• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్: జగన్ సర్కార్ అప్పులపై కాగ్ దర్యాప్తు -ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ వినతి -జైలు శిక్ష తప్పదంటూ

|

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి సంబంధించి జగన్ సర్కారుపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తుండటం, ఇప్పటికే పరిమితి మించి అప్పులు చేసి ఉండటంతో కొత్త రుణాల కోసం ప్రభుత్వం రసహ్య గ్యారంటీలు ఇస్తున్నది ఆరోపిస్తున్న క్రమంలో నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ మరో అనూహ్య చర్యకు పాల్పడ్డారు. జగన్ సర్కారు చేసిన అప్పులపై రాజ్యంగ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) చేత దర్యాప్తు చేయించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు రఘురామ. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధానికి లేఖ, ఏపీ అప్పులు, జగన్ ఇంటి చుట్టూ నివాసాల కూల్చివేతలపైనా ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

పీకేతో నా మీటింగ్స్‌ను మోదీ వినేశాడు -పెగాసస్‌పై మమతా బెనర్జీ మరో బాంబు -ప్రధానితో భేటీ ఫిక్స్పీకేతో నా మీటింగ్స్‌ను మోదీ వినేశాడు -పెగాసస్‌పై మమతా బెనర్జీ మరో బాంబు -ప్రధానితో భేటీ ఫిక్స్

viral video: నిర్మల్ రోడ్లపై చేపల వేట -పరిస్థితిపై మంత్రికి సీఎం కేసీఆర్ ఫోన్ -మరో 24 గంటలు..viral video: నిర్మల్ రోడ్లపై చేపల వేట -పరిస్థితిపై మంత్రికి సీఎం కేసీఆర్ ఫోన్ -మరో 24 గంటలు..

అప్పుల కోసం జగన్ తిప్పలు..

అప్పుల కోసం జగన్ తిప్పలు..

‘‘అధిక అప్పుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నది. ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి రాష్ట్రం అప్పులు చేస్తుండటం, అది కూడా దొంగ చాటుగా, రహస్య గ్యారంటీలు ఇస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రాలు ఏ మేరకు అప్పులు చేయొచ్చనేదానిపై కేంద్రం 2003లోనే ఒక చట్టాన్ని చేసింది. ఒక ఏడాదిలో ఏపీ జీఎస్డీపీలో 3శాతం అప్పులు తీసుకునే వీలుంది. కరోనా పరిస్థితుల్లో దాన్ని 4.5 శాతానికి పెంచారు. ఆ లెక్కన ఏపీ 42వేల కోట్ల వరకు మాత్రమే రుణాలు తీసుకోవాలి. కానీ మధ్యలో విడిగా ఓ 17వేల కోట్ల అప్పులు తీసుకున్నారు. ప్రభుత్వ గ్యారంటీతో తీసుకున్నవే కాబట్టి ఆ 17వేల కోట్లనూ 42వేల కోట్ల లెక్కలోకి రావాల్సి ఉన్నా, అలా కూడదని, దఫాలుగా తగ్గించాలని ఏపీ సర్కారు కేంద్రాన్ని మొరపెట్టుకుంటున్నది. ఇది చాలదన్నట్లు..

అభివృద్ధి పేరుతో సంక్షేమానికి ఖర్చు

అభివృద్ధి పేరుతో సంక్షేమానికి ఖర్చు

ఎఫ్ఆర్బీఎం చట్టాలనుంచి తప్పించుకుని భారీగా రుణాలు పొందడానికి జగన్ సర్కారు అనేక ఎత్తుగడలు వేస్తున్నది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున కార్పొరేషన్లను సృష్టించారు. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో ఏకంగా 25వేల కోట్ల అప్పులు తెచ్చారు. బ్యాంకులకు ఏం గ్యారెంటీగా పెట్టారనే వివరాలను రహస్యంగా ఉంచారు. రాష్ట్రంలోని ఆస్పత్రులను తాకట్టుపెట్టి మెడికల్ ఇన్ఫ్రా కార్పొరేషన్ ద్వారా మరో 8వేల కోట్ల అప్పులు తేవడానికి ప్రణాళికలు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మొత్తం అప్పులను సంక్షేమ పథకాలకే ఖర్చు చేస్తున్నట్లూ ప్రభుత్వం చెబుతున్నది. గతంలో జగన్ తన కంపెనీల షేర్లు అధిక ధరలకు అమ్ముకోవడం ఆయన వ్యక్తిగత విషయమైతే, ఇప్పుడు ప్రభుత్వ నిర్వహణనూ ఆయన వ్యక్తిగత వ్యవహారంలాగా చూస్తున్నట్లు అర్థమవుతోంది. చట్టపరంగా నడుచుకోవాల్సిన ప్రభుత్వం ఇలా దొడ్డిదారిన అప్పులు చేయడం రాష్ట్ర భవిష్యత్తును చీకట్లోకి నెట్టినట్లే. చట్టవిరుద్దంగా అప్పులు చేస్తే రేప్పొద్దున జైలు శిక్షను కూడా అనుభవించాల్సి వస్తుంది. అందుకే..

  CM Jagan Delhi Tour In Next Week Becoming Crucial In AP Politics | Oneindia Telugu
   ఏపీని కాపాడేది మోదీ ఒక్కడే..

  ఏపీని కాపాడేది మోదీ ఒక్కడే..

  ఎఫ్ఆర్బీఎం చట్టాల ఉల్లంఘనలు ఒక అంశమైతే.. అసలు బ్యాంకులు ఏపీకి అప్పులు ఎందుకు ఎలా ఇస్తున్నాయనేది అతి ప్రధానమైన ప్రశ్న అవుతుంది. చట్టాలను అతిక్రమిస్తోన్న ఏపీ సర్కారుకు అప్పులు ఇచ్చే ముందు బ్యాంకులు ఒకటికి రెండుసార్లు ఆలోచిచుకోవాలని నేను హెచ్చరిస్తున్నా. గతంలోనూ ఈ అంశంపై నేను పార్లమెంట్ లో మాట్లాడారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశాను. ఏపీలో అప్పులపై కాగ్ విచారణకు ఆదేశించాలని కోరాను. అప్పుల ఊబి నుంచి ఏపీ ప్రజల్ని కాపాడే బాధ్యతను మోదీ చూడాలని కోరుతున్నా. ఏపీ దివాళ రాష్ట్రంగా మారకుండా చూడాలని విన్నవించుకుంటున్నా. జగన్ ఎప్పుడూ చెప్పేమాట.. పైన దేవుడున్నాడు, అన్నీ చూసుకుంటాడు అనుకోడానికి వీల్లేదు. ప్రజలను కర్మకు వదిలేయడం కరెక్ట్ కాదు...

   జగన్ గారూ.. నరఘోష మంచిది కాదు

  జగన్ గారూ.. నరఘోష మంచిది కాదు

  ఏపీ అప్పుల వ్యవహారంతోపాటు మరీ కీలక అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. జగన్ వ్యక్తిగత స్థాయిలో తనకున్న వనరులతో తాడేపల్లిలో ఓ మంచి ఇల్లు కట్టుకున్నాడు. అది ముఖ్యమంత్రి నివాసం కోసం ప్రభుత్వం చేపట్టిన నిర్మాణం కాదు. జగన్ ఇల్లున్న ప్రాంతంలోనే మరో 317మంది కూడా స్థలాలు కొన్నారు. ఇప్పుడు సెక్యూరిటీ పేరుతో ఆ ఇళ్లను కూలగొడుతుండటం ఎంత వరకు సమంజసం? రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి కొత్త ఇల్లులు కట్టిస్తానంటోన్న సీఎం.. ఆ 317 మందిని మాత్రం వేధించడం ఎందుకు? జగన్ గారూ.. నరఘోష మంచిదికాదు. ఆ 317 మంది ఉసురు మనకొద్దు. దయచేసి ఆ వ్యక్తులకు కూడా సముచిత రీతిలో ఇళ్లు కట్టివ్వండి'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

  English summary
  narasapuram ysrcp mp raghu rama krishnam raju once again slams andhra pradesh chief minister ys jagan mohan reddy amid state financial status. speaking to media on friday, the rebel mp told thet he has wrote a letter to prime minister narendra modi urging for a cag enquiry on ap govt borrowing. raghu rama alleged that jagan govt is taking huge loans despite frbm limit rules.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X