మరో లక్ష కోట్ల అప్పుకు జగన్ పథకం -అందుకే ఎయిడెడ్ జీవో -2ఏళ్లలో కట్టింది 5ఇళ్లు: ఎంపీ రఘురామ బాంబు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, జగన్ ప్రభుత్వం చేస్తోన్న భారీ అప్పులపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతుండగానే, ఏపీ అప్పులపై కేంద్రం వారానికో ప్రకటన చేస్తున్నది. కొత్త అప్పులపై కట్టడి విధించేలా కేంద్రం, బ్యాంకులు నిర్ణయం తీసుకోబోతున్నట్లు జగన్ వ్యతిరేక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కారు మరో లక్ష కోట్ల అప్పు చేసేందుకు ప్రణాళికలు రూపొందించిందని, అందుకోసమే ఎయిడెడ్ కాలేజీలపై జీవోను తెచ్చిందని ఆయన అన్నారు. బ్యాంకులు ఏపీకి అప్పివ్వరాదని ఎంపీ హెచ్చరించారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రఘురామ ఈ కామెంట్లు చేశారు. ఎంపీ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే...

ఎయిడెడ్ స్కీమ్ కాదు స్కామ్

ఎయిడెడ్ స్కీమ్ కాదు స్కామ్

''ఎడెడ్ కాలేజీలపై ప్రభుత్వం కన్ను పడిందని లెక్చరెర్లు, ప్రొఫెసర్లు మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ ఎయిడెడ్ స్కీమ్ లేదా స్కామ్ గురించి నేను చాలా ఎంక్వైరీ చేశాను. ప్రముఖ పత్రికల్లో దీనిపై కథనాలు కూడా వచ్చాయి. ఉదాహరణకు, గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ (ఏసీ) కాలేజీ, జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి (జేకేసీ) కాలేజీ, హిందూ కాలేజీ, ఏలూరులో యూనివర్సిటీ స్థాయిని తలదన్నే సీఆర్ రెడ్డి కాలేజీ, భీమవరంలో డీఎన్ఆర్ కాలేజీ, విజయనగరంలో ఎన్నో లక్షల మందికి విద్యాదానం చేసిన మహారాజా కాలేజీ, కాకినాడలో పిఠాపురం రాజా(పీఆర్) కాలేజీ, నెల్లూరులో వెంకటగిరి రాజా(వీఆర్) కాలేజీ, గుడివాడలో అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్) కాలేజీ.. ఇలా చాలా చోట్ల ఎన్నో ఏళ్లుగా ఆయా దాతలు వారి స్థలాన్ని, ధనాన్ని వెచ్చించి నెలకొల్పినవి ఎయిడెడ్ కాలేజీలుగా నడుస్తున్నాయి. చాలా వరకు దాతల ఆధీనంలో నడిచే ఈ కాలేజీల్లో కొంత శాతం మేరకు అధ్యాపకులకు ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుంది. ఎయిడెడ్ కాలేజీల్లో ప్రభుత్వ జీతం పొందే వారి సంఖ్య 25 శాతానికి మించి ఉండదు. ఇప్పుడు సీఎం జగన్ ఏం చేశారంటే..

జగన్ సర్కారు అనూహ్య జీవో..

జగన్ సర్కారు అనూహ్య జీవో..

రాష్ట్రంలో ఉన్న ఎయిడెడ్ కాలేజీలకు ఒక జీవో పంపారు.. మీ కాలేజీలు అన్నిటినీ ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. కాదూ, కాలేజీలను మీరే(దాతలే) నడుపుకోవాలంటే, మీ ఎయిడ్(ప్రభుత్వ సాయం) వదులుకోండి. సిబ్బందికి మీరే జీతాలు ఇచ్చుకోండి. కానీ ఫీజులు మాత్రం మేం చెప్పినట్లుగానే నిర్ధారించాలని జగన్ సర్కారు జీవోలో రాసుంది. మరి అమ్మ ఒడి ద్వారానైనా ఫీజులు ఇస్తారా లేదా అనేది గందరగోళంగా ఉంది. ఎయిడెడ్ కాలేజీల్లో క్వాలిటీ విద్యను అందించాలంటే బోధనా సిబ్బందికి మంచి జీతాలు.. అంటే, ప్రభుత్వ సిబ్బంది స్థాయిలో జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అందుకు వీలు లేకుండా ప్రభుత్వం తాను చెప్పిన ఫీజులనే వసూలు చేయాలని అంటోంది. పథకాల ద్వారా ఫీజులు ఇస్తుందో లేదో కూడా తెలీదు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితే ఏరోజు దివాళా తీస్తుందో, ప్రభుత్వం ఎప్పుడు చేతులెత్తేస్తుందో తెలీని పరిస్థితుల్లో ఇలా ఎయిడెడ్ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తే, రాబోయే రోజుల్లో పిల్లల భవిష్యత్తు ఏంటి

కాలేజీల భూములు అమ్మడానికే..

కాలేజీల భూములు అమ్మడానికే..

కొన్ని ఊర్లలో నర్సారావుపేట, చిలకలూరిపేట, చీరాల తదితర ఊర్లలో ఇప్పటికే ఎయిడెడ్ కాలేజీలు మూసేస్తే, విద్యార్థులు సుదూరాలకు వెళ్లాల్సి వస్తోంది. అసలీ ప్రభుత్వం ఏం చేయదల్చుకుంది అనేది మస్తిష్కానికి అందనంత దారుణంగా ఆలోచనలున్నాయని పెద్దలు చాలా మంది అంటున్నారు. ఎయిడెడ్ జీవోల్లో ఒక క్లాజు ఉంది. రాష్ట్రంలో సుమారు 140-150 ఎయిడెడ్ కాలేజీలు ఉంటే, అందులో ఎవరైనా ఈ ప్రభుత్వంతో తలనొప్పి ఎందుకులే అని సీఎం మాట వినడానికి సిద్ధమైతే మంచిదట. ఇటీవల పెట్టిన కాలేజీలు వింటే వినొచ్చుగాక గానీ, దశాబ్దాల కిందటే పెట్టిన కాలేజీల మాటేంటి ఉదాహరణకు, ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీకి వందల ఎకరాల భూములున్నాయి. ఈ ఎయిడెడ్ కాలేజీని జగన్ ప్రభుత్వం లాగేసుకుంటే, దాని భూములు అమ్మేసుకోవచ్చు. జీవోలో ఈ క్లాజు కూడా ఉంది.

మరో లక్ష కోట్ల అప్పుకు పథకం..

మరో లక్ష కోట్ల అప్పుకు పథకం..

జగన్ తన వ్యాపారాలు ఎలాగైతే లొసుగులతో చేశాడో, ప్రభుత్వ వ్యవస్థల్లోనూ వాటిని ప్రవేశపెడుతున్నారు. ఎయిడెడ్ కాలేజీల జీవోలోనూ అలాంటి క్లాజులే పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటేదైనా పెట్టి, దాని పేరిట కాలేజీలకు చెందిన 10వేల కోట్ల ఆస్తులు చూపించి రుణాలు పొందుతారు. ఈ ఎయిడెడ్ కాలేజీలను తెగనమ్మితే కనీసం ఓ లక్ష కోట్లు వస్తాయి. అంత డబ్బు వస్తే మరో ఏడాది కథ నడిపించొచ్చని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉంది. అయితే పైనున్నవాళ్లు(కేంద్రం) అప్రమత్తమై, ఏపీ సర్కారు అప్పుల్ని, ఎఫ్ఆర్బీఎం పరిధిని గర్హించింది. ఈ సందర్భంగా బ్యాంకర్లకు నేను మరోసారి వార్నింగ్ ఇస్తున్నా. జగన్ సర్కారుకు అప్పులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిబంధనల ఉల్లంఘనలను ప్రోత్సహించకండి.

ఆ చీడ పురుగుల వల్లే..

ఆ చీడ పురుగుల వల్లే..

గతంలో ఒక చీడ పురుగు చెప్పాడని, ఇద్దరు ముగ్గురు బ్యాంకర్లతో మాట్లాడి, నా మీద కేసులు కూడా పెట్టించారు. నా మీద కేసులు పెట్టడానికి ఆ చీడపురుగు కొంత పైకాన్ని కూడా జారవిడిచాడు. అంయితే, వాళ్లు ఫెయిల్ అయ్యారు కాబట్టి తాను జారవిడిచిన దానిని తిరిగి వసూలు చేయడానికి ఈ చీడపురుగు ప్రయత్నిస్తున్నట్లు నాకు తెలిసింది. నిబంధనల ప్రకారం, నిజాయితీగా వ్యాపారం చేసి, ఇలాంటి దిక్కుమాలిన ప్రజా ప్రతినిధుల ద్వారా ఇబ్బంది పడిన నేను.. మోస్ట్ సక్సెస్ ఫుల్ ఇండస్ట్రియలిస్టుగా 20 ఏళ్లపాటు కొనసాగిన నేను.. ఇలాంటి దుర్మార్గపు పాలకుల వలన ఇబ్బంది పడితే.. కొద్ది మంది బ్యాంకర్లను వీళ్లు కొనుగోలు చేసి, సీబీఐ అధికారులను కూడా కొనే ప్రయత్నం చేసి, పిచ్చిపిచ్చి కేసులు పెట్టాలని చూశారు. నేను మునిగిపోయాను కదా, అందరినీ ముంచాలి అనేదే ఆ చీడపురుగుల ధోరణి. అయినా సరే, నన్ను వాళ్లేమీ చేయలేరు. కేసుల నుంచి నేన క్లీన్ గా బయటపడతాను. జగన్ , విజయసాయిరెడ్డిక చెబుతున్నా.. మా పార్టీ అధినేతకు కాదు, సీఎం, ఎంపీగా చెబుతున్నా..

బ్యాంకులకు ఇదే నా వార్నింగ్..

బ్యాంకులకు ఇదే నా వార్నింగ్..

ఏపీకి పిచ్చిపిచ్చి అప్పులు ఇచ్చి బ్యాంకులు ఇబ్బందుల్లో పడొద్దు, రేపు ఎడ్యుకేషన్ కార్పొరేషన్ కు కూడా అప్పులు ఇవ్వొద్దు. ఎయిడెడ్ కాలేజీలు కూడా తమ భూముల్ని ప్రభుత్వానికి అప్పగించొద్దు. ఎందుకంటే, మంచి రోజులు తప్పకుండా వస్తాయి. ప్రభుత్వ ఆఫర్ ను తిరస్కరించండి, ఎయిడ్ ఉన్నా లేకున్నా కాలేజీలకు తప్పక మంచి రోజులు వస్తాయి. విద్యా సేవ చేయడానికి మీ తాతలు కట్టిన కాలేజీల్లో ఇప్పటికే లక్షల మందిని తయారు చేశారు. అలాంటి కాలేజీలను ప్రభుత్వానికి అప్పగిస్తే రాబోయే రోజుల్లో అమ్ముకోవడం తప్ప మరో దారి ఉండదు. ఆ జీవోలోనే చాలా క్లాజులు ఉన్నాయి. ప్రభుత్వ స్థలాల మధ్య కాలేజీ భూములుంటే లాగేసుకుంటామని కూడా జీవోలో ఉంది. అయితే ఇవేవీ కోర్టుల్లో నిలబడవు. అయితే, పూర్వవిద్యార్థులు స్పందించాలి.. తాము చదువుకున్న కాలేజీలను కాపాడాల్సిన బాధ్యతను మీరే తలెత్తుకోవాలి. కొన్ని రోజులు గట్టిగా నిలబడి కాలేజీలను కాపాడుకుంటే కచ్చితంగా మంచి రోజులు వస్తాయి. అంటే జగన్ ప్రభుత్వం మారిపోతుందని కాదు, ప్రభుత్వం మనస్తత్వం, ఆలోచనా విధానం మారుతుంది. కొన్ని నీలి ఛానల్స్ తప్ప ప్రజలు కూడా అండగా ఉంటారు.

అమ్మ ఒడి డబ్బులతో నాన్న తాగుడు..

అమ్మ ఒడి డబ్బులతో నాన్న తాగుడు..

కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజులను అమ్మ ఒడి పేరుతో అబ్దిదారులకు ఇస్తున్నాం. ఆ పథకం వచ్చిన వెంటనే కాలేజీ వాల్లంతా తల్లుల వెంట పడుతున్నారు. ఆ తల్లులేమో, డబ్బులన్నీ మగాళ్లు తాగడానికి తీసుకెళ్లారని వాపోతున్నారు. దాదాపు 25 శాతం కేసులు ఇలాంటివే ఉన్నాయి. చాలా మంది పరీక్షల సమయానికి కూడా డబ్బులు కట్టలేక డ్రాప్ అవుతున్నారు. అసలు ఎందుకిదంతా కేవలం మీరు తయారు చేసే మద్యం కోసం, ఆ ముగ్గురి ఆదాయం కోసం కాదా పెద్ద ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ఫీజును రూ75 వేల నుంచి 35 వేలకు దించారు. మరి ఆ డబ్బులైనా తల్లులకు ఒకేసారి ఇస్తున్నారా కాలేజీలు బాగోకపోతే తల్లులు తమ పిల్లల్ని వేరే కాలేజీలో వేస్తారా విద్యా దీవెన, వల్లకాడు దీవెన అని పేపర్లలో యాడ్లు వేసుకుంటే, వీళ్లు పోయి కాలేజీల్లో డబ్బులు కట్టాలా ఇదంతా మద్యం అమ్మకాలకు సంబంధం లేదంటారా ప్రజల అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

Recommended Video

    Revant Reddy has strongly criticized Ktr for illegally entering funds into Mrs. Shailima's account
    2ఏళ్లలో జగన్ సర్కారు కట్టింది 5ఇళ్లు

    2ఏళ్లలో జగన్ సర్కారు కట్టింది 5ఇళ్లు

    ఎన్నికలకు ముందు.. వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతే రాజధాని అని ఢంకా బజాయించాం. ఆంధ్రాలో మా పార్టీ తరఫున గెలిచినవారంతా అమరావతి రాజధాని అంశంపైనే గెలిచారు. వ్యక్తిగత గ్లామర్ కూడా తోడైంది. రాయలసీమలోలాగా కోస్తా, ఇతర ప్రాంతాల్లో ఎవరికీ భారీ మెజార్టీలు రాలేదు. అమరావతిలోనే రాజధాని అని సాక్షి పేపర్ లోనే ప్రచారం చేశారు. ఇప్పుడామాటలు ఏమయ్యాయో తెలీదు. ఇక, గడిచిన రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో నిర్మితమైన ఇళ్లపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ఏపీలో రెండేళ్లలో కేవలం 5 ఇళ్లు మాత్రమే కట్టారని సమాధానం వచ్చింది, రెండేళ్లకు ఐదు ఇళ్లుల చొప్పున మనం తలపెట్టిన 30 లక్షల ఇళ్లు కట్టాలంటే, కనీసం 50వేల సంవత్సరాలు పడుతుందని నిపుణులు లెక్కలు కట్టారు. ఇదీ మన ట్రాక్ రికార్డు. మరి ఇళ్ల పేరుతో ఇప్పటిదాకా పేపర్లలో ప్రకటనలకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం. నిర్మలా సీతారామనేమో ఏపీలోని పథకాలపై పెద్దాయన మోదీ బొమ్మ వేయాలని అడుగుతున్నారు. మా వాళ్లు వేస్తారో లేదో..'' అని ఎంపీ రఘురామకృదష్ణంరాజు అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+