• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రవీణ్ ప్రకాశ్ పని పట్టాల్సింది జగనే -చెప్పు దెబ్బలు -షాకింగ్ సర్వే చూశారా?: ఎంపీ రఘురామ

|

సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను ఉద్దేశించి నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనూహ్య వ్యాఖ్యలు చేశారు. 'రాజధాని రచ్చబండ' కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీ.. ఏపీ సీఎంవో, మూడు రాజధానులపై తాజా సర్వే, తనపై సస్పెన్షన్ అంశాలపై కీలక విషయాలు చెప్పుకొచ్చారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

అడ్డంగా దొరికిన విజయసాయిరెడ్డి - మోదీ-జగన్ మధ్య ఉల్కాపాతం -పోలవరం అసలు కథ: ఎంపీ రఘురామ

సీఎస్ ఆదేశాలు తూనాబొడ్డు

సీఎస్ ఆదేశాలు తూనాబొడ్డు

‘‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నే మీటింగ్ కు రావాలంటూ ఆదేశించి విమర్శలపాలైన సీఎంవో అధికారి ప్రవీణ్ ప్రకాశ్ తాజాగా మరో చర్యకు పూనుకున్నట్లు తెలిసింది. ఈ ఏడాది దసరా ముహుర్తం అటు ఇటు ఉండటంతో పండుగ తర్వాతిరోజు కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించగా, ఏపీలో మాత్రం ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. దీనిపై చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఆదేశాలు ఇవ్వగా.. వాటిని తూనాబొడ్డుగా భావించిన ప్రవీణ్ ప్రకాశ్ సెలవుల్ని రద్దు చేశారని తెలిసింది. ఇది..

ప్రవీణ్ ప్రకాశ్ మెడకు గంట..

ప్రవీణ్ ప్రకాశ్ మెడకు గంట..

సీఎంవోలో ఉన్నత స్థానంలో ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ ఇలా తనపై అధికారులను, ఉన్నత పదవిలో ఉన్నవాళ్లను ధిక్కరించడం రాజ్యాంగేతర చర్యలు కావా? ప్రవీణ్ ప్రకాశ్ అచ్చంగా రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని అందరూ ఆరోపిస్తున్నారు. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అనుచిత తీరు వల్ల ప్రభుత్వం ఇన్ని రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాలా? అతను ఎలాంటి పనులు చేస్తున్నాడో ముఖ్యమంత్రికి చెప్పేదెవరు? మెడలో గంట కట్టాల్సింది ఎవరు? కనీసం జగన్ ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలకు దిగాలి. ఆ అధికారి వ్యవహారంపై సీఎం ఆత్మావలోకనం చేసుకోవాలి. రాజ్యాంగం గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ మరో కీలకమైన విషయం చెబుతా..

 అప్పటిదాకా కాపాడండి..

అప్పటిదాకా కాపాడండి..

కులం లేని క్రైస్తవ మతాన్ని పాటిస్తూ, హిదువులుగా ఎస్సీ రిజర్వేషన్లు పొందడం రాజ్యాంగ విరుద్ధం అని ఇటీవల నేను చేసిన కామెంట్లపై మా వైసీపీ ఆధ్వర్యంలోనే వ్యతిరేక ప్రదర్శనలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటోన్న నన్ను ద్రోహి అనడం కరెక్టుకాదు. చర్చిలకు నిధులు, పాస్టర్లకు భృతి ఇవ్వడం ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమే. కావాలంటే క్రైస్తవంలోనూ కులాలు ఉండేలా రాజ్యాంగ సవరణ చేసుకోండి. అప్పటిదాకా ఉన్న రాజ్యాంగాన్నా కాపాడాలని జగన్ ను కోరుతున్నా.

  Raghurama Krishnam Raju ఎపిసోడ్ తో BJP లో చీలికలు!! || Oneindia Telugu
  సర్వే ఫలితం.. చెప్పు దెబ్బలు

  సర్వే ఫలితం.. చెప్పు దెబ్బలు

  ప్రముఖ జాతీయ పత్రిక ‘హిందూ'.. ఏపీలో మూడు రాజధానుల అంశంపై తాజాగా ప్రజాభిప్రాయం సేకరించింది. ఆ సర్వే ఫలితాలు మా వైసీపీకి వ్యతిరేకంగా వచ్చాయి. ఎలాగంటే.. సర్వేలో పాల్గొన్నవాళ్లలో మొత్తం 81 శాతం మంది జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కేవలం 18 శాతం మందే మూడు రాజధానుల్ని సమర్థించారు. కనీసం ఇప్పటికైనా జగన్ పునరాలోచించాలి. ‘అమరావతి శంకుస్థాపనకు ఐదేళ్లు' రోజున ఆటోల్లో వచ్చి మూడు రాజధానుల నినాదాలు చేసిన లోకల్ పెయిడ్ ఆర్టిస్టుల గురించి నేను మాట్లాడినందుకు.. నా ఫ్లెక్సీని చెప్పులతో కొట్టారు. ఇదిలాగే కొనసాగితే.. నా ఫ్లెక్లీని కొట్టినవాళ్లందరూ నిజంగానే చెప్పు దెబ్బలు తినాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నా. ఆరోజు ఎంతో దూరంలేదు'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

  మళ్లీ నిప్పులుచెరిగిన స్పీకర్ సీతారాం - అప్పుడు వైసీపీకీ టీడీపీ గతే - అచ్చెన్నపై అప్పల్రాజు ఫైర్

  English summary
  narsapuram ysrcp mp raghurama krishnam raju alleges that key officials in andhra pradesh chief minister's office were violating rules. naming several offices he suggested cm jagan to take action. the rebel mp spoke to media in delhi on tuesday. mp alos made remarks on amaravati capital.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X