వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ తప్పు దిద్దుకున్నారు- జస్టిస్ రమణ అంశంలో చెంపపెట్టులా ఆమె - మోదీదే బాధ్యత: ఎంపీ రఘురామ

|
Google Oneindia TeluguNews

''జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని 18 నెలలు పూర్తయింది. కనీసం ఇన్ని రోజుల తర్వాతైనా ఆయన తన తప్పులు సరిదిద్దుకున్నారు. ఇవాళ పత్రికల్లో చేసిన ప్రకటనే అందుకు నిదర్శనం. అవినీతికి ఆస్కారం లేకుండా.. పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ.. సరసమైన ధరలకే.. నాణ్యమైన ఇసుక అందజేస్తానని.. దీనికి ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నానని బహిరంగ ప్రకటన చేయడం ముమ్మాటికి ఆయనలో మార్పునకు సంకేతమే'' అంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.

చైనీస్ నూడుల్స్ తిని 9 మంది మృతి - ఆ ఫుడ్‌ను చెత్తబుట్టలో పారేయండి - ఆరోగ్య శాఖ ఆదేశంచైనీస్ నూడుల్స్ తిని 9 మంది మృతి - ఆ ఫుడ్‌ను చెత్తబుట్టలో పారేయండి - ఆరోగ్య శాఖ ఆదేశం

రాజధాని రచ్చబండ..

రాజధాని రచ్చబండ..

ఏడాదిన్నర తర్వాతైనా ఆంధ్రప్రదేశ్ లో నూతన ఇసుక విధానంపై జగన్ ప్రజల ముందుకు రావడం చాలా గొప్ప మార్పు అని, అన్ని తప్పుల విషయాల్లోనూ ఇలానే సీఎం తనను తాను మార్చుకుంటూ పోతే రాష్ట్రప్రజలకు నూరుశాతం న్యాయం జరుగుతుందని ఎంపీ రఘురామ అన్నారు. రాజధాని రచ్చబండ పేరుతో వరుస ప్రెస్ మీట్లు నిర్వహిస్తోన్న ఆయన గురువారం.. జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ ఫిర్యాదు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ, అమరావతికి ఐదేళ్లు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

తప్పుల ఒప్పుకోలు ప్రకటన..

తప్పుల ఒప్పుకోలు ప్రకటన..

‘‘ఇవాళ ఉదయం ‘ఎవరో రావాలి.. నీ హృదయం కదిలించాలి..'' అనే పాట విన్నాను. మన సీఎం జగన్ హృదయాన్ని కూడా ఎవరైనా కదిలిస్తే బాగుంటుంది అని ఫీలయ్యా. సరిగ్గా ఇవాళ అదే జరిగింది. ఏపీ సర్కారు ఇవాళ కొత్త ఇసుక విధానాన్ని ప్రకటించింది. ఆ ప్రకటనలో గత విధానాలు, ప్రభుత్వం దృష్టికి వచ్చిన విషయాల గురించి రాశారు. మరో వారం పాటు సూచనలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. ఇప్పటిదాకా ఇసుక విషయంలో అవినీతి జరిగిందని, పారదర్శకత పాటించలేదని, ధరలు సరసంగా లేవని, నాణ్యమైన ఇసుక ఇవ్వలేదని స్పష్టమైపోయింది. గతంలో ఇవే సూచనలు చేసిన నాపై.. డిస్ క్వాలిఫై అస్త్రం వేశారు. ఏది ఏమైనా ఇప్పటికైనా జగన్ మారారు. ఇది చాలా సంతోషించదగ్గ పరిణామం. తప్పులు ఎవరైనా చేస్తారు, వాటిని సరిదిద్దుకోవడమే దైవత్వం.

చెత్తగాళ్లపై చర్యలుంటేనే..

చెత్తగాళ్లపై చర్యలుంటేనే..

తప్పులతో కూడిన ఇసుక విధానాన్ని వెనక్కి తీసుకున్నట్లే.. నా విషయంలోనూ తమ పొరపాట్లను సరిదిద్దుకోవాలని సీఎంను కోరబోను. కానీ ప్రజలు అడిగే అవకాశం ఉంది కాబట్టి ఆ మేరకు విధానాలు సరిచేసుకుంటే మంచిది. సీఎం జగన్ కు ఉన్న వందలాది మంది సలహాదారుల్లో ఒక్కరు కూడా ప్రజల బాధల్ని ఆయన దాకా తీసుకెళ్లడంలేదు. ఇప్పటికైనా ఆ చెత్తగాళ్లపై చర్యలు తీసుకోవాలి. వాళ్లు జిల్లాలకు జిల్లాలు పంచుకుతింటున్నారు. ముఖ్యనేతల్ని అనే ధైర్యం లేకున్నా కనీసం కొద్దిమంది ఇసుకదొంగలనైనా సీఎం శిక్షించాలి. తద్వారా ప్రజలకు మంచి సందేశం వెళుతుంది. మరో ముఖ్యమైన అంశం..

ఇందిరా జైసింగ్ అద్భుతంగా చెప్పారు..

ఇందిరా జైసింగ్ అద్భుతంగా చెప్పారు..

హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిపై ఏపీ సీఎం జగన్ చేసిన ఆరోపణలపై మరో ప్రముఖ వ్యక్తి తీవ్రంగా స్పందించారు. ఆమె ఎవరో కాదు.. మన దేశానికి మొట్టమొదటి మహిళా సొలిసిటర్ జనరల్, సీనియర్ అడ్వొకేట్, ఇందిరా జైసింగ్. గురువారం ఓ ఇంగ్లీష్ మీడియాలో ఆమె కాలమ్ రాశారు. జగన్ తీరు ఏదో హిట్ అండ్ రన్ లాగా ఉందని, జడ్జిలపై బురద వేసి, వాళ్లే కడుక్కుంటారులే అన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని, దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఇందిర అభిప్రాయపడ్డారు. జడ్జిలపై చర్యలు ఆర్టికల్ 124 ప్రకారమే తీసుకోవాలిగానీ ఇష్టారీతిగా మాట్లాడటం సరికాదని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ, అదే రాజ్యాంగ సంస్థ అయిన కోర్టులపై దాడులు సరికాదని జైసింగ్ కరాకండిగా చెప్పారు. న్యాయవ్యవస్థపై దాడి చేయాలనుకునేవాళ్లకు ఈ మాటలు చెంపపెట్టులాంటివే.

నైతికంగా మోదీ బాధ్యత వహించాలి..

నైతికంగా మోదీ బాధ్యత వహించాలి..

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన జరిగి గురువారానికి ఐదేళ్లు పూర్తయింది. 18 నెలలుగా అక్కడ పనులు స్తంభించిపోయినా.. అంతకు ముందు మూడేళ్లపాటు సాగిన అత్యున్నత అభివృద్ధి ఎవరూ కాదనలేనిది. దాని కేంద్రం కూడా తన వంతు సాయం చేసింది. కాగా, రాజధాని విషయంలో కేంద్రం పాత్ర పరిమితమే అయినప్పటికీ, రైతుల దీన స్థితి, పోరాట స్ఫూర్తిని చూసిన తర్వాతైనా దేశాధినేతగా, ప్రధానిగా మోదీ స్పందించాలి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసే హక్కు కేంద్రానికి ఉన్నప్పుడు.. రాజధానిని మూడు ముక్కలు చేస్తే కనీసం మాట్లాడే చొరవ తీసుకోలేకపోయారా? అని అమరావతి ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగపరంగా కాకపోయినా, నైతికంగానైనా మోదీ అమరావతి బాధ్యత తీసుకోవాలని ఆయనకు లేఖ రాయబోతున్నాను'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు.

Recommended Video

Free Crop Insurance Scheme ఉచిత పంటల భీమా పథకం అమలుకు నిర్ణయం AP Govt,వైఎస్ఆర్ జలకళలో మార్పులు...!!

స్వలింగ సంపర్కం పాపం కాదు - హోమోసెక్సువల్స్‌కు చట్టపరమైన రక్షణ ఉండాలి: పోప్ ఫ్రాన్సిస్స్వలింగ సంపర్కం పాపం కాదు - హోమోసెక్సువల్స్‌కు చట్టపరమైన రక్షణ ఉండాలి: పోప్ ఫ్రాన్సిస్

English summary
narsapuram ysrcp mp raghurama krishnam raju praised andhra pradesh chief minister for making new sand policy. other side the rebel mp criticize jagan over clash with judges. speaking to media on thursday at delhi mp raghurama made key remarks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X