ఐర్‌లో పేర్కొంది. అంతేకాదు..

  బస్తర్‌లో అనూహ్య ఎన్‌కౌంటర్‌-పోలీస్ క్యాంపుపై మావోయిస్టుల దాడి-కాల్పుల్లో గ్రామస్తులు మృతి,ఏమైందంటే..బస్తర్‌లో అనూహ్య ఎన్‌కౌంటర్‌-పోలీస్ క్యాంపుపై మావోయిస్టుల దాడి-కాల్పుల్లో గ్రామస్తులు మృతి,ఏమైందంటే..

  రఘురామకు ప్రత్యేక స్లాట్లు..

  రఘురామకు ప్రత్యేక స్లాట్లు..

  వైసీపీ ఎంపీ రఘురామతోపాటు టీవీ5, ఏబీఎన్ ఛానళ్లపైనా కుట్రపూరిత నేరానికి పాల్పడం 120 (B) IPC, కులాలు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినందుకు 153 (A), బెదిరింపులకు పాల్పడినందుకు CRPC 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ అధికారులు.. ఆ రెండు ఛానళ్లు ఎంపీ రఘురామ కోసం ప్రత్యేక స్లాట్లు కేటాయించాయని, ఆయనతో కలిసి ప్రభుత్వంపై విషంజిమ్మించాయని ఆరోపించారు. కాగా, సదరు ఎఫ్ఐఆర్ లపై తదుపరి విచారణ జరగకుండా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆ రెండు న్యూస్ ఛానళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు..

  ఏఓఆర్‌ల ద్వారా పిటిషన్లు..

  ఏఓఆర్‌ల ద్వారా పిటిషన్లు..


  సుప్రీంకోర్టు అడ్వొకేట్ ఆన్ రికార్డు(ఏఓఆర్) గుంటూరు ప్రమోద్ కుమార్ ద్వారా ఏబీఎన్ ఛానల్ సుప్రీంకోర్టులో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. మరో అడ్వొకేట్ ఆన్ రికార్డు విపిన్ నాయర్ ద్వారా టీవీ 5 యాజమాన్యం ఆదివారం రాత్రే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో ఎంపీ రఘురామ పట్ల ఏపీ సర్కారు అనుసరించిన అనాగరిక విధానాన్నే తమ సంస్థలు లేదా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల అనుసరించే అవకాశాలు ఉన్నందున సుప్రీంకోర్టు తక్షణమే జోక్యం చేసుకోవాలని టీవీ5, ఏబీఎన్ లు కోరాయి. అంతేకాదు..

  జగన్ వచ్చాక మాపై కక్ష..

  జగన్ వచ్చాక మాపై కక్ష..

  ఏపీ సీఐడీ పెట్టిన దేశద్రోహం కేసులను సవాల్‌ చేస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కీలక అంశాలను ప్రస్తావించాయి. ఏడాదిన్నర కిందట వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మీడియా పట్ల అణిచివేత ధోరణి కొనసాగుతున్నదని, కొన్ని ఛానళ్లను టార్గెట్ చేస్తున్నారని, ఇప్పుడు రఘురామ వివాదంలోనూ ఉద్దేశపూర్వకంగానే ఎఫ్ఐఆర్ లలో తమను చేర్చారని టీవీ5, ఏబీఎన్‌ పేర్కొన్నాయి. న్యూస్ ఛానెళ్లపై దేశద్రోహం కేసులు పెట్టడం ముమ్మాటికీ పత్రికా స్వేఛ్చను కాలరాయడమేనని ఆ రెండు సంస్థలు ఆరోపించాయి. దీనిపై సుప్రీంకోర్టు సముచిత ఆదేశాలివ్వాలని కోరాయి. కాగా,

  పత్రికా స్వేచ్ఛపై సుప్రీం తాజా తీర్పు..

  పత్రికా స్వేచ్ఛపై సుప్రీం తాజా తీర్పు..

  ఎంపీ రఘురామ ఉదంతంలో ఆయనతోపాటు రెండు మీడియా సంస్థలపైనా దేశద్రోహం కేసులు నమోదు కావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. పబ్లిక్ ఫిగర్, అందునా ప్రజాప్రతినిధి అయిన రఘురామ అభిప్రాయాలను, జగన్ సర్కారుపై ఆయన చేసిన విమర్శలను ప్రసారం చేయడం దేశద్రోహం ఎలా అవుతుందని ఏబీఎన్, టీవీ5 ఛానళ్లు పిటిషన్ లో ప్రశ్నించాయి. ఏపీ సీఐడీ వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని, మీడియా సంస్థలపై జగన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాయి. కాగా, పత్రికా స్వేచ్ఛకు సంబంధించి గత వారంలో సుప్రీంకోర్టు పలు సంచలన ఆదేశాలిచ్చిన దరిమిలా టీవీ5, ఏబీఎన్ ల పిటిషన్లు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇటీవల ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భంలో మీడియాపై ఆంక్షలు విధించాలని ఈసీ కోరగా, అందుకు నిరాకరించిన ఈసీ.. మీడియాపై ఏ రకంగానూ ఆంక్షలు విధించడం, వార్తలను అడ్డుకోవడం సరికాదని వ్యాఖ్యానించడం తెలిసిందే.

  English summary
  Andhra-based news channels TV5 and ABN news have moved the Supreme Court against the ap cid FIR for sedition and other charges after it telecasted "offending speeches" made by YSRCP MP Raghu Rama Krishnam Raju. tv5 and abn channels claim "chilling effect" on media by jagan govt.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X