వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామ

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ జైలుకు పంపేదాకా ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టబోనని శపథం చేసిన నర్సాపురం వైసీపీ రఘురామకృష్ణంరాజు ఆ దిశగా మరో అడుగు వేశారు. హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో శుక్రవారం నాటి పరిణామాల తర్వాత న్యాయం గెలుపు దాదాపు ఖరారైందని, ఏ1 జగన్ కు తోడుగా ఏ2 విజయసాయిరెడ్డిని కూడా మళ్లీ జైలుకు పంపుతానని రెబల్ ఎంపీ అన్నారు. జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ ముగిసన తర్వాత ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తీర్పు ఆగస్టు 25కు వాయిదా పడటంపైనా షాకింగ్ పాయింట్ లేవనెత్తారు.

Recommended Video

YS Jagan's Bail - Shocking Turn |Raghu Rama Krishnam Raju | CBI Court | Oneindia Telugu

జగన్ బెయిల్ రద్దు: సాయిరెడ్డికి దేహశుద్ధి -కొట్టింది ఎవరో తెలుసా? -ఇంకొద్ది గంటల్లోనే: ఎంపీ రఘురామజగన్ బెయిల్ రద్దు: సాయిరెడ్డికి దేహశుద్ధి -కొట్టింది ఎవరో తెలుసా? -ఇంకొద్ది గంటల్లోనే: ఎంపీ రఘురామ

కామసూత్ర పుట్టిన భారత్‌లో పోర్న్ నిషేధమా -అది కూడా కళా రూపమే: నటి సోమి అలీ సంచలనంకామసూత్ర పుట్టిన భారత్‌లో పోర్న్ నిషేధమా -అది కూడా కళా రూపమే: నటి సోమి అలీ సంచలనం

జగన్ బెయిల్ రద్దు తీర్పు..

జగన్ బెయిల్ రద్దు తీర్పు..

క్విడ్ ప్రోకో సంబంధిత పలు కేసుల్లో నిదితుడైన వైఎస్ జగన్ తన ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని కేసును ప్రభావితం చేస్తున్నారని, సహ నిందితులకు ప్రభుత్వ, పార్టీ పరమైన ప్రయోజనాలు కల్పిస్తున్నారని, సీబీఐ అధికారులకు సైతం తాయిలాలిస్తూ, విచారణలకు కూడా హాజరు కావడంలేదని ఆరోపిస్తూ, వెంటనే బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ హైదరాబాద్ సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్ పై నేటితో వాదనలు ముగిశాయి. రిజాయిండర్ ఇస్తామంటూ నెల రోజులపాటు వాయిదాలు కోరిన సీబీఐ లాయర్లు చివరికి నిర్ణయాధికారిన్ని కోర్టుకే వదిలేయాలన్న పాత మాటకే కట్టుబడి ఉంటామని చెప్పడంతో జడ్జి తీర్పును రాశారు. అయితే ఆ తీర్పును ఆగస్టు 25న వెలువరిస్తానని, అప్పటిదాకా విచారణను వాయిదా వేశారు. ఇటు సీబీఐ కోర్టు తీర్పు తర్వాత అటు ఢిల్లీలో ఉన్న రఘురామ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఎంపీ రఘురామ ఏం చెప్పారో ఆయన మాట్లోనే...

 మళ్లీ వాయిదా కోరిన సీబీఐ..

మళ్లీ వాయిదా కోరిన సీబీఐ..

''ఎన్నెన్నో కేసుల్లో ఏ1గా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అంటే, ప్రస్తుత మన గౌరవ ముఖ్యమంత్రిగారి బెయిల్ రద్దు చేయాల్సిందిగా సీబీఐ కోర్టులో నేను దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు ఎట్టకేలకు ముగిశారు. ఏన్నో కేసుల్లో ఏ1గా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ అలా అలా వాయిదా పడుతూ, చివరికి ఇవాళ వాదనలు ముగిసి, తీర్పు రిజర్వ్ అయింది. కోర్టులో ఏం జరిగిందో చెప్పాలనే ప్రెస్ మీట్ పెట్టాను. గత సోమవారం జ్వరం పేరుతో వాయిదా కోరిన సీబీఐ లాయర్లు.. ఇవాళేమో, ఢిల్లీ నుంచి పత్రాలు రాలేదని చెప్పి మళ్లీ వాయిదా కోరారు. దానికి మా లాయర్లు అభ్యంతరం చెప్పారు. లిఖిత పూర్వక వాదనలు ఇస్తామన్న కమిట్మెంట్ కు విరుద్ధంగా వాయిదాల మీద వాయిదాలు కోరడం కరెక్ట్ కాదని, ఇంకొంత టైమ్ ఇచ్చినా సీబీఐ వాళ్లు కౌంటర్ దాఖలు చేసే ఉద్దేశం లేనట్లుగానే ఉందని మా లాయర్లు గట్టిగా వాదించారు. అంతేకాదు..

సీబీఐ షాకింగ్ టర్న్.. చేసేది లేక

సీబీఐ షాకింగ్ టర్న్.. చేసేది లేక

నిజానికి జగన్ బెయిల్ రద్దు కోరుతూ రెండేళ్ల కిందటి వరకూ సీబీఐ గట్టిగా పోరాడింది. కేసు గురించి మాట్లాడినందుకు ఓ మాజీ అధికారిపై చర్యలకు కూడా సిద్ధమైంది. జగన్ బెయిల్ రద్దు విషయంలో ఒకప్పుడు చిన్న ఘటనలకే ఉలిక్కిపడ్డ సీబీఐ... ఇప్పుడు మాత్రం ఒళ్లుగగుర్పొడిచే ఘటనలు జరుగుతున్నా నిమ్మకకు నీరెత్తినట్లు వ్యవహరించడం, చిన్న కాగితాన్ని కూడా సమర్పించలేని స్థితికి దిగజారడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. ఢిల్లీ నుంచి కాగితాలు రాలేదన్న కారణంతో వాయిదా కుదరదని మా లాయర్లు తెగేసి చెప్పడంతో సీబీఐ వాళ్లు టర్న్ తీసుకోక తప్పలేదు. ఎవరెవరికో ఫోన్లు చేసుకున్న తర్వాత.. పాత విధానానికే, అంటే, బెయిల్ రద్దు అంశం పూర్తిగా కోర్టు విచక్షణకే వదిలేస్తున్నట్లు జడ్జిగారికి సీబీఐ లాయర్లు చెప్పారు. తద్వారా కేసు నెల రోజుల కిందట ఏదైతే దశలో ఉందో, మళ్లీ అక్కడికే వచ్చి చేరింది. కోర్టు విచక్షణకే వదిలేస్తున్నామని కనీసం ఇప్పటికైనా చెప్పినందుకు సీబీఐ లాయర్లకు ధన్యవాదాలు. ఇక తీర్పు విషయానొకస్తే..

 14 రోజుల్లో రావాల్సిన తీర్పు 25న?

14 రోజుల్లో రావాల్సిన తీర్పు 25న?

సాధారణంగా హైకోర్టు కంటే కింది స్థాయి కోర్టులు అన్నీ తమ తీర్పులు రిజర్వ్ చేసిన తర్వాత వాటిని 14 రోజుల్లో వెల్లడించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు నాతో చెప్పారు. మరి జగన్ బెయిల్ రద్దు తీర్పును జడ్జిగారు ఏకంగా ఆగస్టు 25కు వాయిదా వేశారు. 14 రోజులకు బదులు 25 రోజుల గ్యాప్ ఎందుకొచ్చింది? అనే విషయంపై నేను కామెంట్ చేయదల్చుకోలేదు. ఒకవేళ సీబీఐ కోర్టులో న్యాయం దక్కపోతే, హైకోర్టుకు వెళతాను, అక్కడా కాదంటే ఇంకా పైకోర్టుకు వెళతాను. అయితే, ఆలస్యమైనప్పటికీ కచ్చితంగా న్యాయం దక్కుతుందనే అనుకుంటున్నా. వచ్చే నెల 25 దాకా ఉత్కంఠతో ఎదురు చూస్తుంటా, అంతేకాదు..

ఏ1తోపాటే ఏ2 సాయిరెడ్డి బెయిల్ రద్దు..

ఏ1తోపాటే ఏ2 సాయిరెడ్డి బెయిల్ రద్దు..

కలిసి నేరాలు చేసిన ఏ1 జగన్ బెయిల్ రద్దయితే, ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి విదేశాలకు పారిపోడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. పాస్ పోర్టు కోసం తిరుగుతున్నారు. మరి ఆయన పారిపోకముందే, తన బెయిల్ కూడా రద్దు చేయాల్సిందిగా నేను మరో పిటిషన్ వేయబోతున్నాను. జగన్ బెయిల్ రద్దు కేసులో వాదనలు పూర్తయ్యాయి కాబట్టి, ఇక సాయిరెడ్డి బెయిల్ రద్దు సంగతి చూస్తాను. ఎంచక్కా ఇద్దరూ మళ్లీ జైలులో కలిసుంటారు. తర్వలోనే ఆ వివరాలు మీడియాకు తెలియజేస్తాను.. '' అని ఎంపీ రఘురామకృష్నంరాజు అన్నారు.

English summary
narsapuram ysrcp mp raghurama krishnam raju, who is also a petitioner in ap cm ys jagan bail cancellation plea, has told media that justice will prevail and jagan would go to jail. speaking to media on friday at delhi, the rebel mp said now he will fight for ysrcp mp vijaya sai reddy bail cancellation. hyderabad cbi court on friday reserved the verdict of jagan bail to august 25.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X