• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీబీఐ దాడుల వెనుక అసలు కథ - ప్రవీణ్ ప్రకాశ్ బ్యాచ్‌మేట్ ద్వారా: ఎంపీ రఘురామ సంచలనం

|

సొంతపార్టీని తీవ్రంగా విమర్శిస్తోన్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ దాడుల వ్యవహారం దేశమంతటా హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ పట్ల విధేయత ప్రదర్శిస్తోన్న ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థ చర్యలకు దిగడమేంటనే చర్చ జరిగింది. తొలుత దాడులే జరగలేదన్న ఎంపీ చెప్పగా, ఆయనపై కేసు, సోదాలకు సంబంధించి సీబీఐ ప్రెస్ నోట్ విడుదల చేయడం తెలిసిందే.

శుక్రవారం మరోసారి మీడియా ముందుకు వచ్చిన రఘరామ.. తనపై సీబీఐ దాడుల వెనుక ఉన్న అసలు కథ ఇదంటూ సంచలన విషయాలను వెల్లడించారు. ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ సందర్భంగా తెర వెనుక ఏం జరిగిందో వివరించారు. అదే క్రమంలో తన కంపెనీ వ్యవహారలపైనా క్లారిటీ ఇచ్చారు. ఎంపీ ప్రెస్ మీట్ ఆయన మాటల్లోనే..

ట్రెండ్ పట్టడంలో ఆయన తర్వాతే - ప్రభుత్వాలు మారినా పాశ్వాన్ పదవి పోలేదు - రీనా శర్మతో రెండో పెళ్లిట్రెండ్ పట్టడంలో ఆయన తర్వాతే - ప్రభుత్వాలు మారినా పాశ్వాన్ పదవి పోలేదు - రీనా శర్మతో రెండో పెళ్లి

నా అప్పు రూ.4వేల కోట్లు మాత్రమే

నా అప్పు రూ.4వేల కోట్లు మాత్రమే

‘‘రోజుకన్నా ఇవాళ్టి ‘రాజధాని రచ్చబడ్డ' కార్యక్రమం కొంచెం విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే.. పాత పథకాలకు కొత్తగా జగనన్న పేరు జోడించి, కోట్ల కొద్దీ ప్రకటనలతో ప్రజాధనాన్ని దోచుకుతినే సాక్షి పత్రిక.. ఇవాళ నాకోసం అర పేజీ కేటాయించింది. బ్యాంకు రుణం ఎగ్గొట్టి సొంత ఖాతాలకు తరలించానని హెడ్డింగ్ పెట్టారు. ఈ పనికిమాలిన వెధవకు ఎవడు చెప్పాడో? ఎగనామానికి రఘనామం అని మరో టైటిల్ పెట్టారు. నాకు రూ.23వేల కోట్ల లోన్లు ఉన్నాయని సాక్షి వెధవ, దరిద్రుడు రాశాడు. నిజానికి నేను నిర్మించింది 1200 మెగావాట్లు పవర్ ప్లాంటు. విద్యుత్ రంగంలో పరిస్థితులు తారుమారు కావడంతో ఆగిపోయింది మరో 600 మెగావాట్లు. మొత్తం 1800 మెగావాట్ల ప్రాజెక్టుకుగానూ నాకు మంజూరైన రుణం రూ.4వేల కోట్ల లోపే ఉంటుంది. అందులో రూ.2వేల కోట్లు కనీసం విత్ డ్రా కూడా చేయలేదు.

సీబీఐ దాడి విషయమేకాదు..

సీబీఐ దాడి విషయమేకాదు..

గురువారం సీబీఐ వాళ్లు నా దగ్గరికి రాలేదు. ఎందుకో తెలీదు. ఎప్పుడో సాయంత్రానికిగానీ మా ఆఫీసుకు వచ్చారు. అయితే, సీబీఐ దాడులు అనేది ఇక్కడ సబ్జెక్ట్ కానేకాదు. అసలు విషయం ఇండ్-భరత్ కంపెనీ గురించే. ఈ సంస్థ.. రూ. 830 కోట్లను నా(రఘురామ) ఖాతాల్లోకి మళ్లించారని సాక్షి దరిద్రుడు చెప్పాడు. క్రెడిబులిటీ లేని పేపర్ అని అందరికీ తెలిసినప్పటికీ.. మరీ ఇంత దరిద్రంగా రాయాల్సిన అవసరం లేదు. పూర్వాపరాలు తెలుసుకున్నాకే ఏదైనా రాయాలి.

మాకు కర్ణాటకలో 300 మెగావాట్ల పవర్ ప్లాంటుకు అవకాశం వచ్చింది. కానీ పర్యావరణ అనుమతుల్లో ఇబ్బందులు రావడంతో దాన్ని తమిళనాడుకు మార్చాం. అది నాలుగేళ్లపాటు నడిచింది. ఆ తర్వాత తమిళనాడులో పీపీఏ సమస్యలు రావడంతో దానిపై న్యాయపోరాటం జరుగుతోంది. ఇక్కడ విషయమేంటంటే, నాలుగేళ్లపాటు బాగా నడిచిన ప్రాజెక్టును అసలు కట్టనేలేదని, డబ్బులు కొట్టేశారని ఎలా రాస్తారు ఈ పిచ్చి వెధవలు? నా పవర్ ప్లాంటుకు సంబంధించి వర్కింగ్ క్యాపిటల్ విషయంలో అనుమానంగా ఉందని, కోల్ డిస్పోజల్ గురించి ఆడిట్ కొర్రీ ఉంది, అయినాసరే నాలుగేళ్లు ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఇబ్బందులు తలెత్తిన తర్వాత మరోసారి ఆడిటింగ్ చేసుకోమని నేను అన్నాను.

అడ్డంగా దొరికిన ఎంపీ రఘురామ - దాడులు, కేసుపై సీబీఐ కీలక ప్రకటన - ఎవరూ మిస్ కావొద్దని ట్వీట్అడ్డంగా దొరికిన ఎంపీ రఘురామ - దాడులు, కేసుపై సీబీఐ కీలక ప్రకటన - ఎవరూ మిస్ కావొద్దని ట్వీట్

జగతి లాగా దొంగ పనులు చేయలేదు..

జగతి లాగా దొంగ పనులు చేయలేదు..

సాధారణంగా ఒక మెగావాట్ విద్యుత్ కు ఐదు నుంచి ఆరు కోట్లు ఉంటుంది. నేను ఈక్విటీ ఎక్కువ తీసుకొచ్చి, విదేశాల్లో నాకు తెలిసిన వాళ్లు నిధులు పెట్టారు. అంతేకానీ, నేను.. జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ లాగా ఆకాశం నుంచి ఊడిపడినట్లు.. 10 రూపాయల ప్రీమియంకు రూ.300, రూ400 ప్రీమియం ఇస్తాం తీసుకోండని బతిమాలి పెట్టలేదు. మా వరకు నిజాయితీగా రుణాలు తీసుకున్నాం కానీ, ఇక్కడున్నట్లే నాడు తమిళనాడులో రాజకీయ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ పనికిమాలిన రాజకీయ వ్యవస్థ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారని అర్థమైన తర్వాత.. నేను కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్నాను. కానీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్లయింది.

మోదీతో జగన్ భేటీ నాడే..

మోదీతో జగన్ భేటీ నాడే..

నా కంపెనీలు, ఆస్తులపై సీబీఐ వాళ్లు నిన్న(8న) దాడులు చేస్తే.. కాదు, ఈనెల 6వ తేదీన జరిగినట్లు సాక్షి దరిద్రులు రాశారు. ఆ రోజు.. ప్రధాని నరేంద్ర మోదీ తనను మనుగడ లేదనే టెన్షన్ తో ఆంధ్రా నుంచి వచ్చిన నాయకుణ్ని అక్కున చేర్చుకోవాలనే భయంతో సీఎంకు అపాయింట్ మెంట్ ఇచ్చారట. ఆ భేటీ కోసం ఎవరేం చేశారనేది అందరికీ తెలుసు. అయినా ఆ భేటీతో పొడిచేసిందేమీ లేదు. కేంద్ర కేబినెట్ లో పదవులంటూ వార్తలు రాయించుకున్నారు. వైసీపీ లాంటి అవినీతి కూపంతో మేం కలవబోమని బీజేపీ నేత సునీల్ దేవధర్ చాలా ఘాటుగా క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే..

ప్రవీణ్ ప్రకాశ్ బ్యాచ్ మేట్ ద్వారా

ప్రవీణ్ ప్రకాశ్ బ్యాచ్ మేట్ ద్వారా

వైసీపీ ముఖ్యనేతలు ఢిల్లీకి వచ్చి చేసిందేంటంటే.. ఏపీ సమస్యల గురించి కాదు. ఆ రోజు ఏం జరిగిందంటే.. ప్రముఖ పారిశ్రామిక వేత్త అని చెప్పుకునే ఓ ఎంపీ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైర్మన్ తోపాటు ఇంకొందరిని తీసుకొచ్చి కేంద్ర ఆర్థిక శాఖతో మాట్లాడించారు. పాత ఫిర్యాదు ఒకటుంది కదా.. దాన్ని చూడండని వేడుకున్నారు. ఇది ఎలా జరిగిందంటే.. ఏపీ సీఎంవో కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ బ్యాచ్ మేట్ ఒకడు కేంద్ర ఆర్థిక శాఖలో ఉన్నాడు. వాణ్ని పట్టుకుని.. నాపై ఉన్న పాత ఫిర్యాదును చూడమని వైసీపీ నేతలు అడిగారు. ఆ తర్వాత జరిగిన తతంగం మీకు తెలిసిందే. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దాని గురించి నేనేమీ మాట్లాడను. అలాగని భయపడాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆ ప్రాజెక్టు 4ఏళ్లు నడిచిన మాట వాస్తవం'' అని ఎంపీ రఘురామ వివరించారు.

English summary
YSRCP rebel MP raghurama krishnam Raju on friday clarifies on cbi raids against him. the mp alleges that ysrcp leaders wantedly approached PNB chairman and with the help of ias officers created all the show.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X