వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం రేసులో చిత్తూరు వైసీపీ నేత - జగన్‌పై 2లక్షల మెజార్టీ ఇలా - వాలంటీర్ల దుస్థితి:ఎంపీ రఘురామ

|
Google Oneindia TeluguNews

హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలపై అనుచిత ఫిర్యాదులు కోర్టు ధిక్కరణ కిందికే వస్తాయని, ఆ నేరానికి పాల్పడిన జగన్ ముఖ్యమంత్రి సీటు నుంచి దిగుపోవాల్సి ఉంటుందని, తదుపరి ముఖ్యమంత్రి పదవికోసం జగన్ కుటుంబీకులతోపాటు చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కీలక నేత కూడా రేసులో నిలిచారని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. జగన్ పై పోటీ చేసి 2లక్షల మెజార్టీతో గెలుస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నానన్న రెబల్ ఎంపీ.. అది ఎలా సాధ్యమో వివరించారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏం చెప్పారంటే..

జగన్ దెబ్బ.. రఘురామరాజు అబ్బా - జస్టిస్ రమణపై ఇవి చూశారా? 777 రెడ్లకు పదవులు: వైసీపీ ఎంపీజగన్ దెబ్బ.. రఘురామరాజు అబ్బా - జస్టిస్ రమణపై ఇవి చూశారా? 777 రెడ్లకు పదవులు: వైసీపీ ఎంపీ

 ఆ సీమ నేత ఎవరు?

ఆ సీమ నేత ఎవరు?

‘‘అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని హడావుడి చేస్తున్నారు. కానీ రాయలసీమలోని పుంగనూరు వ్యవహరాం అందరికీ తెలియాలి. చిత్తూరు జిల్లా పుంగనూరులో కొత్తగా బైపాస్ రోడ్డు నిర్మిస్తే.. దాని చుట్టుపక్కల భూములన్నీ ఓ రెడ్డి నాయకుడు ముందుగానే కొనుగోలు చేసినట్లు తెలసింది. అదే జిల్లాలో పాల వ్యాపారంలో దిట్టగా పేరుపొందిన మరో వైసీపీ నేత.. తన కంపెనీవి కాకుండా వేరే పాల వ్యాన్లు అటుగా వెళితే డ్రైవర్లు, క్లీనర్లను కొట్టేస్తారట. అవసరమైతే లారీలను సైతందండిస్తారట. ఇప్పుడా పాల వ్యాపారి.. పండ్ల వ్యాపారంలోకి ప్రవేశించి, రైతుల నుంచి పంటలు దోచుకుంటున్నారట. ఆ కుటుంబం నుంచే ఒకరు ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్నారు. కోర్టు ధిక్కార నేరం కింద జగన్ జైలుకు పోతే.. ఆ చిత్తూరు నేత సీఎం రేసులో ఉన్నారు. ఆ వ్యక్తులెవరో తెలుసుకుని విచారణ చేయించాలి. ఇకపోతే,

రూ.5 పేపర్ కు రూ.4లక్షలు

రూ.5 పేపర్ కు రూ.4లక్షలు

ఇటీవల గుంటూరు కార్పొరేషన్ ఒక ప్రకటన జారీ చేసింది. ప్రతి వార్డు సచివాలయానికి రెండు కాపీల చొప్పున సాక్షి దిన పత్రికను సరఫరా చేయడానికి వర్క్ ఆర్డర్ ఇచ్చారు. అన్ని పత్రికలను వదిలేసి ఒక్కదాన్నే తీసుకోవడం ఒక ఎత్తైతే.. ఏకంగా 4.14లక్షల అడ్వాన్స్ ఇచ్చారు. ఈ లెక్కన ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాలు కూడా సాక్షి పత్రికకు ఏడాది చందా చెల్లించాలనుకుంటే, ఆ విధానం కరెక్టో కాదో కాస్త ఆలోచించాలి. దీనిపైనా ఎవరైనా కోర్టుకు వెళితే పార్టీకి ఇబ్బందులు తప్పవు. కోర్టు తీర్పులిస్తే తిరిగి న్యాయవ్యవస్థపై దాడి చేస్తారు. సాక్షి పత్రికను బలవంతంగా అమ్ముతోన్న విషయం బహుశా సీఎంకు తెలిసి ఉండకపోవచ్చు. ఇదిలా ఉంటే..

 4లక్షల వాలంటీర్లకు రూ.5వేలా?

4లక్షల వాలంటీర్లకు రూ.5వేలా?

మన పత్రిక కదాని రూ.5.50 విలువైన ప్రతికి అడ్వాన్సుగా రూ.4లక్షలు చెల్లించాం. కానీ బండ చారిరీ చేస్తోన్న 4 లక్షల మంది వాలంటీర్లకు మాత్రం రూ.5వేల జీతాన్ని కూడా సరిగా ఇవ్వడం లేదు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వాలంటీర్ల వ్యవస్థ గురించి ట్రంప్, పుతిన్ లాంటి వాళ్లు కూడా గొప్పగా చెబుతుంటారు. నిజానికి వాలంటీర్లకు ఇచ్చే జీతం చాలా తక్కువ. కూలీలు కూడా ఇవాళ రోజుకు 500 సంపాదిస్తున్నారు. అలాంటిది వాలంటీర్లు నెలకు 5వేల జీతానికి పనిచేస్తున్నారు. జీతాలను 8 వేలకు పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు. జీతం పెంచకపోగా, ఇచ్చే 5వేలను కూడా సరిగా ఇవ్వడంలేదు. వాలంటీర్లతో చాకిరీ చేయిస్తూ ఇలా చేయడం కరెక్ట్ కాదు. 4లక్షల వాలంటీర్ల తరఫున ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.

జగన్‌పై గెలుపు ఇలా సాధ్యం..

జగన్‌పై గెలుపు ఇలా సాధ్యం..

నన్ను డిస్ క్వాలిఫై చేయడం వైసీపీ నేతల తరం కాదు కాబట్టి నేనొక ప్రపోజల్ పెట్టాను. మూడు రాజధానులు వర్సెస్ అమరావతి పాయింటుతో రాజధాని రిఫరెండంగా ఉప ఎన్నికకు వెళదామని చెప్పాను. నేరుగా జగనే బరిలోకి దిగితే.. ఆయనపై 2లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని చెప్పాను. దీనికి సోషల్ మీడియాలో నాపై వెకిలి కామెంట్లు చేశారు. అసలు లెక్క ఏంటంటే.. నర్సాపురంలో నాకు వైసీపీ నుంచి దక్కిన ఓ పక్కన పెడదాం.. పవన్ కల్యాణ్, చంద్రబాబులు అమరావతిలోనే రాజధాని ఉండాలని అంటున్నారు కదా.. అమరావతి రిఫరెండంగా నేను ఉప ఎన్నికలకు వెళితే.. మిగతా పార్టీలు పోటీకి నిలబడవు.. తద్వారా ఆ పార్టీల ఓట్లు నాకే పడతాయి. నిజంగా జగనే పోటీకి నిలబడితే ఆయనను కచ్చితంగా ఓడించాలనుకునే వాళ్లు కూడా నాకే ఓటేస్తారు. ఆ లెక్కన నాకు కనీసం 2 లక్షల ఓట్ల మెజార్టీ ఖాయం'' అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

Recommended Video

AP CM YS Jagan ఇంటి ముందు భజరంగ్ దల్ నిరసన, అరెస్ట్

క్రిస్మస్‌ నాటికి చెదపురుగులు నాశనం-జగన్‌కు మోదీ మద్దతు వట్టి సొల్లు - ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్క్రిస్మస్‌ నాటికి చెదపురుగులు నాశనం-జగన్‌కు మోదీ మద్దతు వట్టి సొల్లు - ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్

English summary
ysrcp MP Raghu Rama Krishnam raju alleges that one of chittoor district ysrcp leader is in race for chief minster post if jagan would prove guilty as contempt of court. the rebel mp also challenges cn jagan for by election in narsapuram parliamentary constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X