వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..

|
Google Oneindia TeluguNews

వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి విరుచుకుపడ్డారు. సీఎం జగన్‌పై తనదైన శైలిలో కామెంట్ చేశారు. ముఖ్యమంత్రికి అహం తారాస్థాయికి చేరిందని వివరించారు. తనపై పెట్టిన కేసులు చెల్లవని మరోసారి స్పష్టంచేశారు. కొందరి వల్లే ఏపీలో ఇలా జరుగుతోందని.. కానీ వారితో జగన్ భాగస్వామ్యులు అనే విషయం తనకే ఇప్పుడిప్పుడే బోధపడుతోందని వివరించారు. తాను ఇన్నాళ్లు జగన్‌కు తెలియక జరుగుతుందని అనుకున్నానని చెప్పారు. కానీ అంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతుందని తెలియజేశారు.

కుట్రలో జగన్‌కు భాగస్వామ్యం

కుట్రలో జగన్‌కు భాగస్వామ్యం

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన కామెంట్స్ చేశారు. సీఎం జగన్‌కు అహంకారం ఎక్కువగా ఉందని ఆరోపించారు. సీఎం పక్కన ఉన్న వారు కుట్రలు చేస్తున్నారని ఇదివరకు అనుకున్నా అని చెప్పారు. ఆ కుట్రలో సీఎం జగన్ కూడా ఉన్నారనుకోలేదని తెలిపారు. అదీ ఇప్పుడిప్పుడే బోధపడుతోందని చెప్పారు.

కోర్టులో చెల్లవు: రఘురామ

కోర్టులో చెల్లవు: రఘురామ

తనపై పెట్టిన కేసులు కోర్టుల్లో చెల్లవని రఘురామ స్పష్టంచేశారు. దీనిపై హోంశాఖ సెక్రటరీకి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని రఘురామకృష్ణరాజు విమర్శించారు. దీనిపై పునరాలోచన చేస్తే బాగుంటుందని తెలియజేశారు. ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని చెప్పారు.

 సీఎంలను పట్టించుకోరు

సీఎంలను పట్టించుకోరు

ఏ సీఎంను ఢిల్లీలో పట్టించుకోరని రఘురామ అన్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలు కేంద్రానికి ఒక్కటే అని చెప్పారు. ఎంపీలకు ఇచ్చిన ప్రాధాన్యత సీఎంలకు ఇవ్వరని పేర్కొన్నారు. ప్రభుత్వంపై నమ్మకం లేదని గతంలోనే చెప్పానని మరోసారి గుర్తుచేశారు. తాను పార్టీని ఒక్క మాట కూడా అనలేదని వివరించారు. పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఇందులో సందేహానికి తావులేదని కుండబద్దలు కొట్టీ మరీ చెప్పారు. దీనికి సంబంధించి పార్టీ ఇప్పటివరకు పార్లమెంట్‌లో విప్ ఇవ్వలేదని రఘురామకృష్ణరాజు తెలిపారు. అంటే తనను సస్పెండ్ చేయాలని పార్టీ కూడా భావించడం లేదని అర్థం వస్తోందని చెప్పారు. తనపై కొందరు కావాలనే బురద జల్లుతున్నారని వివరించారు.

English summary
ysrcp rebel mp raghu rama krishna raju slams cm ys jagan mohan reddy on various issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X